కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెషయా 3:23సుమారు క్రీ.పూ. 759

    అద్దాలు, సన్నపునారతో చేసిన ముసుగులు, తలపాగాలు, శాలువాల్ని తీసివేస్తారు.

  2. యెషయా 3:24సుమారు క్రీ.పూ. 759

    సువాసనకు బదులు దుర్వాసన ఉంటుంది; నడికట్టుకు బదులు తాడు; అల్లిన జడకు బదులు బోడితల; ప్రశస్తమైన పైవస్త్రానికి బదులు గోనెపట్ట; అందానికి బదులు ఖైదీ వాత ఉంటుంది.

  3. యెషయా 3:25సుమారు క్రీ.పూ. 759

    మీ మనుష్యులు ఖడ్గానికి కూలిపోతారు, మీ వీరులు యుద్ధంలో చనిపోతారు.

  4. యెషయా 3:26సుమారు క్రీ.పూ. 759

    సీయోను గుమ్మాలు విలపిస్తూ దుఃఖిస్తాయి; ఆమె ఒంటరిదై, నేల మీద కూర్చుంటుంది.

  5. యెషయా 4:1సుమారు క్రీ.పూ. 759

    ఆ రోజున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకుని “మేము మా అన్నమే తింటాము, మా బట్టలే మేము కట్టుకుంటాము; నీ పేరు మాత్రం మాకు పెట్టి మా అవమానాన్ని తీసివేయి చాలు!” అని చెప్తారు.

  6. యెషయా 4:2సుమారు క్రీ.పూ. 759

    ఆ రోజు యెహోవా కొమ్మ అందంగా, మహిమగలదిగా ఉంటుంది; ఇశ్రాయేలులో తప్పించుకున్నవారికి భూమి పంట అతిశయంగా, ఘనతగా ఉంటుంది.

  7. యెషయా 4:3సుమారు క్రీ.పూ. 759

    సీయోనులో మిగిలిన వారికి, యెరూషలేములో ఉన్నవారికి అనగా యెరూషలేములో నివసించే వారిలో నమోదు చేయబడ్డ ప్రతివారు పరిశుద్ధులని పిలువబడతారు.

  8. యెషయా 4:4సుమారు క్రీ.పూ. 759

    ప్రభువు సీయోను స్త్రీల మురికిని కడిగివేస్తారు; ఆయన తీర్పు తీర్చు ఆత్మతో, దహించే ఆత్మతో, యెరూషలేము నుండి రక్తం మరకల్ని శుభ్రం చేస్తారు.

  9. యెషయా 4:5సుమారు క్రీ.పూ. 759

    అప్పుడు యెహోవా సీయోను పర్వతం అంతట, అక్కడ కూడుకునేవారి మీద పగలు పొగతో ఉన్న మేఘాన్ని, రాత్రి మండుతున్న అగ్నిని సృష్టిస్తారు; ప్రతి దాని మీద మహిమ పందిరిగా ఉంటుంది.

  10. యెషయా 4:6సుమారు క్రీ.పూ. 759

    అది పగలు ఎండ వేడి నుండి ఆశ్రయంగా, నీడగా, తుఫాను, వానల నుండి కాపాడే దాగుచోటుగా ఉంటుంది.

  11. యెషయా 5:1సుమారు క్రీ.పూ. 759

    నా ప్రియుని గురించి పాడతాను. తన ద్రాక్షతోట గురించి పాట పాడతాను: సారవంతమైన కొండమీద నా ప్రియునికి ఒక ద్రాక్షతోట ఉండేది.

  12. యెషయా 5:2సుమారు క్రీ.పూ. 759

    ఆయన దానిని త్రవ్వి రాళ్లను ఏరి బాగుచేసి అందులో శ్రేష్ఠమైన ద్రాక్షతీగెలు నాటాడు. దానిలో కాపలా గోపురం కట్టాడు ద్రాక్షతొట్టిని తొలిపించాడు. మంచి ద్రాక్షపండ్లు కాయాలని ఆయన ఎదురుచూశాడు, కాని దానిలో చెడ్డ ద్రాక్షలు కాసాయి.

  13. యెషయా 5:3సుమారు క్రీ.పూ. 759

    “కాబట్టి యెరూషలేము నివాసులారా, యూదా ప్రజలారా, నాకు, నా ద్రాక్షతోటకు మధ్య న్యాయం చేయండి.

  14. యెషయా 5:4సుమారు క్రీ.పూ. 759

    నేను నా ద్రాక్షతోటకు చేసిన దానికంటే దానికి ఇంకేమి చేయాలి? మంచి ద్రాక్షపండ్ల కోసం నేను చూస్తే ఎందుకు అది చెడ్డ ద్రాక్షలను కాసింది?

  15. యెషయా 5:5సుమారు క్రీ.పూ. 759

    నా ద్రాక్షతోటకు నేనేమి చేయబోతున్నానో ఇప్పుడు మీకు చెప్తాను. దాని కంచె నేను తీసివేస్తాను అప్పుడు అది నాశనం అవుతుంది; దాని గోడను పడగొడతాను అప్పుడు అది త్రొక్కబడుతుంది.

  16. యెషయా 5:6సుమారు క్రీ.పూ. 759

    నేను దానిని బంజరు భూమిలా చేస్తాను, అది త్రవ్వరు, సాగు చేయరు, అక్కడ గచ్చపొదలు ముళ్ళచెట్లు పెరుగుతాయి. దానిపై వర్షం కురిపించవద్దని మేఘాలను ఆజ్ఞాపిస్తాను.”

  17. యెషయా 5:7సుమారు క్రీ.పూ. 759

    ఇశ్రాయేలు వంశం సైన్యాల యెహోవా ద్రాక్షతోట, యూదా ప్రజలు ఆయన ఆనందించే ద్రాక్షలు. ఆయన న్యాయం కోసం చూడగా రక్తపాతం కనబడింది; నీతి కోసం చూడగా రోదనలు వినబడ్డాయి.

  18. యెషయా 5:8సుమారు క్రీ.పూ. 759

    చోటు మిగులకుండ మీరు మాత్రమే దేశంలో నివసించేలా ఇంటికి ఇల్లు, పొలానికి పొలం కలుపుకునేవారికి శ్రమ.

  19. యెషయా 5:9సుమారు క్రీ.పూ. 759

    నేను వినేలా సైన్యాల యెహోవా చెప్పిన మాట: “నిజంగా గొప్ప ఇల్లు ఖాళీగా అయిపోతాయి, చక్కటి భవనాలు నివాసులు లేక పాడైపోతాయి.

  20. యెషయా 5:10సుమారు క్రీ.పూ. 759

    పది ఎకరాల ద్రాక్షతోట ఒక బాతు ద్రాక్షరసాన్నే ఇస్తుంది. హోమెరు గింజలు ఒక ఏఫా పంట మాత్రమే ఇస్తాయి.”

  21. యెషయా 5:11సుమారు క్రీ.పూ. 759

    మద్యం త్రాగడానికి ఉదయాన్నే లేచి మత్తెక్కే వరకు చాలా రాత్రివరకు త్రాగే వారికి శ్రమ.

  22. యెషయా 5:12సుమారు క్రీ.పూ. 759

    వారు సితారాలు, తంతి వాయిద్యాలు, కంజరలు, పిల్లనగ్రోవులు వాయిస్తూ ద్రాక్షరసం త్రాగుతూ విందు చేసుకుంటారు, కాని యెహోవా చేస్తున్న దానిని వారు గుర్తించరు ఆయన చేతిపనిని గౌరవించరు.

  23. యెషయా 5:13సుమారు క్రీ.పూ. 759

    కాబట్టి నా ప్రజలు తెలివిలేక బందీలుగా వెళ్తున్నారు. వారిలో ఘనులు ఆకలితో చనిపోతారు. సామాన్య ప్రజలు దప్పికతో ఎండిపోతారు.

  24. యెషయా 5:14సుమారు క్రీ.పూ. 759

    కాబట్టి మరణం తన దవడలను పెద్దగా తన నోరు వెడల్పుగా తెరుస్తుంది. అందులోకి యెరూషలేము సంస్థానాధిపతులు, సామాన్య ప్రజలు, ఆకతాయిలు, ఆనందించేవారు దిగిపోతారు.

  25. యెషయా 5:15సుమారు క్రీ.పూ. 759

    మనుష్యులు అణగద్రొక్కబడతారు. అందరు తగ్గించబడతారు, గర్విష్ఠుల చూపు తగ్గించబడుతుంది.