- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 605–538 BC
The Babylonian Exile
Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.
ఈ కాలపు వచనాలు
- విలాపవాక్యములు 1:1సుమారు క్రీ.పూ. 588
పట్టణం ఎలా నిర్జనమై ఉంది, ఒకప్పుడు జనంతో నిండి ఉండేది! ఆమె ఒక విధవరాలిలా ఎలా ఉంది, ఒకప్పుడు దేశాల మధ్య గొప్పదిగా ఉండేది! ఆమె రాజ్యాల మధ్య రాణిగా ఉండేది, కాని ఇప్పుడు బానిసగా మారింది.
- విలాపవాక్యములు 1:2సుమారు క్రీ.పూ. 588
రాత్రంతా ఆమె ఘోరంగా ఏడుస్తూ ఉంటుంది, ఆమె చెంపల మీద కన్నీరు ఉంటుంది. ఆమె ప్రేమికులందరి మధ్య ఉన్నా ఆమెను ఓదార్చడానికి ఎవరూ లేరు. ఆమె స్నేహితులందరూ ఆమెను అప్పగించారు; వారు ఆమెకు శత్రువులయ్యారు.
- విలాపవాక్యములు 1:3సుమారు క్రీ.పూ. 588
బాధ, కఠిన శ్రమ తర్వాత, యూదా చెరకు వెళ్లిపోయింది. ఆమె జనాంగాల మధ్య నివసిస్తుంది; ఆమెకు విశ్రాంతి స్థలం దొరకడం లేదు. ఆమెను వెంటాడే వారంతా ఆమె కష్టాల మధ్య ఆమెను దాటి వెళ్లిపోయారు.
- విలాపవాక్యములు 1:4సుమారు క్రీ.పూ. 588
సీయోనుకు వెళ్లే దారులు దుఃఖిస్తున్నాయి, ఎందుకంటే దాని నియమించబడిన పండుగలకు ఎవరూ రావట్లేదు. దాని ద్వారాలన్నీ నిర్జనమయ్యాయి, ఆమె యాజకులు మూలుగుతున్నారు, ఆమె యువతులు దుఃఖపడుతున్నారు, ఆమె తీవ్ర వేదనలో ఉంది.
- విలాపవాక్యములు 1:5సుమారు క్రీ.పూ. 588
ఆమె విరోధులు ఆమెకు యజమానులయ్యారు; ఆమె శత్రువులు సుఖంగా జీవిస్తున్నారు; ఆమె యొక్క అనేక పాపాలను బట్టి యెహోవా ఆమెకు దుఃఖం కలిగించారు. ఆమె పిల్లలు చెరకు వెళ్లారు, వారు శత్రువు ముందు బందీలుగా ఉన్నారు.
- విలాపవాక్యములు 1:6సుమారు క్రీ.పూ. 588
సీయోను కుమారి నుండి వైభవమంతా అంతరించింది. ఆమె అధిపతులు, పచ్చిక దొరకని దుప్పిలా ఉన్నారు; బలహీనులై తమను వెంటాడుతున్న వారి ఎదుటి నుండి పారిపోయారు.
- విలాపవాక్యములు 1:7సుమారు క్రీ.పూ. 588
తన బాధలో, ఆమె నిరాశ్రయురాలిగా ఉన్న రోజుల్లో, యెరూషలేము పూర్వకాలంలో తనకు చెందిన సంపదలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటుంది. ఆమె ప్రజలు శత్రువు చేతిలో పడినప్పుడు, వారికి సాయం చేయడానికి ఎవరూ లేరు. ఆమె శత్రువులు ఆమె వైపు చూసి ఆమెకు కలిగిన నాశనాన్ని బట్టి నవ్వారు.
- విలాపవాక్యములు 1:8సుమారు క్రీ.పూ. 588
యెరూషలేము చాలా పాపం చేసింది కాబట్టి అపవిత్రమైనది. ఆమెను గౌరవించిన వారందరూ ఆమెను తృణీకరిస్తారు, అందరు ఆమెను నగ్నంగా చూశారు. ఆమె మూలుగుతూ వెనుదిరిగింది.
- విలాపవాక్యములు 1:9సుమారు క్రీ.పూ. 588
ఆమె అపవిత్రత ఆమె దుస్తులకు అంటుకుంది; ఆమె తన భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. ఆమె పతనం ఆశ్చర్యకరంగా ఉంది; ఆమెను ఓదార్చడానికి ఎవరూ లేరు. “యెహోవా, నా బాధను చూడు, ఎందుకంటే శత్రువు నా మీద విజయం సాధించాడు.”
- విలాపవాక్యములు 1:10సుమారు క్రీ.పూ. 588
ఆమె సంపదలన్నిటినీ ఆమె శత్రువులు చేజిక్కించుకున్నారు; యూదేతరుల దేశాలు ఆమె పరిశుద్ధాలయంలోకి ప్రవేశించడం ఆమె చూసింది, మీరు మీ సమాజంలోకి ప్రవేశించకుండ నిషేధించబడినవారు.
- విలాపవాక్యములు 1:11సుమారు క్రీ.పూ. 588
ఆమె ప్రజలందరూ ఆహారం కోసం వెదుకుతూ మూల్గుతారు; తాము బ్రతికి ఉండడానికి వారు తమ సంపదలను ఇచ్చి ఆహారం తెచ్చుకుంటున్నారు. “యెహోవా, మమ్మల్ని చూసి, ఏదైనా ఆలోచించు, ఎందుకంటే మేము తృణీకరించబడ్డాము.”
- విలాపవాక్యములు 1:12సుమారు క్రీ.పూ. 588
“దారిన పోయే మీకందరికి, ఏమీ అనిపించడం లేదా? చుట్టూ తిరిగి చూడండి. యెహోవా నా మీదికి తన కోపాగ్ని దినాన తెచ్చిన బాధలాంటి బాధ ఏదైనా ఉందా?
- విలాపవాక్యములు 1:13సుమారు క్రీ.పూ. 588
“ఆయన పైనుండి అగ్ని పంపారు, దాన్ని నా ఎముకల్లోకి పంపారు. నా పాదాలకు వలవేసి నన్ను వెనుకకు తిరిగేలా చేశారు. ఆయన నన్ను నిర్జనంగా చేశారు, నేను బాధతో మూర్ఛపోయాను.
- విలాపవాక్యములు 1:14సుమారు క్రీ.పూ. 588
“నా పాపాలు కాడికి కట్టబడ్డాయి; ఆయన చేతులతో అవి ఒక్కటిగా నేయబడ్డాయి. అవి నా మెడకు వ్రేలాడదీయబడ్డాయి, యెహోవా నా బలాన్ని విఫలం చేశారు. నేను తట్టుకోలేని వారి చేతుల్లోకి ఆయన నన్ను అప్పగించారు.
- విలాపవాక్యములు 1:15సుమారు క్రీ.పూ. 588
“నా మధ్య ఉన్న బలవంతులందరినీ యెహోవా తిరస్కరించారు; నా యువకులను అణచివేయడానికి ఆయన నా మీదికి సైన్యాన్ని పిలిపించారు. కన్యయైన యూదా కుమారిని ప్రభువు తన ద్రాక్షగానుగలో త్రొక్కారు.
- విలాపవాక్యములు 1:16సుమారు క్రీ.పూ. 588
“అందుకే నేను ఏడుస్తున్నాను నా కళ్ల నుండి కన్నీరు పొర్లి పారుతున్నాయి. నన్ను ఓదార్చడానికి నాకు దగ్గరగా ఎవరూ లేరు, నా ఆత్మను ఉత్తేజపరచడానికి ఎవరూ లేరు. శత్రువు నన్ను జయించాడు కాబట్టి నా పిల్లలు నిరుపేదలయ్యారు.”
- విలాపవాక్యములు 1:17సుమారు క్రీ.పూ. 588
సీయోను చేతులు చాచింది, ఆమెను ఓదార్చడానికి ఎవరూ లేరు. యాకోబుకు తన పొరుగువారే శత్రువులుగా మారాలని యెహోవా శాసించారు; యెరూషలేము వారి మధ్య అపవిత్రం అయ్యింది.
- విలాపవాక్యములు 1:18సుమారు క్రీ.పూ. 588
“యెహోవా నీతిమంతుడు, అయినా నేను ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాను. జనాంగములారా, వినండి; నా శ్రమను చూడండి. నా యువకులు, యువతులు చెరకు వెళ్లారు.
- విలాపవాక్యములు 1:19సుమారు క్రీ.పూ. 588
“సహాయం కోసం నేను నా స్నేహితులను పిలిచాను కానీ వారు నన్ను మోసం చేశారు. నా యాజకులు, నా పెద్దలు తాము బ్రతికి ఉండాలని ఆహారం కోసం వెదుకుతూ, వారు పట్టణంలో చనిపోయారు.
- విలాపవాక్యములు 1:20సుమారు క్రీ.పూ. 588
“యెహోవా, చూడండి, నేను ఎంత బాధలో ఉన్నానో! నా లోలోపల చిత్రహింసను అనుభవిస్తున్నాను, నా హృదయంలో నేను కలత చెందాను, ఎందుకంటే నేను ఘోరంగా తిరుగుబాటు చేశాను. బయట, ఖడ్గం హతమారుస్తూ ఉంది; లోపల, కేవలం మరణమే.
- విలాపవాక్యములు 1:21సుమారు క్రీ.పూ. 588
“ప్రజలు నా మూలుగు విన్నారు, కాని నన్ను ఓదార్చడానికి ఎవరూ లేరు. నా శత్రువులందరూ నా బాధను గురించి విన్నారు; మీరు నాకు చేసిన దానిని బట్టి వారు సంతోషిస్తున్నారు. మీరు ప్రకటించిన రోజును మీరు రప్పించాలి అప్పుడు వారు నాలా అవుతారు.
- విలాపవాక్యములు 1:22సుమారు క్రీ.పూ. 588
“వారి దుష్టత్వమంతా మీ ముందుకు రావాలి; నా పాపాలన్నిటిని బట్టి మీరు నాతో ఎలా వ్యవహరించారో వారితో కూడా అలాగే వ్యవహరించాలి. నా మూలుగులు అనేకం నా హృదయం సొమ్మసిల్లింది.”
- విలాపవాక్యములు 2:1సుమారు క్రీ.పూ. 588
ప్రభువు తన కోపంతో సీయోను కుమార్తెను మేఘంతో కప్పివేశారు! ఆయన ఇశ్రాయేలు వైభవాన్ని ఆకాశం నుండి భూమి మీదికి పడగొట్టారు; ఆయన తన కోప్పడిన దినాన తన పాదపీఠాన్ని జ్ఞాపకం చేసుకోలేదు.
- విలాపవాక్యములు 2:2సుమారు క్రీ.పూ. 588
దయ లేకుండా ప్రభువు యాకోబు నివాసాలన్నింటినీ నాశనం చేశారు. తన కోపంలో ఆయన తన కుమార్తెయైన యూదా కోటలను పడగొట్టారు. ఆయన ఆమె రాజ్యాన్ని, దాని అధిపతులను అగౌరపరచి నేలకూల్చారు.
- విలాపవాక్యములు 2:3సుమారు క్రీ.పూ. 588
ఆయన తన కోపాగ్నిలో ఇశ్రాయేలీయుల ప్రతి కొమ్మును నరికివేశారు. శత్రువు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తన కుడిచేతిని వెనుకకు తీసుకున్నారు. ఆయన యాకోబులో మండుతున్న అగ్నిలా, దాని చుట్టూ ఉన్న సమస్తాన్ని దహించే మంటలా ఉన్నారు.