Satan
ఇలా కూడా పిలుస్తారు: Beelzebub
Satan ను ప్రస్తావించే వచనాలు
సాతాను ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా లేచి, వారి జనాభా లెక్కపెట్టడానికి దావీదును ప్రేరేపించాడు.
ఒక రోజు దేవదూతలు యెహోవా సన్నిధిలో సమకూడారు, సాతాను కూడా వారితో కలిసి వచ్చాడు.
యెహోవా, “నీవెక్కడ నుండి వస్తున్నావు?” అని సాతానును అడిగారు. సాతాను, “భూమి మీద అటూ ఇటూ తిరుగుతూ భూమంతా తిరిగి వస్తున్నాను” అని జవాబిచ్చాడు.
అప్పుడు యెహోవా, “నా సేవకుడైన యోబును నీవు గమనించావా? అతనిలాంటి వ్యక్తి భూమిమీద లేడు; అతడు నిందలేనివాడు, యథార్థవంతుడు, దేవుని భయం కలిగి చెడుకు దూరంగా ఉంటాడు” అన్నారు.
సాతాను, “యోబు ఏమి లేకుండానే దేవుని పట్ల భయం కలిగి ఉన్నాడా?
అందుకు యెహోవా, “మంచిది, అతనికున్నదంతటి మీద నీకు అనుమతి ఉంది. అతనికి మాత్రం హాని చేయకు” అని అన్నారు. అప్పుడు సాతాను యెహోవా సన్నిధిలో నుండి వెళ్లిపోయాడు.
దేవదూతలు యెహోవా సమక్షంలో నిలబడవలసిన రోజున, యెహోవా ఎదుట నిలబడడానికి వారితో పాటు సాతాను కూడా వచ్చాడు.
యెహోవా, “ఎక్కడ నుండి వస్తున్నావు?” అని సాతానును అడిగాడు. “భూమి మీద అటూ ఇటూ తిరుగుతూ భూమంతా తిరిగి వస్తున్నాను” అని సాతాను చెప్పాడు.
అప్పుడు యెహోవా, “నా సేవకుడైన యోబును నీవు గమనించావా? అతనిలాంటి వ్యక్తి భూమి మీద లేడు; అతడు నిర్దోషమైనవాడు, యథార్థవంతుడు, దేవుడంటే భయం కలిగి, చెడుకు దూరంగా ఉండేవాడు. ఏ కారణం లేకుండా నీవు అతన్ని నాశనం చేయడానికి నన్ను ఒప్పించినా అతడు తన యథార్థతను విడువక స్థిరంగా ఉన్నాడు” అని అన్నారు.
అప్పుడు సాతాను, “తన చర్మం కాపాడుకోడానికి చర్మాన్ని ఇస్తాడు! మనిషి తన ప్రాణం కోసం తనకున్నదంతా ఇచ్చేస్తాడు.
యెహోవా, “మంచిది, ఇదిగో యోబు నీ చేతిలో ఉన్నాడు కాని అతని ప్రాణం మాత్రం తీయకూడదు” అని సాతానుతో అన్నారు.
కాబట్టి సాతాను యెహోవా సమక్షంలో నుండి వెళ్లి, అరికాలు నుండి నడినెత్తి వరకు బాధకరమైన కురుపులతో యోబును బాధించాడు.
నా శత్రువు మీద ఒక దుష్టుని నియమించండి; అతని కుడి ప్రక్కన ఒక నేరం మోపేవాడు నిలబడాలి.
అప్పుడు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉండడం, అతన్ని నిందించడానికి సాతాను అతని కుడి ప్రక్కన నిలబడి ఉండడం అతడు నాకు చూపించాడు.
అప్పుడు యెహోవా సాతానుతో, “సాతానా, యెహోవా నిన్ను గద్దిస్తారు! యెరూషలేమును ఎన్నుకున్న యెహోవా నిన్ను గద్దిస్తారు! ఈ మనిషి మంటలో నుండి తీసిన మండుతున్న కర్రలాంటి వాడు కాదా?” అని అన్నారు.
అందుకు యేసు, “సాతానా! నా దగ్గర నుండి వెళ్లిపో! నీ ప్రభువైన దేవున్ని ఆరాధించాలి, ఆయనను మాత్రమే సేవించాలి అని వ్రాయబడి ఉంది” అని చెప్పారు.
శిష్యుడు తన బోధకునిలా, సేవకుడు తన యజమానిలా ఉంటే చాలు. ఇంటి యజమానినే బయెల్జెబూలు అని పిలిస్తే అతని ఇంటివారిని ఇంకా ఎలా పిలుస్తారో గదా!
కాని పరిసయ్యులు ఆ మాటలు విన్నప్పుడు, వారు, “ఇతడు బయెల్జెబూలు అనే దయ్యాల అధిపతి సహాయంతో దయ్యాలను వెళ్లగొడుతున్నాడు” అన్నారు.
ఒకవేళ సాతాను సాతానును వెళ్లగొడితే వాడు తనను తాను వ్యతిరేకించుకొని చీలిపోతాడు. అలాంటప్పుడు వాని రాజ్యం ఎలా నిలుస్తుంది?
ఒకవేళ బయెల్జెబూలు సహాయంతో నేను దయ్యాలను వెళ్లగొడితే మీ ప్రజలు ఎవరి సహాయంతో వెళ్లగొడతారు? అప్పుడు వారే మీకు తీర్పుతీర్చుతారు.
అప్పుడు యేసు పేతురు వైపు తిరిగి, “సాతానా, నా వెనుకకు పో! నీవు నాకు ఆటంకంగా ఉన్నావు; నీ మనస్సులో దేవుని విషయాలు లేవు, కేవలం మనుష్యుల విషయాలు ఉన్నాయి” అన్నారు.
ఆయన సాతానుచేత శోధించబడుతూ, నలభై రోజులు అరణ్యంలో ఉన్నారు. అడవి మృగాల మధ్య ఆయన ఉన్నాడు, దేవదూతలు వచ్చి ఆయనకు సేవ చేశారు.
యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర ఉపదేశకులు, “ఇతడు బయెల్జెబూలు చేత పట్టబడినవాడు! దయ్యాల అధిపతి సహాయంతో దయ్యాలను వెళ్లగొడుతున్నాడు” అని అన్నారు.
కాబట్టి యేసు వారిని తన దగ్గరకు పిలుచుకొని వారితో ఉపమానరీతిగా మాట్లాడారు: “సాతాను సాతానును ఎలా వెళ్లగొట్టగలడు?
అలాగే ఒకవేళ సాతాను తనను తానే వ్యతిరేకించుకొని చీలిపోతే, వాడు నిలువలేడు; వాని అంతం వచ్చినట్లే.