కంటెంట్‌కు వెళ్లండి

circa 1010–970 BC

The Reign of David

David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.

1,230 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

"The Reign of David" కోసం వెతకండి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 2 సమూయేలు 1:1సుమారు క్రీ.పూ. 1053

    సౌలు మరణించిన తర్వాత, దావీదు అమాలేకీయులను ఓడించి తిరిగివచ్చి సిక్లగులో రెండు రోజులు ఉన్నాడు.

  2. 2 సమూయేలు 1:2సుమారు క్రీ.పూ. 1053

    మూడవ రోజు సౌలు శిబిరం నుండి ఒక వ్యక్తి చిరిగిన బట్టలు వేసుకుని తలమీద దుమ్ముతో వచ్చాడు. అతడు దావీదు దగ్గరకు వచ్చి గౌరవంతో నేలమీద పడి నమస్కారం చేశాడు.

  3. 2 సమూయేలు 1:3సుమారు క్రీ.పూ. 1053

    “ఎక్కడి నుండి వచ్చావు?” అని దావీదు అతన్ని అడిగాడు. అందుకతడు, “ఇశ్రాయేలు శిబిరం నుండి తప్పించుకుని వచ్చాను” అన్నాడు.

  4. 2 సమూయేలు 1:4సుమారు క్రీ.పూ. 1053

    “ఏ జరిగిందో నాకు చెప్పు” అని దావీదు అడిగాడు. అప్పుడతడు, “యుద్ధరంగం నుండి సైనికులంతా పారిపోయారు. వారిలో ఎంతోమంది చనిపోయారు. సౌలు, అతని కుమారుడు యోనాతాను కూడా చనిపోయారు” అని సమాధానం ఇచ్చాడు.

  5. 2 సమూయేలు 1:5సుమారు క్రీ.పూ. 1053

    అందుకు దావీదు, “సౌలు, అతని కుమారుడు యోనాతాను కూడా చనిపోయారని నీకెలా తెలుసు?” అని వార్త తెచ్చిన యువకుని అడిగాడు.

  6. 2 సమూయేలు 1:6సుమారు క్రీ.పూ. 1053

    ఆ యువకుడు, “అనుకోకుండ నేను గిల్బోవ పర్వతం మీదికి వెళ్లినప్పుడు అక్కడ సౌలు తన ఈటె మీద అనుకుని ఉన్నాడు, రథాలు దాని రౌతులు అతని తరుముతూ వెనుక వస్తూ ఉన్నారు.

  7. 2 సమూయేలు 1:7సుమారు క్రీ.పూ. 1053

    అతడు వెనుకకు తిరిగినప్పుడు నన్ను చూసి, నన్ను పిలిచాడు. అందుకు నేను, ‘నన్ను ఏమి చేయమంటారు?’ అని అడిగాను.

  8. 2 సమూయేలు 1:8సుమారు క్రీ.పూ. 1053

    “అందుకతడు, ‘నీవెవరు?’ అని అడిగాడు. “అందుకు నేను, ‘నేను అమాలేకీయుడను’ అని జవాబిచ్చాను.

  9. 2 సమూయేలు 1:9సుమారు క్రీ.పూ. 1053

    “అప్పుడతడు నాతో, ‘నా ప్రాణం పోకుండా మరణవేదనతో నా తల తిరుగుతుంది. నా దగ్గరకు వచ్చి నిలబడి నన్ను చంపెయ్యి’ అన్నాడు.

  10. 2 సమూయేలు 1:10సుమారు క్రీ.పూ. 1053

    “అంతగా గాయపడిన అతడు ఇక బ్రతకడని భావించి నేను అతని ప్రక్కన నిలబడి అతన్ని చంపేశాను. అతని తలమీద ఉన్న కిరీటం, చేతికున్న కంకణం తీసి నా ప్రభువైన మీకు అప్పగిద్దామని తెచ్చాను” అని అన్నాడు.

  11. 2 సమూయేలు 1:11సుమారు క్రీ.పూ. 1053

    ఆ వార్త వినగానే దావీదు అతని మనుష్యులు దుఃఖంతో బట్టలు చింపుకున్నారు.

  12. 2 సమూయేలు 1:12సుమారు క్రీ.పూ. 1053

    సౌలు, అతని కుమారుడు యోనాతాను, యెహోవా సైన్యం ఇశ్రాయేలీయులు యుద్ధంలో ఖడ్గంతో చంపబడ్డారని విని, వారి కోసం సాయంకాలం వరకు దుఃఖిస్తూ ఏడుస్తూ ఉపవాసం ఉన్నారు.

  13. 2 సమూయేలు 1:13సుమారు క్రీ.పూ. 1053

    తనకు వార్త తీసుకువచ్చిన యువకునితో దావీదు, “నీవు ఎక్కడ నుండి వచ్చావు?” అని అడిగాడు. “నేను విదేశీయుని కుమారుడను, నా తండ్రి అమాలేకీయుడు” అని చెప్పాడు.

  14. 2 సమూయేలు 1:14సుమారు క్రీ.పూ. 1053

    అందుకు దావీదు, “యెహోవా అభిషేకించినవాన్ని చంపడానికి నీకు భయం వేయలేదా?” అని అడిగాడు.

  15. 2 సమూయేలు 1:15సుమారు క్రీ.పూ. 1053

    దావీదు తన మనుష్యుల్లో ఒకని పిలిచి, “వెళ్లి అతన్ని చంపు” అని చెప్పాడు.

  16. 2 సమూయేలు 1:16సుమారు క్రీ.పూ. 1053

    వెంటనే అతడు వాన్ని కొట్టి చంపాడు. ఎందుకంటే దావీదు ఆ యువకునితో, “ ‘నేను యెహోవా అభిషేకించినవాన్ని చంపాను’ అని నీ నోరే నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది కాబట్టి నీ చావుకు నీవే బాధ్యుడవు” అన్నాడు.

  17. 2 సమూయేలు 1:17సుమారు క్రీ.పూ. 1053

    సౌలు గురించి అతని కుమారుడైన యోనాతాను గురించి దావీదు ఒక శోకగీతాన్ని వ్రాసి,

  18. 2 సమూయేలు 1:18సుమారు క్రీ.పూ. 1053

    యూదావారందరికి ఆ విల్లు విలాపగీతాన్ని నేర్పించాలని అతడు ఆదేశించాడు. ఇది యాషారు అనగా యథార్థవంతులు అనే గ్రంథంలో వ్రాయబడి ఉంది:

  19. 2 సమూయేలు 1:19సుమారు క్రీ.పూ. 1053

    “ఇశ్రాయేలూ, నీ ఉన్నతస్థలాల మీద నీ వైభవం గలవారు చంపబడ్డారు. బలవంతులు ఎలా పడిపోయారు కదా!

  20. 2 సమూయేలు 1:20సుమారు క్రీ.పూ. 1053

    “ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషించకూడదు సున్నతిలేనివారి కుమార్తెలు ఆనందించకూడదు. కాబట్టి ఈ వార్త గాతులో చెప్పకండి, అష్కెలోను వీధుల్లో దీనిని ప్రకటించకండి.

  21. 2 సమూయేలు 1:21సుమారు క్రీ.పూ. 1053

    “గిల్బోవ పర్వతాల్లారా, మీమీద మంచు గాని వర్షం గాని కురవకుండును గాక, అర్పణల కోసం ధాన్యాన్ని ఇచ్చే పొలాలపై జల్లులు పడకుండును గాక. ఎందుకంటే అక్కడ బలవంతుల డాలు అవమానపరచబడింది, ఇకపై సౌలు డాలు నూనెతో పూయబడదు.

  22. 2 సమూయేలు 1:22సుమారు క్రీ.పూ. 1053

    “హతుల రక్తం ఒలికించకుండా, బలవంతుల శరీరంలో చొచ్చుకుపోకుండా, యోనాతాను విల్లు వెనుదిరగలేదు, సౌలు ఖడ్గం అసంతృప్తిగా వెనుదిరగలేదు.

  23. 2 సమూయేలు 1:23సుమారు క్రీ.పూ. 1053

    సౌలు యోనాతానులు తమ బ్రతుకంతా ప్రేమ కలిగి దయ కలిగినవారిగా ఉన్నారు. చావులోనూ ఒకరిని ఒకరు విడిచిపెట్టలేదు. వారు గ్రద్దల కన్నా వేగం గలవారు, సింహాల కన్నా బలవంతులు.

  24. 2 సమూయేలు 1:24సుమారు క్రీ.పూ. 1053

    “ఇశ్రాయేలు కుమార్తెలారా, సౌలు గురించి ఏడవండి, అతడు, మీకు విలాసవంతమైన ఎర్రని వస్ర్తాలు ధరింపచేశాడు, మీ వస్త్రాలను బంగారు ఆభరణాలతో అలంకరించాడు.

  25. 2 సమూయేలు 1:25సుమారు క్రీ.పూ. 1053

    “యుద్ధరంగంలో బలవంతులు ఎలా పడిపోయారో కదా! నీ పర్వతాలమీద యోనాతాను హతమైపోయాడు.