circa 970–930 BC
Solomon & The Temple
Solomon builds the great Temple in Jerusalem and rules with unprecedented wisdom and wealth before foreign gods divide his heart.
ఈ కాలపు వచనాలు
- 1 రాజులు 1:1సుమారు క్రీ.పూ. 1015
రాజైన దావీదు చాలా వృద్ధుడైనప్పుడు, సేవకులు అతనికి ఎన్ని దుప్పట్లు కప్పినా అతడు చలి తట్టుకోలేకపోయాడు.
- 1 రాజులు 1:2సుమారు క్రీ.పూ. 1015
కాబట్టి అతని సేవకులు అతనితో, “రాజును చూసుకుంటూ అతనికి సేవ చేయడానికి మేము ఒక యువ కన్యను వెదికి తీసుకువస్తాము. మా ప్రభువైన రాజుకు వెచ్చగా ఉండేలా ఆమె మీ ప్రక్కన పడుకుంటుంది” అన్నారు.
- 1 రాజులు 1:3సుమారు క్రీ.పూ. 1015
అప్పుడు వారు ఒక అందమైన యువతి కోసం ఇశ్రాయేలు దేశమంతా వెదికి షూనేమీయురాలైన అబీషగును చూసి ఆమెను రాజు దగ్గరకు తీసుకువచ్చారు.
- 1 రాజులు 1:4సుమారు క్రీ.పూ. 1015
ఆ యువతి చాలా అందమైనది; ఆమె రాజును చూసుకుంటూ సేవ చేస్తూ ఉండేది, కాని రాజు ఆమెతో శారీరకంగా కలవలేదు.
- 1 రాజులు 1:5సుమారు క్రీ.పూ. 1015
అప్పుడు దావీదు హగ్గీతుల కుమారుడైన అదోనియా గర్వంతో, “నేనే రాజునవుతాను” అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి అతడు రథాలను, గుర్రపురౌతులను, తనకు ముందుగా పరుగెత్తడానికి యాభైమంది మనుష్యులను ఏర్పరచుకున్నాడు.
- 1 రాజులు 1:6సుమారు క్రీ.పూ. 1015
(అతని తండ్రి, “నీవెందుకు ఇలా చేస్తున్నావు?” అని ఎప్పుడు అతన్ని గద్దించలేదు. అతడు అబ్షాలోము తర్వాత పుట్టినవాడు, అతడు కూడా చాలా అందగాడు.)
- 1 రాజులు 1:7సుమారు క్రీ.పూ. 1015
అదోనియా సెరూయా కుమారుడైన యోవాబుతో, యాజకుడైన అబ్యాతారుతో చర్చించాడు. వారు అతనికి తమ సహకారం అందించారు.
- 1 రాజులు 1:8సుమారు క్రీ.పూ. 1015
కాని యాజకుడైన సాదోకు, యెహోయాదా కుమారుడైన బెనాయా, ప్రవక్తయైన నాతాను, షిమీ, రేయీ దావీదు వ్యక్తిగత శూరులు అదోనియాతో కలవలేదు.
- 1 రాజులు 1:9సుమారు క్రీ.పూ. 1015
అదోనియా ఎన్-రోగేలు వాగు దగ్గర ఉండే సోహెలేతు రాయి దగ్గర గొర్రెలను, పశువులను, క్రొవ్విన దూడలను బలిగా అర్పించి, తన సోదరులైన రాజకుమారులందరిని, యూదాలో రాజు అధికారులందరిని ఆహ్వానించాడు,
- 1 రాజులు 1:10సుమారు క్రీ.పూ. 1015
కాని ప్రవక్తయైన నాతానును గాని బెనాయాను గాని దావీదు వ్యక్తిగత శూరులను గాని తన తమ్ముడైన సొలొమోనును గాని ఆహ్వానించలేదు.
- 1 రాజులు 1:11సుమారు క్రీ.పూ. 1015
అప్పుడు నాతాను సొలొమోను తల్లియైన బత్షెబను ఇలా అడిగాడు, “హగ్గీతు కుమారుడైన అదోనియా రాజయ్యాడని, మన యజమాని దావీదుకు ఈ విషయం తెలియదని నీవు వినలేదా?
- 1 రాజులు 1:12సుమారు క్రీ.పూ. 1015
కాబట్టి ఇప్పుడు నీ ప్రాణాన్ని, నీ కుమారుడైన సొలొమోను ప్రాణాన్ని కాపాడుకోడానికి నేను నీకొక సలహా ఇస్తాను.
- 1 రాజులు 1:13సుమారు క్రీ.పూ. 1015
నీవు రాజైన దావీదు దగ్గరకు వెళ్లి, ‘నా ప్రభువా, రాజా, “నా తర్వాత నా కుమారుడైన సొలొమోను రాజు అవుతాడు, అతడు నా సింహాసనం మీద ఆసీనుడవుతాడు” అని మీరు నాకు ప్రమాణం చేయలేదా? ఇప్పుడు అదోనియా ఎందుకు రాజయ్యాడు?’ అని అడుగు.
- 1 రాజులు 1:14సుమారు క్రీ.పూ. 1015
నీవు ఇంకా రాజుతో మాట్లాడుతున్నప్పుడు నేను లోపలికి వచ్చి మీ మాటలను బలపరుస్తాను” అని సలహా ఇచ్చాడు.
- 1 రాజులు 1:15సుమారు క్రీ.పూ. 1015
కాబట్టి బత్షెబ తన గదిలో ఉన్న వృద్ధుడైన రాజు దగ్గరకు వెళ్లింది. అక్కడ షూనేమీయురాలైన అబీషగు రాజుకు సేవ చేస్తూ ఉంది.
- 1 రాజులు 1:16సుమారు క్రీ.పూ. 1015
బత్షెబ రాజు ఎదుట తలవంచి, సాగిలపడింది. “నీకేమి కావాలి?” అని రాజు అడిగాడు.
- 1 రాజులు 1:17సుమారు క్రీ.పూ. 1015
ఆమె అతనితో ఇలా అన్నది, “నా ప్రభువా, మీరు మీ దేవుడైన యెహోవా పేరిట మీ దాసురాలనైన నాతో ఇలా ప్రమాణం చేసి, ‘నా తర్వాత నీ కుమారుడైన సొలొమోను రాజుగా నా సింహాసనం మీద కూర్చుంటాడు’ అని అన్నారు.
- 1 రాజులు 1:18సుమారు క్రీ.పూ. 1015
కాని ఇప్పుడు అదోనియా రాజయ్యాడు, నా ప్రభువా, రాజువైన మీకు దీని గురించి తెలియదు.
- 1 రాజులు 1:19సుమారు క్రీ.పూ. 1015
అతడు విస్తారమైన పశువులను, క్రొవ్విన దూడలను, గొర్రెలను బలి అర్పించి, రాజకుమారులందరినీ, యాజకుడైన అబ్యాతారును, సేనాధిపతియైన యోవాబును ఆహ్వానించాడు కాని మీ సేవకుడైన సొలొమోనును ఆహ్వానించలేదు.
- 1 రాజులు 1:20సుమారు క్రీ.పూ. 1015
నా ప్రభువా నా రాజా, మీ తర్వాత మీ సింహాసనం మీద ఎవరు కూర్చుంటారో తెలుసుకోవడానికి ఇశ్రాయేలీయులందరు ఎదురుచూస్తున్నారు.
- 1 రాజులు 1:21సుమారు క్రీ.పూ. 1015
అంతేకాక, నా ప్రభువైన రాజు మరణించి తన పూర్వికులను చేరిన వెంటనే, నేను నా కుమారుడైన సొలొమోను నేరస్థులుగా పరిగణించబడతాము.”
- 1 రాజులు 1:22సుమారు క్రీ.పూ. 1015
ఆమె రాజుతో ఇంకా మాట్లాడుతూ ఉండగానే, ప్రవక్తయైన నాతాను వచ్చాడు.
- 1 రాజులు 1:23సుమారు క్రీ.పూ. 1015
“నాతాను ప్రవక్త ఇక్కడకు వచ్చాడు” అని రాజుకు తెలియజేశారు. అతడు రాజు ఎదుటకు వెళ్లి తలవంచి సాష్టాంగపడ్డాడు.
- 1 రాజులు 1:24సుమారు క్రీ.పూ. 1015
నాతాను, “నా ప్రభువా, నా రాజా, అదోనియా మీ తర్వాత రాజవుతాడని, మీ సింహాసనం మీద కూర్చుంటాడని మీరు ప్రకటించారా?
- 1 రాజులు 1:25సుమారు క్రీ.పూ. 1015
ఈ రోజు అతడు వెళ్లి విస్తారమైన పశువులను, క్రొవ్విన దూడలను, గొర్రెలను బలి ఇచ్చాడు. రాజకుమారులందరినీ, సేనాధిపతులను, యాజకుడైన అబ్యాతారును ఆహ్వానించాడు. ఇప్పుడు వారు అతనితో తింటూ త్రాగుతూ, ‘రాజైన అదోనియా చిరకాలం జీవించు గాక!’ అని అంటున్నారు.