- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 970–930 BC
Solomon & The Temple
Solomon builds the great Temple in Jerusalem and rules with unprecedented wisdom and wealth before foreign gods divide his heart.
ఈ కాలపు వచనాలు
- 1 రాజులు 1:51సుమారు క్రీ.పూ. 1015
అప్పుడు, “అదోనియా రాజైన సొలొమోనుకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నాడు. అతడు, ‘రాజైన సొలొమోను తన దాసుడనైన నన్ను ఖడ్గంతో చంపకుండా ఈ రోజు నాకు ప్రమాణం చేయాలి’ అని అంటున్నాడు” అని సొలొమోనుకు తెలిసింది.
- 1 రాజులు 1:52సుమారు క్రీ.పూ. 1015
అందుకు సొలొమోను, “అతడు తనను తాను యోగ్యునిగా కనుపరచుకుంటే, తన తలవెంట్రుకలలో ఒకటి కూడా రాలదు; కాని ఒకవేళ అతనిలో దోషం కనబడితే అతడు చస్తాడు” అన్నాడు.
- 1 రాజులు 1:53సుమారు క్రీ.పూ. 1015
అప్పుడు రాజైన సొలొమోను మనుష్యులను పంపగా వారు అదోనియాను బలిపీఠం దగ్గర నుండి తీసుకువచ్చారు. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాగిలపడ్డాడు, సొలొమోను అతనితో, “నీ ఇంటికి వెళ్లు” అన్నాడు.
దావీదు మరణించే సమయం సమీపించినప్పుడు, అతడు తన కుమారుడైన సొలొమోనును ఇలా ఆదేశించాడు.
అతడు అన్నాడు, “మనుష్యులందరు వెళ్లవలసిన మార్గంలో నేను వెళ్తున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని స్థిరంగా ఉండు.
నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి, ఆయన మార్గాలను అనుసరిస్తే అంటే మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్లుగా, ఆయన శాసనాలు, ఆజ్ఞలు, చట్టాలు, నిబంధనలు అనుసరిస్తే నీవు ఏ పని మొదలుపెట్టినా ఎక్కడకు వెళ్లినా అన్నిటిలో వివేకంగా ప్రవర్తిస్తావు.
అప్పుడు ‘నీ సంతతివారు తాము జీవించే విధానం పట్ల జాగ్రత్తగా ఉండి, నా ఎదుట తమ పూర్ణహృదయంతో, పూర్ణ ఆత్మతో నమ్మకంగా నడుచుకుంటే ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చునే వారసుడు నీకు ఉండక మానడు’ అని యెహోవా నాకు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తారు.
“సెరూయా కుమారుడు యోవాబు నాకు ఏమి చేశాడో నీకే తెలుసు. ఇశ్రాయేలు సేనాధిపతులైన నేరు కుమారుడైన అబ్నేరుకు, యెతెరు కుమారుడైన అమాశాకు ఏమి చేశాడో నీకు తెలుసు. సమాధానం కాలంలో వారిని యుద్ధ కాలంలో చంపినట్లు చంపి రక్తపాతం చేసి, తన నడికట్టుపై చెప్పులపై రక్తపు మరకలు చేసుకున్నాడు.
నీకు తోచిన ప్రకారం అతనికి చేయవచ్చు, అయితే నెరిసిన తలవెంట్రుకలతో సమాధానంతో సమాధికి వెళ్లనివ్వకు.
“అయితే గిలాదీయుడైన బర్జిల్లయి కుమారుల పట్ల దయ చూపించు, నీ బల్ల దగ్గర భోజనం చేసేవారిలో వారిని ఉండనివ్వు. నేను మీ సోదరుడు అబ్షాలోము నుండి పారిపోయినప్పుడు వీరు నా పక్షాన నిలబడ్డారు.
“బాగా గుర్తుంచుకో, నేను మహనయీముకు పారిపోయే రోజు, బహూరీము వాడైన బెన్యామీనీయుడు, గెరా కుమారుడైన షిమీ నన్ను ఘోరంగా శపించాడు. అతడు నన్ను కలుసుకోడానికి యొర్దాను నది దగ్గరకు వచ్చినప్పుడు, నేను యెహోవా పేరిట ‘నేను నిన్ను కత్తితో చంపను’ అని అతనికి ప్రమాణం చేశాను.
అయితే ఇప్పుడు అతన్ని నిర్దోషిగా పరిగణించకు. నీవు జ్ఞానంగల వాడవు; అతనికి ఏం చేయాలో నీకు తెలుసు. అతని నెరసిన తలను రక్తంతో సమాధికి తీసుకెళ్లు.”
ఆ తర్వాత దావీదు చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేర్చబడి, దావీదు పట్టణంలో పాతిపెట్టబడ్డాడు.
దావీదు ఇశ్రాయేలును నలభై సంవత్సరాలు పరిపాలించాడు. హెబ్రోనులో ఏడు సంవత్సరాలు, యెరూషలేములో ముప్పై మూడు సంవత్సరాలు పరిపాలించాడు.
- 1 రాజులు 2:12సుమారు క్రీ.పూ. 1014
అప్పుడు సొలొమోను తన తండ్రియైన దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. అతని పాలనాధికారం స్థిరపరచబడింది.
- 1 రాజులు 2:13సుమారు క్రీ.పూ. 1014
హగ్గీతు కుమారుడైన అదోనియా సొలొమోను తల్లియైన బత్షెబ దగ్గరకు వెళ్లాడు. బత్షెబ అతన్ని, “నీవు సమాధానంగా వచ్చావా?” అని అడిగింది. అతడు, “అవును, సమాధానంగా వచ్చాను” అన్నాడు.
- 1 రాజులు 2:14సుమారు క్రీ.పూ. 1014
తర్వాత అతడు, “నేను నీతో ఓ విషయం చెప్పాలి” అని అన్నాడు. ఆమె జవాబిస్తూ, “నీవు చెప్పవచ్చు” అన్నది.
- 1 రాజులు 2:15సుమారు క్రీ.పూ. 1014
అప్పుడతడు, “నీకు తెలిసినట్లు, రాజ్యం నాకు చెందాల్సింది. ఇశ్రాయేలీయులంతా నన్ను తమ రాజుగా చూశారు. కాని ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి, రాజ్యం నాది కాక నా సోదరునిది అయ్యింది; ఎందుకంటే అది యెహోవా నుండి అతనికి వచ్చింది.
- 1 రాజులు 2:16సుమారు క్రీ.పూ. 1014
ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేస్తాను కాదు అనవద్దు” అన్నాడు. ఆమె, “నీ మనవి ఏంటో చెప్పు” అన్నది.
- 1 రాజులు 2:17సుమారు క్రీ.పూ. 1014
కాబట్టి అతడు మాట్లాడుతూ, “రాజైన సొలొమోనును షూనేమీయురాలైన అబీషగును నాకు భార్యగా ఇమ్మని అడుగు. అతడు నీ మాట కాదు అనడు” అన్నాడు.
- 1 రాజులు 2:18సుమారు క్రీ.పూ. 1014
అందుకు బత్షెబ, “మంచిది, నీ గురించి రాజుతో మాట్లాడతాను” అన్నది.
- 1 రాజులు 2:19సుమారు క్రీ.పూ. 1014
బత్షెబ రాజైన సొలొమోను దగ్గరకు అదోనియా తరుపున మాట్లాడడానికి వెళ్లినప్పుడు, రాజు ఆమెను కలుసుకోడానికి లేచి ఆమెకు నమస్కారం చేసి తన సింహాసనం మీద కూర్చున్నాడు. రాజు తల్లి కోసం సింహాసనం ఒకటి తెప్పించాడు, ఆమె అతని కుడి ప్రక్కన కూర్చుంది.
- 1 రాజులు 2:20సుమారు క్రీ.పూ. 1014
ఆమె, “నేను ఒక చిన్న మనవి చేయాలనుకున్నాను, నీవు కాదు అనకు” అన్నది. రాజు జవాబిస్తూ, “అమ్మా, చెప్పు, నీ మాట కాదు అనను” అన్నాడు.
- 1 రాజులు 2:21సుమారు క్రీ.పూ. 1014
అప్పుడు ఆమె, “షూనేమీయురాలైన అబీషగును నీ సోదరుడైన అదోనియాను పెళ్ళి చేసుకోనివ్వు” అన్నది.
- 1 రాజులు 2:22సుమారు క్రీ.పూ. 1014
అందుకు రాజైన సొలొమోను తన తల్లితో, “అదోనియా కోసం షూనేమీయురాలైన అబీషగును ఎందుకు అడుగుతున్నావు? ఎంతైనా అతడు నాకు అన్న కాబట్టి అతని కోసం యాజకుడైన అబ్యాతారు కోసం సెరూయా కుమారుడైన యోవాబు కోసం రాజ్యాన్ని కూడా అడగవచ్చు కదా” అన్నాడు.