కంటెంట్‌కు వెళ్లండి

circa 1010–970 BC

The Reign of David

David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.

1,230 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 1 దినవృత్తాంతములు 11:17సుమారు క్రీ.పూ. 1055

    దావీదు నీళ్ల కోసం ఆరాటపడుతూ, “బేత్లెహేము ద్వారం దగ్గర ఉన్న బావి నీళ్లు ఎవరైనా నాకు తెచ్చి ఇస్తే ఎంత బాగుండేది!” అన్నాడు.

  2. 1 దినవృత్తాంతములు 11:18సుమారు క్రీ.పూ. 1055

    అప్పుడు ఆ ముగ్గురు ఫిలిష్తీయుల శిబిరం గుండా చొరబడి బేత్లెహేము ద్వారం దగ్గర ఉన్న బావి నీళ్లు తోడుకొని దావీదుకు తెచ్చి ఇచ్చారు. అయితే అతడు ఆ నీళ్లు త్రాగడానికి నిరాకరించాడు; బదులుగా వాటిని యెహోవాకు అర్పణగా పారబోశాడు.

  3. 1 దినవృత్తాంతములు 11:19సుమారు క్రీ.పూ. 1055

    “నేను ఈ నీళ్లు త్రాగకుండా నా దేవుడు నన్ను కాపాడును గాక! ప్రాణానికి తెగించి వెళ్లి ఈ నీళ్లు తెచ్చిన ఈ మనుష్యుల రక్తాన్ని నేను త్రాగాలా?” అన్నాడు. వాటిని తీసుకురావడానికి వారు తమ ప్రాణాలకు తెగించి తెచ్చారు కాబట్టి దావీదు ఆ నీళ్లు త్రాగలేదు. ఆ ముగ్గురు పరాక్రమ యోధులు చేసిన సాహసాలు ఇలాంటివి.

  4. 1 దినవృత్తాంతములు 11:20సుమారు క్రీ.పూ. 1055

    యోవాబు సోదరుడైన అబీషై ఆ ముగ్గురికి నాయకుడు. ఒక యుద్ధంలో అతడు తన ఈటెను ఆడిస్తూ మూడువందల మందిని చంపాడు కాబట్టి అతడు ఆ ముగ్గురిలా ప్రసిద్ధి పొందాడు.

  5. 1 దినవృత్తాంతములు 11:21సుమారు క్రీ.పూ. 1055

    అతడు ఆ ముగ్గురికంటే రెండింతలు గౌరవించబడి వారి దళాధిపతి అయ్యాడు కాని వారిలో ఒకనిగా చేర్చబడలేదు.

  6. 1 దినవృత్తాంతములు 11:22సుమారు క్రీ.పూ. 1055

    గొప్ప పోరాట వీరుడు, కబ్సెయేలుకు చెందిన యెహోయాదా కుమారుడైన బెనాయా గొప్ప సాహస కార్యాలను చేశాడు. అతడు మోయాబు యొక్క పరాక్రమశాలులైన ఇద్దరిని చంపాడు. అంతేకాక, మంచుపడే కాలంలో ఒక గుంటలోకి దిగి సింహాన్ని చంపాడు.

  7. 1 దినవృత్తాంతములు 11:23సుమారు క్రీ.పూ. 1055

    అతడు అయిదు మూరల ఎత్తున్న ఈజిప్టు వానిని చంపాడు. ఆ ఈజిప్టు వాని చేతిలో నేతపనివాని కర్రలాంటి ఈటె ఉన్నప్పటికీ, బెనాయా దుడ్డుకర్ర పట్టుకుని వాని మీదికి పోయాడు. ఆ ఈజిప్టు వాని చేతిలో ఉన్న ఈటెను లాక్కుని దానితోనే అతన్ని చంపాడు.

  8. 1 దినవృత్తాంతములు 11:24సుమారు క్రీ.పూ. 1055

    యెహోయాదా కుమారుడైన బెనాయా సాహస కార్యాలు ఇలాంటివి; అతడు కూడా ఆ ముగ్గురు గొప్ప యోధులతో పాటు ప్రసిద్ధి పొందాడు.

  9. 1 దినవృత్తాంతములు 11:25సుమారు క్రీ.పూ. 1055

    ఆ ముప్పైమందిలో ఘనతకెక్కాడు గాని, ఆ ముగ్గురి జాబితాలో చేర్చబడలేదు. దావీదు అతన్ని తన అంగరక్షకుల నాయకునిగా నియమించాడు.

  10. 1 దినవృత్తాంతములు 11:26సుమారు క్రీ.పూ. 1055

    పరాక్రమముగల బలాఢ్యులు వీరే: యోవాబు తమ్ముడైన అశాహేలు, బేత్లెహేముకు చెందిన దోదో కుమారుడైన ఎల్హానాను,

  11. 1 దినవృత్తాంతములు 11:27సుమారు క్రీ.పూ. 1055

    హరోరీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు,

  12. 1 దినవృత్తాంతములు 11:28సుమారు క్రీ.పూ. 1055

    తెకోవాకు చెందిన ఇక్కేషు కుమారుడైన ఈరా, అనాతోతుకు చెందిన అబీయెజెరు,

  13. 1 దినవృత్తాంతములు 11:29సుమారు క్రీ.పూ. 1055

    హుషాతీయుడైన సిబ్బెకై, అహోహీయుడైన ఈలై,

  14. 1 దినవృత్తాంతములు 11:30సుమారు క్రీ.పూ. 1055

    నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనా కుమారుడు హేలెదు,

  15. 1 దినవృత్తాంతములు 11:31సుమారు క్రీ.పూ. 1055

    బెన్యామీనీయుల గిబియాకు చెందిన రీబై కుమారుడు ఇత్తయి, పిరాతోనీయుడైన బెనాయా,

  16. 1 దినవృత్తాంతములు 11:32సుమారు క్రీ.పూ. 1055

    గాయషు కనుమలకు చెందిన హూరై, అర్బాతీయుడైన అబీయేలు,

  17. 1 దినవృత్తాంతములు 11:33సుమారు క్రీ.పూ. 1055

    బహరూమీయుడైన అజ్మావెతు, షయల్బోనీయుడైన ఎల్యహ్బా,

  18. 1 దినవృత్తాంతములు 11:34సుమారు క్రీ.పూ. 1055

    గిజోనీయుడైన హాషేము కుమారులు, హరారీయుడైన షాగే కుమారుడైన యోనాతాను,

  19. 1 దినవృత్తాంతములు 11:35సుమారు క్రీ.పూ. 1055

    హరారీయుడైన శాకారు కుమారుడైన అహీయాము, ఊరు కుమారుడైన ఎలీపాలు,

  20. 1 దినవృత్తాంతములు 11:36సుమారు క్రీ.పూ. 1055

    మెకేరాతీయుడైన హెఫెరు, పెలోనీయుడైన అహీయా,

  21. 1 దినవృత్తాంతములు 11:37సుమారు క్రీ.పూ. 1055

    కర్మెలీయుడైన హెజ్రో, ఎజ్బయి కుమారుడైన నయరై,

  22. 1 దినవృత్తాంతములు 11:38సుమారు క్రీ.పూ. 1055

    నాతాను సోదరుడైన యోవేలు, హగ్రీ కుమారుడైన మిబ్హారు,

  23. 1 దినవృత్తాంతములు 11:39సుమారు క్రీ.పూ. 1055

    అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై, ఇతడు సెరూయా కుమారుడైన యోవాబు ఆయుధాలను మోసేవాడు,

  24. 1 దినవృత్తాంతములు 11:40సుమారు క్రీ.పూ. 1055

    ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,

  25. 1 దినవృత్తాంతములు 11:41సుమారు క్రీ.పూ. 1055

    హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కుమారుడైన జాబాదు,