Daniel
ఇలా కూడా పిలుస్తారు: Belteshazzar
Daniel ను ప్రస్తావించే వచనాలు
ఆ దేశంలో నోవహు దానియేలు యోబు ఈ ముగ్గురు ఉన్నప్పటికీ వారు తమ నీతితో తమను మాత్రమే రక్షించుకోగలుగుతారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
నా జీవం తోడు నోవహు దానియేలు యోబు అక్కడ ఉన్నప్పటికీ వారు తమ కుమారులను కుమార్తెలను రక్షించుకోలేరు. తమ నీతితో తమను మాత్రమే రక్షించుకోగలరని యెహోవా ప్రకటిస్తున్నారు.
నీవు దానియేలు కన్నా జ్ఞానివా? నీకు తెలియని రహస్యం ఏదీ లేదా?
యూదా నుండి ఎంపిక చేసిన వారిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా ఉన్నారు.
ప్రధాన అధికారి దానియేలుకు బెల్తెషాజరు అని, హనన్యాకు షద్రకు అని మిషాయేలుకు మేషాకు అని అజర్యాకు అబేద్నెగో అని క్రొత్త పేర్లు పెట్టాడు.
అయితే దానియేలు, రాజు ఇచ్చే ఆహారం, ద్రాక్షరసం పుచ్చుకుని తనను తాను అపవిత్రపరచుకోవద్దని నిర్ణయించుకొని, తాను అపవిత్రం కాకుండా ఉండేందుకు వాటిని తినకుండా ఉండడానికి ప్రధాన అధికారి అనుమతి కోరాడు.
ఆ అధిపతి దానియేలు పట్ల దయ కరుణ చూపించేలా దేవుడు చేశారు.
కాబట్టి ఆ అధికారి దానియేలుతో, “మీకు ఆహారం పానీయం కేటాయించిన నా ప్రభువైన నా రాజుకు నేను భయపడుతున్నాను. మీ వయస్సు యువకుల కంటే మీరు అతనికి ఎందుకు పీక్కుపోయినట్టుగా కనిపించాలి? అప్పుడు రాజు మిమ్మల్ని బట్టి నా తల నరికేస్తాడు” అన్నాడు.
అప్పుడు దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా మీద ప్రధాన అధికారి నియమించిన నాయకునితో దానియేలు,
ఈ నలుగురు యువకులకు దేవుడు అన్ని రకాల సాహిత్యంలో, విద్యలో, తెలివిని, వివేకాన్ని ఇచ్చారు. అంతేకాక, దానియేలు దర్శనాలు, రకరకాల కలల భావాలను గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు.
రాజు వారితో మాట్లాడారు, వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యాలకు సమానం ఎవరూ లేరని కనుగొన్నాడు; కాబట్టి వారిని రాజు సేవకు నియమించాడు.
దానియేలు రాజ్య సేవలో రాజైన కోరెషు పరిపాలనలోని మొదటి సంవత్సరం వరకు ఉన్నాడు.
జ్ఞానులను చంపమని శాసనం జారీ అయ్యింది, కాబట్టి దానియేలును అతని స్నేహితులను చంపాలని మనుష్యులు వారిని వెదకడానికి వెళ్లారు.
రాజుకు ప్రధాన రక్షక భటుడైన అర్యోకు బబులోనులోని జ్ఞానులను చంపడానికి వెళ్లినప్పుడు, దానియేలు జ్ఞానంతో, యుక్తితో అతనితో మాట్లాడాడు.
“రాజు దగ్గర నుండి ఇలాంటి కఠినమైన ఆజ్ఞ ఇంత త్వరగా రావడమేంటి?” అని రాజాధికారిని అతడు అడిగాడు. అప్పుడు అర్యోకు దానియేలుకు విషయాన్ని వివరించాడు.
వెంటనే దానియేలు రాజు దగ్గరకు వెళ్లి, ఆ కల భావాన్ని వివరించడానికి కొంత సమయం ఇవ్వమని కోరాడు.
తర్వాత దానియేలు ఇంటికి వెళ్లి తన స్నేహితులైన హనన్యా, మిషాయేలు, అజర్యాలకు ఆ సంగతి వివరించాడు.
దానియేలు, అతని స్నేహితులు, బబులోనులో ఉన్న ఇతర జ్ఞానులతో పాటు చంపబడకుండునట్లు, పరలోక దేవుడు ఆ మర్మాన్ని తెలియజేసేలా ఆయన కరుణ కోసం ప్రాధేయపడమని వారిని బలవంతం చేశాడు.
ఆ రాత్రివేళ దానియేలుకు దర్శనం ద్వారా ఆ మర్మం తెలియజేయబడింది. అప్పుడు దానియేలు పరలోక దేవున్ని స్తుతిస్తూ,
ఇలా అన్నాడు: “దేవుని నామానికి ఎల్లప్పుడు స్తుతి కలుగును గాక; జ్ఞానం, శక్తి ఆయనకే చెందుతాయి.
అప్పుడు దానియేలు బబులోను జ్ఞానులను చంపమని రాజు నియమించిన అర్యోకు దగ్గరకు వెళ్లి అతనితో, “బబులోను జ్ఞానులను చంపకండి. నన్ను రాజు దగ్గరకు తీసుకెళ్లండి, నేను అతని కల భావం అతనికి తెలియజేస్తాను” అన్నాడు.
వెంటనే అర్యోకు దానియేలును రాజు దగ్గరకు తీసుకెళ్లి, “యూదా నుండి బందీలుగా వచ్చిన వారిలో రాజు కల భావం చెప్పగలవాడు నాకు దొరికాడు” అని చెప్పాడు.
రాజు దానియేలును (మరో పేరు బెల్తెషాజరు), “నేను కలలో ఏమి చూశానో, దాని భావం ఏంటో చెప్పగలవా?” అని అడిగాడు.
దానియేలు జవాబిస్తూ ఇలా అన్నాడు, “రాజు అడిగిన మర్మం ఏ జ్ఞాని గాని, శకునాలు చెప్పేవాడు గాని, మాంత్రికుడు గాని, జ్యోతిష్యుడు గాని చెప్పలేడు.
అప్పుడు నెబుకద్నెజరు రాజు దానియేలు ఎదుట సాష్టాంగపడి, అతన్ని పూజించి, అతనికి నైవేద్యం ధూపం అర్పించమని ఆదేశించాడు.