కంటెంట్‌కు వెళ్లండి

circa 970–930 BC

Solomon & The Temple

Solomon builds the great Temple in Jerusalem and rules with unprecedented wisdom and wealth before foreign gods divide his heart.

635 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 1 రాజులు 1:26సుమారు క్రీ.పూ. 1015

    కాని మీ సేవకుడనైన నన్ను, యాజకుడైన సాదోకును, యెహోయాదా కుమారుడైనా బెనాయాను, మీ సేవకుడైన సొలొమోనును అతడు ఆహ్వానించలేదు.

  2. 1 రాజులు 1:27సుమారు క్రీ.పూ. 1015

    నా ప్రభువైన రాజు తన తర్వాత సింహాసనంపై ఎవరు కూర్చోవాలో తన సేవకులకు చెప్పకుండా ఇలా చేస్తారా?” అన్నాడు.

  3. 1 రాజులు 1:28సుమారు క్రీ.పూ. 1015

    అప్పుడు రాజైన దావీదు, “బత్షెబను లోపలికి పిలువండి” అన్నాడు. ఆమె రాజు సముఖానికి వచ్చి అతని ఎదుట నిలబడింది.

  4. 1 రాజులు 1:29సుమారు క్రీ.పూ. 1015

    అపుడు రాజు ప్రమాణం చేసి, “నన్ను ప్రతి ఆపద నుండి కాపాడిన సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న,

  5. 1 రాజులు 1:30సుమారు క్రీ.పూ. 1015

    ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మీద నేను చేసిన ప్రమాణాన్ని ఖచ్చితంగా ఈ రోజు నెరవేరుస్తాను: నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత రాజవుతాడు, అతడు నా సింహాసనం మీద నా స్థానంలో కూర్చుంటాడు” అన్నాడు.

  6. 1 రాజులు 1:31సుమారు క్రీ.పూ. 1015

    అప్పుడు బత్షెబ తలవంచి, రాజు ఎదుట సాష్టాంగపడి, “నా ప్రభువా, రాజైన దావీదు చిరకాలం జీవించును గాక!” అని అన్నది.

  7. 1 రాజులు 1:32సుమారు క్రీ.పూ. 1015

    రాజైన దావీదు, “యాజకుడైన సాదోకును, ప్రవక్తయైన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలువండి” అన్నాడు. వారు రాజు దగ్గరకు వచ్చినప్పుడు,

  8. 1 రాజులు 1:33సుమారు క్రీ.పూ. 1015

    రాజు వారితో, “మీ ప్రభు సేవకులను మీతో తీసుకెళ్లి, నా కుమారుడైన సొలొమోనును నా కంచరగాడిద మీద ఎక్కించి దిగువనున్న గిహోనుకు తీసుకెళ్లండి.

  9. 1 రాజులు 1:34సుమారు క్రీ.పూ. 1015

    అక్కడ యాజకుడైన సాదోకు, ప్రవక్తయైన నాతాను అతన్ని ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకిస్తారు. అప్పుడు బూర ఊది, ‘రాజైన సొలొమోను చిరకాలం జీవించు గాక!’ అని బిగ్గరగా కేకలు వేయండి.

  10. 1 రాజులు 1:35సుమారు క్రీ.పూ. 1015

    అప్పుడు మీరు అతని వెంట వెళ్లాలి, అతడు వచ్చి నా సింహాసనం మీద ఆసీనుడై నా స్థానంలో పరిపాలిస్తాడు. ఇశ్రాయేలు మీద యూదా మీద నేను అతన్ని పాలకునిగా నియమించాను” అని అన్నాడు.

  11. 1 రాజులు 1:36సుమారు క్రీ.పూ. 1015

    అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజుతో, “ఆమేన్! నా ప్రభువు దేవుడైన యెహోవా దానిని స్థిరపరచును గాక!

  12. 1 రాజులు 1:37సుమారు క్రీ.పూ. 1015

    యెహోవా రాజైన నా ప్రభువుతో ఉన్నట్లు సొలొమోనుతో ఉండి, అతని సింహాసనాన్ని నా ప్రభువును రాజునైన దావీదు సింహాసనం కంటే గొప్ప దానిగా చేయును గాక!” అన్నాడు.

  13. 1 రాజులు 1:38సుమారు క్రీ.పూ. 1015

    కాబట్టి యాజకుడైన సాదోకు, ప్రవక్తయైన నాతాను, యెహోయాదా కుమారుడైన బెనాయా, వ్యక్తిగత సేవకులుగా ఉన్నా కెరేతీయులు, పెలేతీయులు రాజైన దావీదు కంచరగాడిద మీద సొలొమోనును ఎక్కించి గిహోనుకు తీసుకెళ్లారు.

  14. 1 రాజులు 1:39సుమారు క్రీ.పూ. 1015

    యాజకుడైన సాదోకు పరిశుద్ధ గుడారంలో నుండి కొమ్ముతో నూనె తెచ్చి సొలొమోనును అభిషేకించాడు. అప్పుడు వారు బూర ఊదగా ప్రజలందరు, “రాజైన సొలొమోను చిరకాలం జీవించును గాక!” అని అంటూ కేకలు వేశారు.

  15. 1 రాజులు 1:40సుమారు క్రీ.పూ. 1015

    ప్రజలందరు పిల్లన గ్రోవులు ఊదుతూ ఎంతో ఆనందిస్తూ అతని వెంట వెళ్లారు. ఆ శబ్దానికి భూమి అదిరింది.

  16. 1 రాజులు 1:41సుమారు క్రీ.పూ. 1015

    అదోనియా, అతనితో ఉన్న అతిథులందరు తమ విందు ముగింపులో ఆ ధ్వని విన్నారు. ఆ బూరధ్వని విని యోవాబు, “పట్టణంలో ఈ శబ్దమేంటి?” అని అడిగాడు.

  17. 1 రాజులు 1:42సుమారు క్రీ.పూ. 1015

    అతడు ఇంకా మాట్లాడుతుండగా యాజకుడైన అబ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చాడు. అదోనియా, “లోపలికి రా, నీలాంటి ప్రాముఖ్యమైన వ్యక్తి మంచి వార్తను తెస్తాడు” అన్నాడు.

  18. 1 రాజులు 1:43సుమారు క్రీ.పూ. 1015

    అందుకు యోనాతాను అదోనియాతో, “కానే కాదు, మన ప్రభువా, రాజైన దావీదు సొలొమోనును రాజుగా చేశాడు.

  19. 1 రాజులు 1:44సుమారు క్రీ.పూ. 1015

    రాజు యాజకుడైన సాదోకును, ప్రవక్తయైన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను, కెరేతీయులను, పెలేతీయులను అతనితో పాటు పంపాడు. వారు అతన్ని రాజు కంచరగాడిద మీద ఎక్కించారు.

  20. 1 రాజులు 1:45సుమారు క్రీ.పూ. 1015

    యాజకుడైన సాదోకు, ప్రవక్తయైన నాతాను గిహోను దగ్గర అతన్ని రాజుగా అభిషేకించారు. అక్కడినుండి వారు సంతోషిస్తూ వెళ్లారు. అందుకే పట్టణం సందడిగా ఉంది. మీరు వినే శబ్దం అదే.

  21. 1 రాజులు 1:46సుమారు క్రీ.పూ. 1015

    అంతేకాక సొలొమోను రాజ్యసింహాసనం మీద కూర్చున్నాడు.

  22. 1 రాజులు 1:47సుమారు క్రీ.పూ. 1015

    రాజ్యాధికారులు కూడా తమ ప్రభువైన దావీదు రాజుతో, ‘మీ దేవుడు సొలొమోనుకు మీకంటే ఎక్కువ ఖ్యాతి కలిగేలా, అతని సింహాసనాన్ని మీకంటే గొప్ప దానిగా చేయును గాక!’ అంటూ అభినందించారు. అప్పుడు రాజు తన మంచం మీద సాగిలపడి నమస్కరించి,

  23. 1 రాజులు 1:48సుమారు క్రీ.పూ. 1015

    ‘ఈ రోజు నా సింహాసనం మీద ఒక వారసుడు కూర్చోవడం నేను కళ్లారా చూసేలా చేసిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తుతి కలుగును గాక’ అన్నాడు” అని చెప్పాడు.

  24. 1 రాజులు 1:49సుమారు క్రీ.పూ. 1015

    అందుకు అదోనియా అతిథులు భయపడి లేచి వెళ్లిపోయారు.

  25. 1 రాజులు 1:50సుమారు క్రీ.పూ. 1015

    అయితే అదోనియా సొలొమోనుకు భయపడి వెళ్లి బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నాడు.