Skip to content

Benjamin

157 వచనాలు · 26 కుటుంబ సభ్యులు

Benjamin ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. రాహేలు చనిపోతూ తన కుమారునికి బెన్-ఓని అని పేరు పెట్టింది. కానీ అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడు.

  2. రాహేలు కుమారులు: యోసేపు, బెన్యామీను.

  3. అయితే యాకోబు యోసేపు తమ్ముడైన బెన్యామీనును పంపలేదు ఎందుకంటే అతనికి ఏదైన హాని కలుగుతుందని భయపడ్డాడు.

  4. వారి తండ్రి యాకోబు వారితో, “మీరు నన్ను పిల్లలు కోల్పోయేలా చేశారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, ఇప్పుడు బెన్యామీనును కూడా తీసుకెళ్లాలని చూస్తున్నారు. ప్రతిదీ నాకు వ్యతిరేకంగా ఉంది!” అని అన్నాడు.

  5. సర్వశక్తిగల దేవుడు ఆ మనుష్యుని ఎదుట కరుణ చూపును గాక తద్వారా మీ ఇంకొక సోదరుడు బెన్యామీను మీతో తిరిగి వచ్చేలా అనుమతిస్తాడు. నా మట్టుకైతే, ఒకవేళ నేను కోల్పోవలసి వస్తే కోల్పోతాను.”

  6. కాబట్టి ఆ మనుష్యులు కానుకలను, రెట్టింపు డబ్బును, బెన్యామీనును కూడా తీసుకుని త్వరగా ఈజిప్టుకు వెళ్లి యోసేపు ఎదుట హాజరయ్యారు.

  7. యోసేపు వారితో బెన్యామీనును చూసి తన గృహనిర్వాహకునితో, “ఈ మనుష్యులను నా ఇంటికి తీసుకెళ్లి, ఒక జంతువును వధించి, భోజనం సిద్ధం చేయి; వారు మధ్యాహ్నం నాతో భోజనం చేస్తారు” అని చెప్పాడు.

  8. యోసేపు కళ్ళెత్తి తన తమ్ముడు అనగా తన సొంత తల్లి కుమారుడైన బెన్యామీనును చూసి, “మీరు నాకు చెప్పిన మీ చిన్న తమ్ముడు ఇతడేనా?” అని అడిగి, “నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక!” అని అన్నాడు.

  9. యోసేపు బల్ల నుండి వారికి భోజనం వడ్డించబడినప్పుడు, ఇతరులకంటే అయిదు రెట్లు ఎక్కువగా బెన్యామీనుకు వడ్డించారు. కాబట్టి వారు అతనితో స్వేచ్ఛగా విందు చేసుకున్నారు, త్రాగారు.

  10. అప్పుడు గృహనిర్వాహకుడు పెద్దవాడి నుండి ప్రారంభించి చిన్నవాడి వరకు సోదా చేశాడు. ఆ గిన్నె బెన్యామీను గోనెసంచిలో దొరికింది.

  11. “మాట్లాడుతుంది నిజంగా నేనే అని స్వయంగా మీరు, నా తమ్ముడైన బెన్యామీను చూడవచ్చు.

  12. తర్వాత తన సోదరుడైన బెన్యామీనుపై మెడ మీద చేతులు వేసి, ఏడ్చాడు, బెన్యామీను అతన్ని హత్తుకుని ఏడ్చాడు.

  13. అతడు వారందరికి క్రొత్త బట్టలు ఇచ్చాడు, కాని బెన్యామీనుకు మూడువందల షెకెళ్ళ వెండి, అయిదు జతల బట్టలు ఇచ్చాడు.

  14. యాకోబు భార్య రాహేలు యొక్క కుమారులు: యోసేపు, బెన్యామీను.

  15. బెన్యామీను కుమారులు: బేల, బెకెరు, అష్బేలు, గెరా, నయమాను, ఏహీ, రోషు, ముప్పీము, హుప్పీము, అర్దు.

  16. “బెన్యామీను ఆకలితో ఉన్న తోడేలు వంటివాడు; ఉదయం అతడు ఎరను మ్రింగుతాడు, సాయంత్రం దోచుకున్నది పంచుతాడు.”

  17. ఇశ్శాఖారు, జెబూలూను, బెన్యామీను;

  18. బెన్యామీను గోత్రం నుండి గిద్యోనీ కుమారుడైన అబీదాను;

  19. బెన్యామీను సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.

  20. బెన్యామీను గోత్రం నుండి లెక్కించబడినవారు 35,400.

  21. వారి ప్రక్కన బెన్యామీను గోత్రం వారు దిగాలి. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీను ప్రజల నాయకుడు.

  22. తొమ్మిదవ రోజు అర్పణను తెచ్చిన వారు బెన్యామీను గోత్ర నాయకుడు, గిద్యోనీ కుమారుడైన అబీదాను.

  23. తర్వాత బెన్యామీను గోత్రం వారు వెళ్లారు. వారి నాయకుడు గిద్యోనీ కుమారుడైన అబీదాను సైన్యాధిపతి.

  24. బెన్యామీను గోత్రం నుండి, రాఫు కుమారుడైన పల్తీ;

  25. బెన్యామీను వారసులు వారి వంశాల ప్రకారం: బేల ద్వార, బేలీయుల వంశం; అష్బేలు ద్వార, అష్బేలీయుల వంశం; అహీరాము ద్వార, అహీరామీయుల వంశం;