కంటెంట్‌కు వెళ్లండి

Abner

53 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

Abner ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అయ్యా కుమార్తె రిస్పా సౌలుకు ఉంపుడుగత్తెగా ఉండేది. “నా తండ్రి ఉంపుడుగత్తెతో నీవెందుకు శారీరక సంబంధం పెట్టుకున్నావు?” అని ఇష్-బోషెతు అబ్నేరును అడిగాడు.

  2. ఇష్-బోషెతు అన్న మాటకు అబ్నేరుకు చాలా కోపం వచ్చి, “నేనేమైనా యూదా పక్షాన చేరిన కుక్కతో సమానమా? ఈ రోజు వరకు నీ తండ్రియైన సౌలు కుటుంబానికి, అతని బంధువులకు స్నేహితులకు ఎంతో నమ్మకంగా ఉన్నాను. నేను నిన్ను దావీదు చేతికి అప్పగించలేదు. అయినా నీవు ఈ స్త్రీ కారణంగా నా మీద నిందవేస్తున్నావు.

  3. యెహోవా దావీదుకు ప్రమాణ పూర్వకంగా వాగ్దానం చేసినట్టుగా సౌలు ఇంటి నుండి రాజ్యాన్ని తీసివేసి, దాను నుండి బెయేర్షేబ వరకు ఇశ్రాయేలు మీద యూదా మీద దావీదు సింహాసనాన్ని నేను స్థాపించకపోతే, దేవుడు అబ్నేరుతో కఠినంగా వ్యవహరించును గాక” అని అన్నాడు.

  4. దానితో ఇష్-బోషెతు అబ్నేరుకు భయపడి అతన్ని మరో మాట అనడానికి సాహసించలేదు.

  5. అప్పుడు అబ్నేరు దావీదు దగ్గరకు దూతలను పంపించి, “ఈ దేశం ఎవరిది? నాతో ఒప్పందం చేసుకో, ఇశ్రాయేలు రాజ్యమంతా నీది కావడానికి నేను నీకు సహాయం చేస్తాను” అని కబురు చేశాడు.

  6. ఆమె భర్త ఆమె వెంట ఏడుస్తూ బహూరీము వరకు వచ్చాడు. అయితే అబ్నేరు అతన్ని వెనుకకు వెళ్లిపొమ్మని చెప్పడంతో అతడు వెళ్లిపోయాడు.

  7. అబ్నేరు ఇశ్రాయేలు పెద్దలతో మాట్లాడి, “గతంలో మీరు దావీదు మీకు రాజుగా ఉండాలని కోరుకున్నారు గదా!

  8. అలాగే అబ్నేరు బెన్యామీనీయులతో స్వయంగా మాట్లాడాడు. ఆ తర్వాత అతడు హెబ్రోనుకు వెళ్లి ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులు అనుకున్న దాన్నంతా దావీదుకు తెలియజేశాడు.

  9. అబ్నేరు తనతో కూడా ఇరవైమంది మనుష్యులను వెంటపెట్టుకుని హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరకు వచ్చినప్పుడు అతనికి అతనితో ఉన్నవారందరికి దావీదు గొప్ప విందు ఏర్పాటు చేశాడు.

  10. అప్పుడు అబ్నేరు దావీదుతో, “నేను వెంటనే వెళ్లి ఇశ్రాయేలీయులందరిని నా ప్రభువైన రాజు కోసం సమావేశపరచి, వారు మీతో నిబంధన చేసేలా మీరు కోరుకున్న విధంగా మీరు వారిని పరిపాలించేలా చేస్తాను” అని చెప్పాడు. కాబట్టి దావీదు అబ్నేరును పంపించగా, అతడు సమాధానంతో వెళ్లాడు.

  11. దాని తర్వాత దావీదు మనుష్యులు, యోవాబు తిరిగివస్తూ తమతో పాటు పెద్ద మొత్తంలో దోపుడుసొమ్మును తీసుకువచ్చారు. కాని వారు వచ్చేసరికి అబ్నేరు హెబ్రోనులో దావీదు దగ్గర లేడు. ఎందుకంటే దావీదు అతన్ని పంపివేశాడు, అతడు సమాధానంతో వెళ్లిపోయాడు.

  12. యోవాబు అతనితో ఉన్న సైనికులందరూ వచ్చినప్పుడు నేరు కుమారుడైన అబ్నేరు రాజు దగ్గరకు వచ్చాడని, రాజు అతన్ని పంపివేయగా అతడు సమాధానంతో వెళ్లిపోయాడని యోవాబుకు తెలిసింది.

  13. కాబట్టి యోవాబు రాజు దగ్గరకు వెళ్లి, “నీవు ఏమి చేశావు? అబ్నేరు నీ దగ్గరకు వచ్చినప్పుడు అతన్ని ఎందుకు వెళ్లనిచ్చావు? ఇప్పుడు అతడు వెళ్లిపోయాడు!

  14. నేరు కుమారుడైన అబ్నేరు ఎలాంటివాడో నీకు తెలుసు. నిన్ను మోసం చేయడానికి నీ కదలికలు గమనించడానికి నీవు ఏం చేస్తున్నావో తెలుసుకోవడానికే అతడు వచ్చాడు” అన్నాడు.

  15. యోవాబు దావీదు దగ్గర నుండి వెళ్లి అబ్నేరును వెనుకకు పిలుచుకురమ్మని దూతలను పంపాడు. వారు వెళ్లి అతన్ని సిరా అనే బావి దగ్గరకు తీసుకువచ్చారు. అయితే ఇదంతా దావీదుకు తెలియదు.

  16. అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు యోవాబు ఎవరూ వినకుండా అతనితో ఏకాంతంగా మాట్లాడాలని చెప్పి అతన్ని లోపలికి తీసుకెళ్లి తన సోదరుడైన అశాహేలును చంపినందుకు ప్రతీకారంగా యోవాబు అబ్నేరు పొట్టలో కత్తితో పొడవగా అతడు చనిపోయాడు.

  17. తర్వాత ఈ సంగతి తెలిసిన దావీదు, “నేరు కుమారుడైన అబ్నేరు రక్తం విషయంలో నేను నా రాజ్యం ఎప్పటికీ యెహోవా దృష్టిలో నిర్దోషులమే.

  18. (గిబియోను యుద్ధంలో అబ్నేరు తన సోదరుడైన అశాహేలును చంపినందుకు యోవాబు అతని సోదరుడైన అబీషై కలిసి పగతీర్చుకున్నారు.)

  19. దావీదు, “మీ బట్టలు చింపుకుని గోనెబట్ట వేసుకుని అబ్నేరు ముందు నడుస్తూ దుఃఖించండి” అని యోవాబుకు అతనితో ఉన్న ప్రజలందరికి ఆజ్ఞాపించి, రాజైన దావీదు కూడా పాడె వెంట నడిచాడు.

  20. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టారు. రాజు అబ్నేరు సమాధి దగ్గర గట్టిగా ఏడ్చాడు, ప్రజలందరూ ఏడ్చారు.

  21. రాజు అబ్నేరు గురించి ఒక శోకగీతం పాడాడు: “అబ్నేరు ఒక దుర్మార్గుడు చనిపోయినట్లుగా చనిపోవాలా?

  22. నేరు కుమారుడైన అబ్నేరు హత్యతో రాజుకు ఎటువంటి సంబంధం లేదని ప్రజలందరికి, ఇశ్రాయేలీయులందరికి ఆ రోజు తెలిసింది.

  23. సౌలు కుమారుడైన ఇష్-బోషెతుకు హెబ్రోనులో అబ్నేరు చనిపోయాడని తెలిసినప్పుడు అతడు భయపడ్డాడు. ఇశ్రాయేలీయులందరు ఆందోళన చెందారు.

  24. వెంటనే దావీదు తన సైనికులకు ఆజ్ఞ ఇవ్వగా వారు ఆ ఇద్దరిని చంపేశారు. వారి కాళ్లు చేతులు నరికి వారి శవాలను హెబ్రోను కొలను దగ్గర తగిలించారు. ఇష్-బోషెతు తల తీసుకెళ్లి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతిపెట్టారు.

  25. “సెరూయా కుమారుడు యోవాబు నాకు ఏమి చేశాడో నీకే తెలుసు. ఇశ్రాయేలు సేనాధిపతులైన నేరు కుమారుడైన అబ్నేరుకు, యెతెరు కుమారుడైన అమాశాకు ఏమి చేశాడో నీకు తెలుసు. సమాధానం కాలంలో వారిని యుద్ధ కాలంలో చంపినట్లు చంపి రక్తపాతం చేసి, తన నడికట్టుపై చెప్పులపై రక్తపు మరకలు చేసుకున్నాడు.