Skip to content

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెషయా 1:1సుమారు క్రీ.పూ. 759

    ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా యూదా రాజులుగా ఉన్న కాలంలో యూదా గురించి, యెరూషలేము గురించి ఆమోజు కుమారుడైన యెషయాకు వచ్చిన దర్శనము.

  2. యెషయా 1:2సుమారు క్రీ.పూ. 759

    ఆకాశాల్లారా, నా మాట వినండి! భూమీ శ్రద్ధగా విను! యెహోవా ఇలా చెప్తున్నారు: “నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, కాని వారు నా మీద తిరుగబడ్డారు.

  3. యెషయా 1:3సుమారు క్రీ.పూ. 759

    ఎద్దు తన యజమానిని గుర్తిస్తుంది, గాడిదకు తన యజమానుని పశువుల దొడ్డి తెలుసు, కాని ఇశ్రాయేలుకు వారి యజమాని ఎవరో తెలియదు, నా ప్రజలు గ్రహించరు.”

  4. యెషయా 1:4సుమారు క్రీ.పూ. 759

    పాపిష్ఠి దేశానికి శ్రమ, ఆ ప్రజల దోషం గొప్పది, వారిది దుష్ట సంతానం, అవినీతికి అప్పగించబడిన పిల్లలు! వారు యెహోవాను విడిచిపెట్టారు; ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధుని తృణీకరించారు. వారు ఆయనను విడిచి తొలగిపోయారు.

  5. యెషయా 1:5సుమారు క్రీ.పూ. 759

    ఎందుకు మీరు ఇంకా దెబ్బలు తింటున్నారు? ఎందుకు మీరు ఇంకా తిరుగుబాటు కొనసాగిస్తున్నారు? మీ తలంతా గాయపరచబడింది, మీ గుండె మొత్తం బాధించబడింది.

  6. యెషయా 1:6సుమారు క్రీ.పూ. 759

    అరికాలు నుండి నడినెత్తి వరకు పుండు లేనిచోటు లేదు. ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, పచ్చి పుండ్లు, వాటిని శుభ్రం చేయలేదు, కట్టు కట్టలేదు, ఒలీవనూనెతో చికిత్స చేయలేదు.

  7. యెషయా 1:7సుమారు క్రీ.పూ. 759

    మీ దేశం నాశనమైపోయింది. మీ పట్టణాలు అగ్నిచేత కాలిపోయాయి; మీ కళ్లెదుటే మీ పొలాలు విదేశీయులచేత దోచుకోబడ్డాయి, కంటికి కనబడినవాటిని పరాయివారిగా నాశనం చేశారు.

  8. యెషయా 1:8సుమారు క్రీ.పూ. 759

    ద్రాక్షతోటలోని గుడిసెలా, దోసకాయ పొలంలోని పాకలా, ముట్టడించబడిన పట్టణంలా, సీయోను కుమార్తె విడిచిపెట్టబడింది.

  9. యెషయా 1:9సుమారు క్రీ.పూ. 759

    సైన్యాల యెహోవా కొద్దిమందిని ప్రాణాలతో మనకు మిగల్చకపోయుంటే, మనం సొదొమలా మారేవారం, గొమొర్రాను పోలి ఉండేవారము.

  10. యెషయా 1:10సుమారు క్రీ.పూ. 759

    సొదొమ పాలకులారా, యెహోవా మాట వినండి; గొమొర్రా ప్రజలారా! మన దేవుని ఉపదేశాన్ని శ్రద్ధగా వినండి.

  11. యెషయా 1:11సుమారు క్రీ.పూ. 759

    యెహోవా ఇలా అంటున్నారు, “విస్తారమైన మీ బలులు నాకెందుకు? దహనబలులుగా ఇచ్చిన పొట్టేళ్లు, బాగా క్రొవ్విన జంతువుల క్రొవ్వు నాకు వెగటు కలిగించాయి; ఎద్దుల, గొర్రెపిల్లల, మేకపోతుల రక్తంలో నాకు ఆనందం లేదు.

  12. యెషయా 1:12సుమారు క్రీ.పూ. 759

    మీరు నా సన్నిధికి వస్తున్నప్పుడు, నా ఆవరణాలను త్రొక్కడానికి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు?

  13. యెషయా 1:13సుమారు క్రీ.పూ. 759

    విలువలేని అర్పణలు తీసుకురావడం ఆపండి! మీ ధూపం నాకు అసహ్యం కలిగిస్తుంది. అమావాస్యలు, సబ్బాతులు, ప్రత్యేక సమావేశాలు మీ దుష్ట సమావేశాలు నేను భరించలేను.

  14. యెషయా 1:14సుమారు క్రీ.పూ. 759

    మీ అమావాస్య ఉత్సవాలు, నియమించబడిన పండుగలు నా పూర్ణాత్మతో నేను అసహ్యిస్తున్నాను. అవి నాకు భారంగా ఉన్నాయి; వాటిని భరించలేక అలిసిపోయాను.

  15. యెషయా 1:15సుమారు క్రీ.పూ. 759

    ప్రార్థనలో మీరు మీ చేతులు చాచినప్పుడు, మిమ్మల్ని చూడకుండ కళ్లు కప్పుకుంటాను; మీరు చాలా ప్రార్థనలు చేసినా నేను వినను. “మీ చేతులు రక్తంతో నిండిపోయాయి!

  16. యెషయా 1:16సుమారు క్రీ.పూ. 759

    “మిమ్మల్ని మీరు కడుక్కుని శుభ్రం చేసుకోండి. మీ చెడు కార్యాలు నాకు కనిపించకుండా వాటిని తొలగించండి; తప్పు చేయడం మానండి.

  17. యెషయా 1:17సుమారు క్రీ.పూ. 759

    సరియైనది చేయడం నేర్చుకోండి; న్యాయాన్ని వెదకండి. అణచివేయబడుతున్న వారి పక్షాన ఉండండి. తండ్రిలేనివారికి న్యాయం తీర్చండి. విధవరాలి పక్షాన వాదించండి.

  18. యెషయా 1:18సుమారు క్రీ.పూ. 759

    “రండి, మనం విషయాన్ని పరిష్కరించుకుందాం” అని యెహోవా అంటున్నారు. “మీ పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా, అవి మంచులా తెల్లగా అవుతాయి; కెంపులా ఎర్రగా ఉన్నా, అది ఉన్నిలా తెల్లగా అవుతాయి.

  19. యెషయా 1:19సుమారు క్రీ.పూ. 759

    మీరు ఇష్టపడి నా మాట వింటే, మీరు భూమి ఇచ్చే మంచి పంటను తింటారు;

  20. యెషయా 1:20సుమారు క్రీ.పూ. 759

    ఒకవేళ మీరు ఎదిరించి తిరుగుబాటు చేస్తే, మీరు ఖడ్గం చేత నాశనమవుతారు” యెహోవా ఈ మాట చెప్తున్నారు.

  21. యెషయా 1:21సుమారు క్రీ.పూ. 759

    చూడండి, నమ్మకమైన పట్టణం వేశ్యగా ఎలా అయ్యిందో! ఒక్కప్పుడు అది న్యాయంతో నిండి ఉండేది; నీతి దానిలో నివసించేది, కాని ఇప్పుడు హంతకులు ఉంటున్నారు!

  22. యెషయా 1:22సుమారు క్రీ.పూ. 759

    నీ వెండి మలినం అయిపోయింది, నీ శ్రేష్ఠమైన ద్రాక్షరసం నీళ్లతో కలిసి పలచబడి పోయింది.

  23. యెషయా 1:23సుమారు క్రీ.పూ. 759

    నీ పాలకులు తిరుగుబాటుదారులు, దొంగలతో సహవాసం చేస్తారు. వారందరికి లంచాలు ఇష్టం కానుకల వెంటపడతారు. తండ్రిలేనివారి పక్షంగా న్యాయం తీర్చరు. విధవరాలి సమస్యను పరిష్కరించరు.

  24. యెషయా 1:24సుమారు క్రీ.పూ. 759

    కాబట్టి ప్రభువైన, సైన్యాల యెహోవా, ఇశ్రాయేలు బలవంతుడు ఇలా చెప్తున్నారు: ఆహా! నా శత్రువులపై నా ఉగ్రతను బయటపెట్టి, నా విరోధుల మీద పగ తీర్చుకుంటాను.

  25. యెషయా 1:25సుమారు క్రీ.పూ. 759

    నీకు వ్యతిరేకంగా నా చేయి ఉంచుతాను; నీ లోహపు మలినాన్ని శుద్ధి చేసి నీ మలినాలను తొలగిస్తాను.