- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- హబక్కూకు 1:1సుమారు క్రీ.పూ. 626
ఇది ప్రవక్తయైన హబక్కూకు ఒక దర్శనంలో పొందుకున్న ప్రవచనము.
- హబక్కూకు 1:2సుమారు క్రీ.పూ. 626
యెహోవా, సహాయం కోసం నేను మొరపెట్టినా, ఎంతకాలం వినకుండా ఉంటావు? “హింస!” జరుగుతుందని నీకు మొరపెట్టినా ఎంతకాలం రక్షించకుండ ఉంటావు?
- హబక్కూకు 1:3సుమారు క్రీ.పూ. 626
నన్నెందుకు దుష్టత్వాన్ని చూసేలా చేస్తున్నావు? తప్పు చేయడాన్ని నీవెందుకు సహిస్తున్నావు? నాశనం హింస నా ముందే ఉన్నాయి; కలహాలు ఘర్షణలు చెలరేగుతున్నాయి.
- హబక్కూకు 1:4సుమారు క్రీ.పూ. 626
అందుకే ధర్మశాస్త్రం కుంటుపడింది, ఎప్పుడూ న్యాయం జరగడం లేదు. దుర్మార్గులు నీతిమంతులను చుట్టుముడుతున్నారు, న్యాయం చెడిపోతుంది.
- హబక్కూకు 1:5సుమారు క్రీ.పూ. 626
“దేశాల వైపు గమనించి చూసి, నిర్ఘాంతపోయి ఆశ్చర్యపడండి: ఎందుకంటే మీ కాలంలో నేనొక కార్యాన్ని చేయబోతున్నాను, దాని గురించి ఎవరైనా మీకు చెప్పినా మీరు దాన్ని నమ్మరు.
- హబక్కూకు 1:6సుమారు క్రీ.పూ. 626
తమవి కాని నివాస స్థలాలను ఆక్రమించుకోడానికి, భూమి అంచుల వరకు తిరిగే క్రూరులును, ఆవేశపరులునైన బబులోను ప్రజలను నేను రేపుతున్నాను.
- హబక్కూకు 1:7సుమారు క్రీ.పూ. 626
వారు అత్యంత భయంకరమైన ప్రజలు; వారు తమకు ఇష్టం వచ్చినట్లు చట్టాలు చేసుకుని అధికారం చెలాయిస్తారు.
- హబక్కూకు 1:8సుమారు క్రీ.పూ. 626
వారి గుర్రాలు చిరుతపులి కంటే వేగవంతమైనవి, చీకట్లలో తిరిగే తోడేళ్ళ కంటే భయంకరమైనవి. వారి గుర్రాల దండు దూకుడుగా చొరబడతాయి; వారి రౌతులు దూరం నుండి వస్తారు. ఎరను పట్టుకోవడానికి గ్రద్ద వచ్చినట్లుగా వారు వేగంగా వస్తారు;
- హబక్కూకు 1:9సుమారు క్రీ.పూ. 626
వారంతా దౌర్జన్యం చేయడానికి వస్తారు. ఎడారి గాలిలా వారి ముఖాలను పైకెత్తి ఇసుకరేణువులంత విస్తారంగా ప్రజలను బందీలుగా పట్టుకుంటారు.
- హబక్కూకు 1:10సుమారు క్రీ.పూ. 626
వారు రాజులను వెక్కిరిస్తారు పాలకులను ఎగతాళి చేస్తారు. కోటలున్న పట్టణాలను చూసి నవ్వుతారు; మట్టి దిబ్బలు వేసి వాటిని స్వాధీనపరచుకుంటారు.
- హబక్కూకు 1:11సుమారు క్రీ.పూ. 626
గాలికి కొట్టుకుపోయినట్లుగా కొట్టుకుపోతూ అపరాధులవుతారు, తమ బలాన్నే తమ దేవునిగా భావిస్తారు.”
- హబక్కూకు 1:12సుమారు క్రీ.పూ. 626
యెహోవా, నీవు ఆరంభం నుండి ఉన్నవాడవు కావా? నా దేవా, నా పరిశుద్ధుడా, నీవు ఎన్నడు చనిపోవు. యెహోవా, నీవు వారిని తీర్పు తీర్చడానికి నియమించావు; నా రక్షకా, మమ్మల్ని దండించడానికి నీవు వారిని నియమించావు.
- హబక్కూకు 1:13సుమారు క్రీ.పూ. 626
నీ కళ్లు చెడును చూడలేనంత స్వచ్ఛమైనవి; నీవు తప్పును సహించలేవు. మరి ద్రోహులను ఎందుకు సహిస్తున్నావు? దుర్మార్గులు తమకంటే నీతిమంతులైన వారిని నాశనం చేస్తుంటే నీవెందుకు మౌనంగా ఉన్నావు?
- హబక్కూకు 1:14సుమారు క్రీ.పూ. 626
పాలకుడు లేని సముద్ర జీవులతో, సముద్ర చేపలతో నీవు నరులను సమానులుగా చేశావు.
- హబక్కూకు 1:15సుమారు క్రీ.పూ. 626
చెడ్డ శత్రువు వారందరిని గాలంతో పైకి లాగి, తన వలలో వారిని పట్టుకుంటాడు, తన ఉచ్చులో వారిని పోగుచేసుకుని సంతోషంతో గంతులు వేస్తాడు.
- హబక్కూకు 1:16సుమారు క్రీ.పూ. 626
తన వల వలన విలాసవంతమైన జీవితం మంచి ఆహారం దొరుకుతుందని తన వలకు బలులు అర్పించి తన ఉచ్చుకు ధూపం వేస్తాడు.
- హబక్కూకు 1:17సుమారు క్రీ.పూ. 626
అతడు కనికరం లేకుండా దేశాలను నాశనం చేస్తూ, నిత్యం తన వలను ఖాళీ చేస్తూనే ఉంటాడా?
- హబక్కూకు 2:1సుమారు క్రీ.పూ. 626
నేను నా కావలి స్థలం దగ్గర కనిపెట్టుకుని నగర గోడపై నిలబడి ఉంటాను; ఆయన నాతో ఏమి చెప్తాడో, ఈ ఫిర్యాదుకు నేను ఏమి జవాబు చెప్పాలో చూస్తాను.
- హబక్కూకు 2:2సుమారు క్రీ.పూ. 626
యెహోవా నాకిలా జవాబిచ్చారు: “ప్రకటించేవాడు పరుగెడుతూ సులభంగా చదవడానికి వీలుగా దర్శన సందేశాన్ని పలక మీద స్పష్టంగా వ్రాయి.
- హబక్కూకు 2:3సుమారు క్రీ.పూ. 626
దర్శన సందేశం ఒక నియమిత సమయంలో జరుగుతుంది; అది అంతం గురించి మాట్లాడుతుంది అది తప్పక నెరవేరుతుంది. అది ఆలస్యమైనా, దాని కోసం వేచి ఉండండి; ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఆలస్యం కాదు.
- హబక్కూకు 2:4సుమారు క్రీ.పూ. 626
“చూడండి, శత్రువు కోరికలు న్యాయమైనవి కాకపోయినా అతడు అతిశయపడుతున్నాడు; కాని నీతిమంతుడు తన నమ్మకత్వాన్ని బట్టి జీవిస్తాడు.
- హబక్కూకు 2:5సుమారు క్రీ.పూ. 626
ద్రాక్షరసం అతన్ని మోసం చేస్తుంది; గర్విష్ఠియైన అతడు ఎప్పుడూ విశ్రమించడు. అతనికి పాతాళమంత దురాశ ఉన్నందున మరణంలా అది ఎన్నడూ తృప్తిపడదు, అతడు సమస్త జనాలను వశపరచుకుంటాడు ప్రజలందరిని బందీలుగా తీసుకెళ్తాడు.
- హబక్కూకు 2:6సుమారు క్రీ.పూ. 626
“అయితే వారందరూ అతన్ని ఎగతాళి చేస్తూ ఈ సామెత చెబుతారు, “ ‘దొంగిలించిన వస్తువులను పోగుచేసి బలత్కారంతో ధనవంతునిగా మారిన వారికి శ్రమ! ఇలా ఎంతకాలం కొనసాగుతుంది?’
- హబక్కూకు 2:7సుమారు క్రీ.పూ. 626
అప్పు ఇచ్చినవారు నీ మీద అకస్మాత్తుగా పడరా? వారు లేచి నీకు వణుకు పుట్టించరా? అప్పుడు వారు నిన్ను దోచుకుంటారు.
- హబక్కూకు 2:8సుమారు క్రీ.పూ. 626
నీవు అనేక దేశాలను దోచుకున్నావు కాబట్టి, మిగిలి ఉన్న ప్రజలంతా నిన్ను దోచుకుంటారు. నీవు నరహత్యలు చేసినందుకు, భూములను పట్టణాలను వాటిలోని వారందరినీ నాశనం చేసినందుకు ప్రజలు నిన్ను దోచుకుంటారు.