Skip to content

Persecution గురించి బైబిల్ వచనాలు

270 వచనాలు · 61 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నేను నీకు స్త్రీకి మధ్య, నీ సంతానానికి స్త్రీ సంతానానికి మధ్య శత్రుత్వం కలుగజేస్తాను; అతడు నీ తలను చితకగొడతాడు, నీవు అతని మడిమె మీద కాటేస్తావు” అని అన్నారు.

  2. కొంతకాలం తర్వాత, యోసేపు గురించి తెలియని ఒక క్రొత్త రాజు ఈజిప్టులో అధికారంలోకి వచ్చాడు.

  3. అతడు తన ప్రజలతో, “చూడండి, ఈ ఇశ్రాయేలీయులు సంఖ్యలో, బలంలో మనలను అధిగమించారు.

  4. మనం వారితో యుక్తిగా నడుచుకోవాలి, లేకపోతే వారి సంఖ్య ఇంకా అధికమవుతుంది. ఒకవేళ యుద్ధం వస్తే వారు మన శత్రువులతో చేరి మనకు వ్యతిరేకంగా యుద్ధం చేసి ఈ దేశం నుండి వెళ్లిపోతారేమో” అన్నాడు.

  5. కాబట్టి వారిని అణచివేయాలని వారితో వెట్టిచాకిరి చేయించడానికి వారిపై బానిస యజమానులను నియమించారు, ఫరో కోసం పీతోము రామెసేసు అనే రెండు పట్టణాలను గిడ్డంగులుగా కట్టారు.

  6. అయితే వారు ఎంతగా అణచివేయబడ్డారో, అంతకన్నా ఎక్కువ విస్తరించి వారు వ్యాపించారు; కాబట్టి ఈజిప్టు ప్రజలు ఇశ్రాయేలీయులను బట్టి భయపడి,

  7. వారి చేత వెట్టిచాకిరి చేయించారు.

  8. మట్టి పనిలో, ఇటుకల పనిలో, పొలంలో చేసే ప్రతి పనిలో వారిచేత కఠిన సేవ చేయిస్తూ వారి జీవితాలను దుర్భరంగా మార్చారు. ఈజిప్టు ప్రజలు వారితో కఠినంగా పని చేయించారు.

  9. నా ప్రభువు తన సేవకుడిని ఎందుకు తరుముతున్నాడు? నేనేమి చేశాను? నేను చేసిన తప్పేంటి?

  10. అందుకు యెజెబెలు, “రేపు ఈ సమయానికి నీవు వారిని చంపినట్లు నేను నిన్ను చంపకపోతే దేవుళ్ళు నన్ను ఇంతకంటే తీవ్రంగా శిక్షించుదురు గాక” అని ఒక దూతతో ఏలీయాకు కబురు పంపింది.

  11. వారితో ఇలా చెప్పండి, ‘రాజు ఇలా అన్నారు: నేను క్షేమంగా తిరిగి వచ్చేవరకు, ఇతన్ని చెరసాలలో ఉంచి అతనికి రొట్టె, నీరు తప్ప ఏమి ఇవ్వకండి’ ” అని ఆదేశించాడు.

  12. దేశాలు ఎందుకు కుట్ర చేస్తున్నాయి? ప్రజలు ఎందుకు వ్యర్థంగా పన్నాగం వేస్తున్నారు?

  13. యెహోవాకు ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగా భూరాజులు లేచి పాలకులందరు ఒకటిగా చేరి,

  14. “మనం వారి గొలుసులను తెంపుదాం వారి సంకెళ్ళను విసిరి పారేద్దాం” అంటున్నారు.

  15. ఆకాశంలో ఆసీనులై ఉన్న ప్రభువు నవ్వుతున్నారు; ఆయన వారిని చూసి ఎగతాళి చేస్తున్నారు.

  16. ఆయన కోపంతో వారిని గద్దించి తన తీవ్రమైన ఉగ్రతతో వారిని భయకంపితులను చేసి ఇలా అన్నారు,

  17. దావీదు వీణతో పాడిన కీర్తన. బెన్యామీనీయుడైన కూషు విషయంలో దావీదు యెహోవాకు పాడిన కీర్తన. యెహోవా నా దేవా, నేను మిమ్మల్ని ఆశ్రయించాను; నన్ను వెంటాడే వారందరి నుండి నన్ను రక్షించి విడిపించండి,

  18. ఆయన తన మారణాయుధాలు సిద్ధం చేసుకుంటారు; ఆయన తన అగ్ని బాణాలు సిద్ధం చేసుకుంటారు.

  19. దుష్టులు తమ అహంకారంలో దీనులను వేటాడతారు, వారు ఇతరుల కోసం పన్నిన కుట్రలో వారే చిక్కుకుంటారు.

  20. “మేము అతన్ని ఓడించాము” అని నా శత్రువులు చెప్పుకోనివ్వకండి, నేను పడిపోయినప్పుడు నా శత్రువులను ఆనందించనివ్వకండి.

  21. సంగీత దర్శకునికి. “ఉదయకాలపు జింక పిల్ల” అనే రాగం మీద పాడదగినది. దావీదు కీర్తన నా దేవా, నా దేవా! నన్ను ఎందుకు విడిచిపెట్టారు? నన్ను రక్షించకుండ ఎందుకంత దూరంగా ఉన్నారు, వేదనతో కూడిన నా మొరలకు ఎందుకు దూరంగా ఉన్నారు?

  22. నా దేవా, పగలు నేను మొరపెడుతున్నాను, కాని మీరు జవాబివ్వడం లేదు, రాత్రి నేను మౌనంగా ఉండడం లేదు.

  23. నేను మనిషిని కాను ఒక పురుగును, మనుష్యుల చేత తిరస్కరించబడి, ప్రజలచే అవమానించబడ్డాను.

  24. నన్ను చూసినవారందరు నన్ను ఎగతాళి చేస్తారు; వారు వెక్కిరిస్తూ, తలలు ఊపుతూ ఎగతాళి చేస్తారు.

  25. “వాడు యెహోవాను నమ్మాడు, యెహోవా వాన్ని విడిపించనివ్వండి. అతడు ఆయనలో ఆనందిస్తాడు కాబట్టి, ఆయనే వాన్ని విడిపించనివ్వండి” అని వారంటున్నారు.