Skip to content

Abner

53 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

Abner ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సౌలు భార్యపేరు అహీనోయము. ఈమె అహిమయస్సు కుమార్తె. సౌలు సేనాధిపతి పేరు అబ్నేరు. అతడు నేరు కుమారుడు. నేరు సౌలు చిన్నాన్న.

  2. సౌలు తండ్రి కీషు, అబ్నేరు తండ్రి నేరు ఇద్దరూ అబీయేలు కుమారులు.

  3. దావీదు ఆ ఫిలిష్తీయుని ఎదుర్కోడానికి వెళ్లడం చూసి సౌలు తన సేనాధిపతియైన అబ్నేరును పిలిచి, “అబ్నేరూ, ఈ యువకుడు ఎవరి కుమారుడు” అని అడిగాడు. అందుకు అబ్నేరు, “రాజా, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నాకు తెలియదు” అన్నాడు.

  4. దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతన్ని పిలిచి ఫిలిష్తీయుని తల అతని చేతిలో ఉండగానే దావీదును సౌలు దగ్గరకు తీసుకువచ్చాడు.

  5. ఎప్పటిలాగానే రాజు గోడ దగ్గర ఉన్న తన స్థానంలో యోనాతానుకు ఎదురుగా కూర్చున్నాడు. అబ్నేరు సౌలు ప్రక్కన కూర్చున్నాడు. అయితే దావీదు కూర్చునే చోటు ఖాళీగా ఉంది.

  6. తర్వాత దావీదు బయలుదేరి సౌలు బసచేసిన చోటికి వెళ్లి, సౌలు, సేనాధిపతియైన నేరు కుమారుడు అబ్నేరు ఎక్కడ పడుకున్నారో చూశాడు. సౌలు శిబిరం లోపల పడుకున్నాడు, సైన్యమంతా అతని చుట్టూ ఉంది.

  7. దావీదు, అబీషై రాత్రివేళ ఆ సైన్యం దగ్గరకు వెళ్లినప్పుడు సౌలు శిబిరం లోపల పడుకుని నిద్రపోతున్నాడు. అతని ఈటె అతని తల దగ్గర నేలమీద గుచ్చి ఉంది. అబ్నేరు, సైన్యం అతని చుట్టూ పడుకుని ఉన్నారు.

  8. దావీదు సైన్యాన్ని, నేరు కుమారుడైన అబ్నేరును పిలిచి, “అబ్నేరూ, నీవు నాకు జవాబివ్వవా?” అని అన్నాడు. అప్పుడు అబ్నేరు, “రాజును నిద్ర లేపుతున్న నీవు ఎవరివి?” అని అడిగాడు.

  9. అందుకు దావీదు, “అబ్నేరూ, నీవు మగాడివి కావా? ఇశ్రాయేలీయులలో నీలాంటి వారెవరు? నీ ప్రభువైన రాజుకు నీవెందుకు కాపలా కాయలేదు? నీ ప్రభువైన రాజును చంపడానికి ఒకడు దగ్గరకు వచ్చాడు.

  10. ఆ సమయంలో, నేరు కుమారుడును సౌలు సేనాధిపతియైన అబ్నేరు అనేవాడు సౌలు కుమారుడైన ఇష్-బోషెతును మహనయీముకు తీసుకెళ్లాడు.

  11. నేరు కుమారుడైన అబ్నేరు, సౌలు కుమారుడైన ఇష్-బోషెతు మనుష్యులతో కలిసి మహనయీములో నుండి బయలుదేరి గిబియోనుకు వెళ్లారు.

  12. అప్పుడు అబ్నేరు యోవాబుతో, “కొంతమంది సైనికులు మన ముందుకు వచ్చి మల్లయుద్ధం చేస్తారు” అని అన్నాడు. అందుకు యోవాబు, “సరే, చేయనిద్దాం” అన్నాడు.

  13. ఆ రోజు భయంకరమైన యుద్ధం జరిగింది. అబ్నేరు, ఇశ్రాయేలీయులు దావీదు సైన్యం ముందు ఓడిపోయారు.

  14. అశాహేలు కుడికైనా ఎడమకైనా తిరగకుండా అబ్నేరును వెంటాడాడు.

  15. అబ్నేరు వెనుకకు తిరిగి చూసి, “అశాహేలు నువ్వేనా?” అని అడిగాడు. అందుకు అతడు, “అవును నేనే” అన్నాడు.

  16. అప్పుడు అబ్నేరు అతనితో, “కుడికైనా ఎడమకైనా తిరిగి యువకులలో ఒకన్ని పట్టుకుని వాని ఆయుధాలను దోచేయ్” అని చెప్పాడు. కాని అశాహేలు అటు ఇటు తిరగకుండా అతన్ని వెంటాడుతూనే ఉన్నాడు.

  17. మరొకసారి అబ్నేరు అశాహేలును హెచ్చరించి, “నన్నెందుకు వెంటాడుతావు? నేను నిన్ను నేలకు కొట్టి చంపితే నీ సోదరుడైన యోవాబు ముఖాన్ని ఎలా చూడగలను?” అన్నాడు.

  18. అయినా అశాహేలు ఆగిపోవడానికి ఒప్పుకోలేదు. అప్పుడు అబ్నేరు ఈటె పిడి యొక్క అంచుతో అతన్ని పొట్టలో పొడవడంతో అతని వీపులో నుండి ఈటె బయటకు వచ్చి అక్కడికక్కడే అతడు పడి చనిపోయాడు. అశాహేలు చనిపోయి పడి ఉన్న చోటికి వచ్చిన వారందరూ అక్కడే ఆగిపోయారు.

  19. కాని యోవాబు, అబీషై ఇద్దరూ కలిసి అబ్నేరును వెంటాడారు. సూర్యాస్తమయం అవుతుండగా వారు గిబియోను అరణ్యమార్గంలోని గియా దగ్గరగా ఉన్న అమ్మహు అనే కొండ దగ్గరకు వచ్చారు.

  20. అప్పుడు బెన్యామీనీయులు అబ్నేరు వెనుక గుంపుగా ఏర్పడి కొండ శిఖరంపై నిలబడ్డారు.

  21. అప్పుడు అబ్నేరు బిగ్గరగా, “కత్తి ఎప్పుడూ నాశనం చేస్తూనే ఉండాలా? అది చివరకు ద్వేషంతోనే ముగుస్తుందని నీకు తెలియదా? తోటి ఇశ్రాయేలీయులను తరమడం ఆపమని నీ మనుష్యులకు చెప్పకుండా ఎంతకాలం ఉంటావు?” అని యోవాబుతో అన్నాడు.

  22. అబ్నేరు అతని మనుష్యులు ఆ రాత్రంతా అరాబా గుండా ప్రయాణం చేశారు. వారు యొర్దాను నదిని దాటి, ఉదయ కాలంలో ప్రయాణం కొనసాగించి మహనయీముకు చేరుకున్నారు.

  23. అప్పుడు యోవాబు అబ్నేరును తరమడం ఆపి సైన్యాన్నంతా సమావేశపరిచాడు. అశాహేలు కాకుండా దావీదు మనుష్యుల్లో పందొమ్మిది మంది తగ్గారు.

  24. అయితే దావీదు సైన్యం అబ్నేరుతో ఉన్న బెన్యామీనీయులలో మూడువందల అరవై మందిని చంపేశారు.

  25. సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో అబ్నేరు సౌలు కుటుంబంలో తన స్థానాన్ని బలపరచుకున్నాడు.