Skip to content

Jerusalem

753 verses · 2 known names

ఇలా కూడా పిలుస్తారు: Jerusalem's

31.7700, 35.2300 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Jerusalem ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహోషువ హాయిని పట్టుకుని పూర్తిగా నాశనం చేసి, యెరికోకు దాని రాజుకు చేసినట్లు హాయికి దాని రాజుకు చేశాడని, గిబియోను ప్రజలు ఇశ్రాయేలుతో సమాధాన ఒప్పందం చేసుకుని వారితో కలిసిపోయారని యెరూషలేము రాజైన అదోనీ-సెదెకు విన్నాడు.

  2. కాబట్టి యెరూషలేము రాజైన అదోనీ-సెదెకు హెబ్రోను రాజైన హోహాము, యర్మూతు రాజైన పిరాము, లాకీషు రాజైన యాఫీయా, ఎగ్లోను రాజైన దెబీరులకు,

  3. అమోరీయుల అయిదుగురు రాజులు అనగా యెరూషలేము, హెబ్రోను, యర్మూతు, లాకీషు, ఎగ్లోను రాజులు ఒకటిగా చేరి, తమ సైనికులందరితో కలిసి వెళ్లి గిబియోనీయులతో యుద్ధం చేశారు.

  4. కాబట్టి వారు ఆ అయిదుగురు రాజులను అనగా యెరూషలేము, హెబ్రోను, యర్మూతు, లాకీషు, ఎగ్లోను యొక్క రాజులను గుహ నుండి బయటకు తెచ్చారు.

  5. యెరూషలేము రాజు ఒక్కడు హెబ్రోను రాజు ఒక్కడు

  6. ఆ తర్వాత అది యెబూసీయుల పట్టణం (అంటే, యెరూషలేము) దక్షిణ వాలు వెంబడి బెన్ హిన్నోము లోయవరకు వెళ్లింది. అక్కడినుండి అది రెఫాయీము లోయకు ఉత్తరాన ఉన్న హిన్నోము లోయకు పశ్చిమాన ఉన్న కొండపై వరకు వ్యాపించింది.

  7. యెరూషలేములో నివసిస్తున్న యెబూసీయులను యూదా వారు వెళ్లగొట్టలేకపోయారు; నేటి వరకు యెబూసీయులు యూదా ప్రజలతో కలిసి అక్కడ నివసిస్తున్నారు.

  8. సేలా ఎలెపు, యెబూసి పట్టణం (యెరూషలేము) గిబియా, కిర్యత్ అనేవి పద్నాలుగు పట్టణాలు వాటి గ్రామాలు,

  9. అప్పుడు రాజైన అదోని-బెజెకు, “ఇలా కాలు చేతుల బొటన వ్రేళ్ళు కోయబడిన డెబ్బైమంది రాజులు నా బల్లక్రింద పడిన ముక్కలు ఏరుకునేవారు. నేను వారికి చేసిన దానికి దేవుడు నాకు తగిన ప్రతిఫలమిచ్చారు” అని అన్నాడు. వారు అతన్ని యెరూషలేముకు తీసుకువచ్చారు, అతడక్కడ చనిపోయాడు.

  10. యూదా వారు యెరూషలేము మీద దాడి చేసి దానిని పట్టుకుని అక్కడి ప్రజలను ఖడ్గంతో చంపి, వారు పట్టణాన్ని కాల్చివేశారు.

  11. అయితే బెన్యామీను గోత్రం వారు యెరూషలేములో నివసిస్తున్న యెబూసీయులను తరమలేదు; ఇప్పటివరకు యెబూసీయులు బెన్యామీనీయులతో కలిసి నివసిస్తున్నారు.

  12. కాని ఇంకొక రాత్రి ఉండడానికి అతడు ఒప్పుకోకుండా తన ఉంపుడుగత్తెను తీసుకుని కట్టిన రెండు గాడిదలతో యెబూసు అనగా యెరూషలేము వైపు వెళ్లాడు.

  13. దావీదు ఆ ఫిలిష్తీయుని తలను యెరూషలేముకు తీసుకువచ్చాడు. ఫిలిష్తీయుని ఆయుధాలను తన సొంత డేరాలో ఉంచాడు.

  14. హెబ్రోనులో యూదా వారిని ఏడు సంవత్సరాల ఆరు నెలలు పరిపాలించగా యెరూషలేములో ఇశ్రాయేలు, యూదా వారిని ముప్పై మూడు సంవత్సరాలు పరిపాలించాడు.

  15. యెబూసీయుల మీద దాడి చేయడానికి రాజు, అతని మనుష్యులు యెరూషలేముకు వెళ్లారు. దావీదు లోపలికి రాలేడని భావించిన యెబూసీయులు దావీదుతో, “నీవు లోపలికి రాలేవు; ఇక్కడున్న గ్రుడ్డివారు కుంటివారు నిన్ను తరిమివేస్తారు” అన్నారు.

  16. హెబ్రోను నుండి వచ్చిన తర్వాత దావీదు యెరూషలేములో మరికొందరిని భార్యలుగా ఉపపత్నులుగా చేసుకున్న తర్వాత ఇంకా చాలామంది కుమారులు కుమార్తెలు పుట్టారు.

  17. యెరూషలేములో అతనికి పుట్టిన పిల్లల పేర్లు ఇవి: షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను,

  18. దావీదు హదదెజెరు సైన్యాధిపతులకు చెందిన బంగారు డాళ్లను తీసుకుని వాటిని యెరూషలేముకు తెచ్చాడు.

  19. మెఫీబోషెతు యెరూషలేములో నివసించి నిత్యం రాజు బల్ల దగ్గర భోజనం చేస్తూ ఉన్నాడు. అతని రెండు కాళ్లు కుంటివి.

  20. అరామీయులు పారిపోయారని గ్రహించిన అమ్మోనీయులు అబీషై ఎదుట నుండి పారిపోయి పట్టణంలోకి వెళ్లారు. అమ్మోనీయులతో పోరాటం మాని యోవాబు యెరూషలేముకు తిరిగి వచ్చాడు.

  21. వసంతకాలంలో రాజులు యుద్ధానికి బయలుదేరే కాలంలో, దావీదు యోవాబును తన మనుష్యులతో ఇశ్రాయేలు సైన్యమంతటితో పంపించగా, వారు అమ్మోనీయులను నాశనం చేసి రబ్బా పట్టణాన్ని ముట్టడించారు. కాని దావీదు యెరూషలేములోనే ఉండిపోయాడు.

  22. అందుకు దావీదు, “సరే, ఈ రోజు కూడా ఇక్కడే ఉండు. రేపు నేను నిన్ను వెనుకకు పంపిస్తాను” అని ఊరియాతో చెప్పాడు. కాబట్టి ఊరియా ఆ రోజు, మరుసటిరోజు యెరూషలేములోనే ఉండిపోయాడు.

  23. అక్కడి ప్రజలను బయటకు తీసుకువచ్చి రంపతో, పదునైన ఇనుప పనిముట్లతో, గొడ్డళ్ళతో కఠినమైన పని చేయించాడు. ఇటుక బట్టీలలో వారితో పని చేయించాడు. దావీదు అమ్మోనీయుల పట్టణాలన్నిటికి ఈ విధంగా చేశాడు. తర్వాత అతడు అతని సైన్యమంతా యెరూషలేముకు తిరిగి వచ్చారు.

  24. అప్పుడు యోవాబు గెషూరు వెళ్లి అబ్షాలోమును యెరూషలేముకు తీసుకువచ్చాడు.

  25. రాజు ముఖాన్ని చూడకుండ అబ్షాలోము రెండు సంవత్సరాలు యెరూషలేములో నివసించాడు.