Tyre
ఇలా కూడా పిలుస్తారు: Tyrus
33.2700, 35.1900 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి
Tyre ను ప్రస్తావించే వచనాలు
ఆ సరిహద్దు రామా వైపు తిరిగి, కోటగోడలు గల పట్టణమైన తూరుకు వెళ్లి, హోసా వైపు తిరిగి, అక్సీబు ప్రాంతంలోని మధ్యధరా సముద్రం దగ్గరకు వచ్చింది.
తూరు రాజైన హీరాము దావీదు దగ్గరకు దూతలను, వారితో పాటు దేవదారు దుంగలను, వడ్రంగివారిని, రాళ్లతో పనిచేసే మేస్త్రీలను పంపాడు. వారు దావీదుకు రాజభవనం నిర్మించారు.
అక్కడినుండి కోటలున్న తూరు పట్టణానికి హివ్వీయుల, కనానీయుల పట్టణాలన్నిటికి వచ్చారు. చివరిగా యూదా దేశానికి దక్షిణాన ఉన్న బెయేర్షేబ వరకు వచ్చారు.
సొలొమోను తన తండ్రియైన దావీదు తర్వాత రాజుగా అభిషేకించబడ్డాడని తూరు రాజైన హీరాము విని సొలొమోను దగ్గరకు తన రాయబారులను పంపాడు; ఎందుకంటే అతడు దావీదుతో ఎల్లప్పుడూ స్నేహంగా ఉండేవాడు.
సొలొమోను రాజు తూరు నుండి హూరాము అనే అతన్ని పిలిపించాడు.
అతని తల్లి నఫ్తాలి గోత్రానికి చెందిన విధవరాలు, అతని తండ్రి తూరు వాసి, ఇత్తడి పనిలో నైపుణ్యత కలవాడు. హూరాము అన్ని రకాల ఇత్తడి పనులలో జ్ఞానం, సామర్థ్యం, తెలివిగలవాడు. అతడు రాజైన సొలొమోను దగ్గరకు వచ్చి తనకు అప్పగించిన పని అంతా చేశాడు.
సొలొమోనుకు కావలసిన అన్ని దేవదారు దూలాలు, సరళవృక్షపు చెట్లు, బంగారం, తూరు రాజైన హీరాము సరఫరాచేశాడు కాబట్టి సొలొమోను గలిలయ ప్రదేశంలోని ఇరవై పట్టణాలను హీరాముకు ఇచ్చాడు.
సొలొమోను తనకు ఇచ్చిన ఆ పట్టణాలను చూడడానికి హీరాము తూరు నుండి వెళ్లాడు, కాని అవి అతనికి నచ్చలేదు.
తూరు రాజైన హీరాము దావీదు దగ్గరకు దూతలను, వారితో పాటు దావీదుకు రాజభవనం నిర్మించడానికి దేవదారు దుంగలను, వడ్రంగివారిని, రాళ్లతో పనిచేసే మేస్త్రీలను పంపాడు.
తూరు రాజైన హీరాముకు సొలొమోను ఇలా కబురు పంపాడు. “నా తండ్రియైన దావీదుకు నివాసంగా ఒక భవనం కట్టడానికి మీరు దేవదారు మ్రానులను పంపినట్లే నాకు కూడ పంపించండి.
దానికి జవాబుగా తూరు రాజైన హీరాము సొలొమోనుకు ఒక లేఖ వ్రాశాడు. “యెహోవా తన ప్రజలను ప్రేమగా చూస్తున్నాడు. అందుకే నిన్ను వారిమీద రాజుగా నియమించాడు.”
అతని తల్లి దాను వంశీయురాలు. తండ్రి తూరుకు చెందిన వాడు. బంగారం వెండి ఇత్తడి ఇనుము రాళ్లు దూలాలతో పని చేయడం అతనికి బాగా తెలుసు. ఊదా నీలి సన్నని నూలుతో ఎరుపు నూలుతో పని చేసే నైపుణ్యం ఉన్నవాడు. అన్ని రకాల చెక్కడపు పనిలో నైపుణ్యం ఉన్నవాడు, నాకు యజమాని నీకు తండ్రియైన దావీదు, మీరు ఏర్పాటుచేసిన పనివారితో అతడు పని చేస్తాడు.
తూరు నగర కుమారి కానుకలతో మీ దగ్గరకు వస్తుంది, ధనికులు మీ దయ కోసం చూస్తారు.
గెబాలు, అమ్మోను అమాలేకు, ఫిలిష్తియా, తూరు ప్రజలతో ఒప్పందం చేసుకున్నారు.
“నేను రాహాబు బబులోనును నన్ను గుర్తించిన వారిగా లెక్కిస్తాను అలాగే ఫిలిష్తియా, తూరు కూషు కూడా, ‘ఇది సీయోనులో పుట్టింది’ ” అని వారంటారు.
తూరుకు వ్యతిరేకంగా ప్రవచనం: తర్షీషు ఓడలారా! రోదించండి: తూరు నాశనమయ్యింది, అది ఇల్లు గాని ఓడరేవు గాని లేకుండ మిగిలింది. కుప్ర దేశం నుండి ఈ విషయం వారికి తెలియజేయబడింది.
వార్త ఈజిప్టుకు చేరినప్పుడు తూరు గురించి వారు వేదన పడతారు.
తూరు కిరీటాలు పంచిపెట్టే పట్టణం, దాని వ్యాపారులు రాకుమారులు, దాని వర్తకులు భూమి మీద ప్రసిద్ధులు, అలాంటి తూరుకు వ్యతిరేకంగా ఎవరు ఆలోచన చేశారు?
ఒక రాజు జీవితకాలంలా డెబ్బై సంవత్సరాలు తూరు గురించి మరచిపోతారు. అయితే డెబ్బై సంవత్సరాలు ముగింపులో వేశ్యల పాటలో ఉన్నట్లుగా తూరుకు జరుగుతుంది:
డెబ్బై సంవత్సరాల తర్వాత యెహోవా తూరు మీద దయ చూపిస్తారు. కాని అది తన లాభదాయకమైన వ్యభిచారానికి తిరిగివెళ్లి భూమిపై ఉన్న అన్ని రాజ్యాలతో వ్యాపారం చేస్తుంది.
తూరు సీదోను రాజులందరూ; సముద్ర తీర ప్రాంతాల రాజులు;
యూదా రాజైన సిద్కియా దగ్గరకు యెరూషలేముకు వచ్చిన రాయబారులతో ఎదోము, మోయాబు, అమ్మోను, తూరు, సీదోను రాజులకు కబురు పంపించు.
ఎందుకంటే ఆ రోజు వచ్చింది, ఫిలిష్తీయులందరినీ నాశనం చేసే రోజు తూరు, సీదోనులకు సహాయం చేసేవారందరిని తొలగించే రోజు తప్పకుండా వస్తుంది. యెహోవా ఫిలిష్తీయులను, కఫ్తోరు తీరాల్లో మిగిలి ఉన్నవారిని నాశనం చేయబోతున్నారు.
“మనుష్యకుమారుడా, యెరూషలేము గురించి తూరు, ‘ఆహా! జనాంగాలకు గుమ్మం విరిగిపోయింది, దాని తలుపులు నా కోసం తెరచుకొని ఉన్నాయి; ఇప్పుడు అది శిథిలావస్థలో ఉంది కాబట్టి నేను వృద్ధి చెందుతాను’ అని చెప్పింది.
కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: తూరు పట్టణమా, నేను నీకు విరోధిని. సముద్రంలో అలలు పొంగినట్లు అనేక జనాంగాలను నీ మీదికి రప్పిస్తాను.