- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- యెషయా 2:20సుమారు క్రీ.పూ. 759
ఆ రోజున మనుష్యులు తాము పూజించడానికి తయారుచేసుకున్న వెండి విగ్రహాలను బంగారు విగ్రహాలను ఎలుకలకు గబ్బిలాలకు పారేస్తారు.
- యెషయా 2:21సుమారు క్రీ.పూ. 759
యెహోవా భూమిని వణికించడానికి లేచినప్పుడు, ఆయన భీకర సన్నిధి నుండి పారిపోయి ఆయన ప్రభావ మహాత్మ్యం నుండి వారు కొండల గుహల్లో బండ బీటల్లో దాక్కుంటారు.
- యెషయా 2:22సుమారు క్రీ.పూ. 759
తమ నాసికారంధ్రాలలో ఊపిరి తప్ప ఏమీ లేని నరులను నమ్మడం మానండి. వారిని ఎందుకు లక్ష్యపెట్టాలి?
- యెషయా 3:1సుమారు క్రీ.పూ. 759
చూడండి, ప్రభువును, సైన్యాలకు అధిపతియైన యెహోవా యెరూషలేములో నుండి యూదాలో నుండి జీవనాధారాన్ని, మద్దతును తీసివేయబోతున్నారు: అన్ని ఆహార సరఫరాలు, అన్ని నీటి సరఫరాలు,
- యెషయా 3:2సుమారు క్రీ.పూ. 759
వీరులు, యోధులు, న్యాయాధిపతులు, ప్రవక్తలు, సోదె చెప్పేవారు, పెద్దలు,
- యెషయా 3:3సుమారు క్రీ.పూ. 759
పంచదశాధిపతులను, ఘనత వహించినవారు, సలహాదారులు, నైపుణ్యం కలిగిన హస్తకళాకారులు, తెలివిగల మాంత్రికులు, వీరందరిని తీసివేస్తారు.
- యెషయా 3:4సుమారు క్రీ.పూ. 759
“నేను యవ్వనులను వారికి అధిపతులుగా నియమిస్తాను. పిల్లలు వారిని పరిపాలిస్తారు.”
- యెషయా 3:5సుమారు క్రీ.పూ. 759
ప్రజలు ఒకరిని ఒకరు ఒకరి మీదికి ఒకరు, పొరుగువారి మీదికి పొరుగువారు. యువకులు పెద్దవారి మీదికి, అనామకులు ఘనుల మీదికి లేస్తారు.
- యెషయా 3:6సుమారు క్రీ.పూ. 759
ఒకడు తన తండ్రి ఇంట్లో తన సోదరుని పట్టుకుని, “నీకు బట్టలు ఉన్నాయి, నీవు మాకు నాయకునిగా ఉండు; ఈ పాడైపోయిన స్థలం నీ ఆధీనంలోనికి తీసుకో!” అంటాడు.
- యెషయా 3:7సుమారు క్రీ.పూ. 759
కాని ఆ రోజు అతడు కేక వేసి, “నా దగ్గర పరిష్కారం లేదు. నా ఇంట్లో ఆహారం గాని బట్టలు గాని లేవు; నన్ను ప్రజలకు నాయకునిగా చేయవద్దు” అంటాడు.
- యెషయా 3:8సుమారు క్రీ.పూ. 759
యెరూషలేము పాడైపోయింది, యూదా పతనమవుతుంది, వారి మాటలు పనులు యెహోవాకు వ్యతిరేకంగా ఉన్నాయి, ఆయన మహిమగల సన్నిధిని వారు ధిక్కరించారు.
- యెషయా 3:9సుమారు క్రీ.పూ. 759
వారి ముఖమే వారి మీద సాక్ష్యమిస్తుంది; వారు తమ పాపాన్ని సొదొమలా ప్రకటిస్తారు; వారు దానిని దాచిపెట్టరు. వారికి శ్రమ! వారు తమ మీద తామే విపత్తు తెచ్చుకున్నారు.
- యెషయా 3:10సుమారు క్రీ.పూ. 759
మీకు మేలు కలుగుతుందని నీతిమంతులకు చెప్పండి ఎందుకంటే వారు తాము చేసిన క్రియల ప్రతిఫలాన్ని అనుభవిస్తారు.
- యెషయా 3:11సుమారు క్రీ.పూ. 759
దుష్టులకు శ్రమ! వారికి చెడు జరుగుతుంది! వారి చేతులు చేసిన దాని ప్రతిఫలం వారికి ఇవ్వబడుతుంది.
- యెషయా 3:12సుమారు క్రీ.పూ. 759
నా ప్రజలను యువకులు అణచివేస్తారు స్త్రీలు వారిని పాలిస్తారు. నా ప్రజలారా, మీ నాయకులు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తారు మార్గం నుండి వారు మిమ్మల్ని తప్పిస్తారు.
- యెషయా 3:13సుమారు క్రీ.పూ. 759
యెహోవా న్యాయస్థానంలో తన స్థానం తీసుకుంటారు; ప్రజలకు తీర్పు తీర్చడానికి ఆయన లేస్తారు.
- యెషయా 3:14సుమారు క్రీ.పూ. 759
యెహోవా తన ప్రజల పెద్దలకు నాయకులకు తీర్పు ప్రకటించడానికి వస్తున్నారు: “మీరే నా ద్రాక్షతోటను నాశనం చేశారు; పేదల నుండి దోచుకున్న సొమ్ము మీ ఇళ్ళలో ఉంది.
- యెషయా 3:15సుమారు క్రీ.పూ. 759
మీరు నా ప్రజలను ఎందుకు నలుగగొడుతున్నారు? పేదల ముఖాలను ఎందుకు నూరుతున్నారు?” అని సైన్యాల అధిపతియైన యెహోవా అంటున్నారు.
- యెషయా 3:16సుమారు క్రీ.పూ. 759
యెహోవా ఇలా అంటున్నారు, “సీయోను స్త్రీలు గర్విష్ఠులు వారు మెడలు చాచి నడుస్తూ ఓర చూపులు చూస్తూ ఠీవిగా పిరుదులు త్రిప్పుతూ నడుస్తూ తమ కాళ్ల గజ్జలు మ్రోగిస్తున్నారు.
- యెషయా 3:17సుమారు క్రీ.పూ. 759
కాబట్టి ప్రభువు సీయోను స్త్రీల తలలపై పుండ్లు పుట్టిస్తారు; యెహోవా వారి తలల్ని బోడి చేస్తారు.”
- యెషయా 3:18సుమారు క్రీ.పూ. 759
ఆ రోజు ప్రభువు వారి సొగసును లాక్కుంటారు: గాజులు, శిరోభూషణాలు, నెలవంక హారాలు,
- యెషయా 3:19సుమారు క్రీ.పూ. 759
చెవిపోగులు, కడియాలు, మేలి ముసుగులు,
- యెషయా 3:20సుమారు క్రీ.పూ. 759
తలపాగాలు, కాళ్లపట్టీలు, ఒడ్డాణాలు, సుగంధద్రవ్య బుడ్డీలు, తాయెత్తులు,
- యెషయా 3:21సుమారు క్రీ.పూ. 759
ఉంగరాలు, ముక్కుపుడకలు,
- యెషయా 3:22సుమారు క్రీ.పూ. 759
పండుగ వస్త్రాలు, పైవస్త్రాలు, అంగీలు, సంచులు,