కంటెంట్‌కు వెళ్లండి

Satan

55 వచనాలు

ఇలా కూడా పిలుస్తారు: Beelzebub

Satan ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కొందరు దారి ప్రక్కన పడిన విత్తనంలాంటి వారు, అక్కడ వాక్యం విత్తబడింది. వారు వినిన వెంటనే, సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుపోతాడు.

  2. కాని యేసు తన శిష్యులవైపు తిరిగి వారిని చూసి, పేతురును, “సాతానా, నా వెనుకకు పో! నీ మనస్సులో దేవుని విషయాలు లేవు, కేవలం మనుష్యుల విషయాలు ఉన్నాయి” అని గద్దించారు.

  3. అందుకు యేసు, “ ‘నీ ప్రభువైన దేవున్ని ఆరాధించాలి, ఆయనను మాత్రమే సేవించాలి’ అని వ్రాయబడి ఉంది” అని జవాబిచ్చారు.

  4. దానికి ఆయన, “సాతాను ఆకాశం నుండి మెరుపులా పడడం చూశాను.

  5. అయితే వారిలో కొందరు, “ఇతడు బయెల్జెబూలు, అనే దయ్యాల అధిపతి ద్వారా దయ్యాలను వెళ్లగొడుతున్నాడు” అన్నారు.

  6. ఒకవేళ సాతాను కూడా తనను తానే వ్యతిరేకించుకొని చీలిపోతే, వాని రాజ్యం ఎలా నిలుస్తుంది? నేనిలా చెప్తున్న ఎందుకంటే నేను బయెల్జెబూలు సహాయంతో దయ్యాలను వెళ్లగొడుతున్నానని మీరు అంటున్నారు కాబట్టి.

  7. ఒకవేళ బయెల్జెబూలు సహాయంతో నేను దయ్యాలను వెళ్లగొడితే మీ అనుచరులు ఎవరి సహాయంతో వెళ్లగొడతారు? అప్పుడు, వారే మీకు తీర్పుతీర్చుతారు.

  8. అలాంటప్పుడు అబ్రాహాము కుమార్తెయై ఉండి, పద్దెనిమిది సంవత్సరాలు సాతానుచేత బంధించబడి ఉన్న ఈ స్త్రీని సబ్బాతు దినాన ఎందుకు విడిపించకూడదు?” అని ప్రశ్నించారు.

  9. అప్పుడు పన్నెండుమందిలో ఒకడైన ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించాడు.

  10. “సీమోనూ, సీమోనూ, సాతాను గోధుమలను జల్లించినట్లు నిన్ను జల్లించాలని అడిగాడు.

  11. యూదా ఆ రొట్టెను తీసుకున్న వెంటనే సాతాను అతనిలో ప్రవేశించాడు. అప్పుడు యేసు అతనితో, “నీవు చేయబోయేది త్వరగా చేయు” అన్నారు.

  12. అప్పుడు పేతురు, “అననీయా, పొలాన్ని అమ్మిన డబ్బులో కొంత నీవు దాచుకొని పరిశుద్ధాత్మతో అబద్ధమాడడానికి ఎలా సాతాను నీ హృదయాన్ని ప్రేరేపించాడు?

  13. వారు చీకటి నుండి వారిని వెలుగులోనికి, సాతాను శక్తి నుండి దేవుని వైపుకు తిరిగి, పాపక్షమాపణ పొందుకొని, నా మీద ఉన్న నమ్మకంతో పరిశుద్ధపరచబడి పరిశుద్ధుల మధ్యలో వారికి ఉన్న వారసత్వాన్ని పొందుకునేలా వారి కళ్ళను తెరవడానికి నేను నిన్ను వారి దగ్గరకు పంపిస్తున్నాను’ అని చెప్పాడు.

  14. సమాధానకర్తయైన దేవుడు త్వరలో తన పాదాల క్రింద సాతానును నలిపివేస్తారు. మన ప్రభువైన యేసు కృప మీతో ఉండును గాక.

  15. కాబట్టి ప్రభువు దినాన వాని ఆత్మ రక్షించబడేలా వాని శరీరం నశించడానికి వానిని సాతానుకు అప్పగించాలి.

  16. మీరు ఇద్దరు వ్యక్తిగతంగా కొంత సమయం ప్రార్థనలో గడపడానికి పరస్పర అంగీకారంతోనే తప్ప ఒకరిని విడిచి ఒకరు దూరంగా ఉండకండి. మీ మనస్సును మీరు అదుపు చేసుకోలేనప్పుడు సాతాను మిమ్మల్ని శోధించకుండ మీరు తిరిగి కలుసుకోండి.

  17. సాతాను మనపై ఆధిక్యాన్ని పొందకుండా అలా చేశాను, సాతాను తంత్రాలు మనకు తెలియనివి కావు.

  18. ఇందులో ఆశ్చర్యం ఏమి లేదు, సాతాను కూడా వెలుగు దూత వేషం వేసుకున్నాడు.

  19. నాకు కలిగిన విశేషమైన గొప్ప ప్రత్యక్షతలు వల్ల గర్వంతో ఉబ్బిపోకుండ నా శరీరంలో ఒక ముల్లు పెట్టబడింది. అది సాతాను దూతగా పని చేసి నన్ను నలుగగొట్టి గర్వించకుండా చేస్తుంది.

  20. మేము మీ దగ్గరకు రావాలనుకున్నాము, నిజంగా పౌలును నేను అనేకసార్లు రావాలని ప్రయత్నించాను, కానీ సాతాను మమ్మల్ని ఆటంకపరిచాడు.

  21. సాతాను చేసే పనులకు అనుకూలంగా దుర్మార్గుని రాకడ ఉంటుంది. అతడు తన అబద్ధాన్ని నిరూపించుకోవడానికి, తన శక్తిని చూపించుకోడానికి సూచకక్రియలు, అద్భుతాలు, మహాత్కార్యాలను చేస్తాడు,

  22. అలాంటివారిలో హుమెనేయు, అలెగ్జాండరు అనేవారు ఉన్నారు. వారిని నేను సాతానుకు వదిలేశాను, అప్పుడు వారు దేవుని దూషించకుండ ఉండడం నేర్చుకుంటారు.

  23. అయితే ఇప్పటికే కొందరు దారితప్పి సాతానును అనుసరిస్తున్నారు.

  24. నీ శ్రమలు, నీ పేదరికం నాకు తెలుసు అయినా నీవు ధనవంతుడవే! యూదులు కాకుండానే తాము యూదులమని చెప్పుకొనే సాతాను సమాజమందిరానికి చెందినవారు నీపై చేసే దూషణ నాకు తెలుసు.

  25. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు నివసిస్తున్నావని నాకు తెలుసు. అయినా నా నామానికి నిజంగా కట్టుబడి ఉన్నావు. సాతాను నివసించే నీ పట్టణంలో నాకు నమ్మకమైన సాక్షిగా ఉన్న అంతిప అనేవాడు హతసాక్షిగా చంపబడిన దినాల్లో కూడ నాలో నీ విశ్వాసాన్ని వదలకుండా ఉన్నావు.