Skip to content

Philistines గురించి బైబిల్ వచనాలు

284 వచనాలు · 81 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఈజిప్టు కుమారులు: లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నఫ్తుహీయులు,

  2. పత్రూసీయులు, కస్లూహీయులు (వీరినుండి ఫిలిష్తీయులు వచ్చారు) కఫ్తోరీయులు.

  3. ఆ సమయంలో అబీమెలెకు, అతని సేనాధిపతి ఫీకోలు వచ్చి, అబ్రాహాముతో ఇలా అన్నారు, “నీవు చేసే పనులన్నిటిలో దేవుడు నీతో ఉన్నారు.

  4. అబ్రాహాము ఫిలిష్తీయుల దేశంలో చాలా కాలం పరదేశిగా ఉన్నాడు.

  5. ఇస్సాకు అక్కడ చాలా కాలం ఉన్నాడు, ఒక రోజు ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు కిటికీలో నుండి ఇస్సాకు తన భార్య రిబ్కాతో సరసాలాడడం చూశాడు.

  6. ఫరో ప్రజలను వెళ్లనిచ్చినప్పుడు, ఫిలిష్తీయుల దేశం గుండా దగ్గర మార్గం ఉన్నప్పటికీ దేవుడు వారిని ఆ మార్గంలో నడిపించలేదు. ఎందుకంటే, “ఒకవేళ ఈ ప్రజలు యుద్ధాన్ని చూసి, వారు మనస్సు మార్చుకొని తిరిగి ఈజిప్టుకు వెళ్తారేమో” అని దేవుడు అనుకున్నారు.

  7. “ఎర్ర సముద్రం నుండి మధ్యధరా సముద్రం వరకు, అరణ్యం నుండి యూఫ్రటీసు నది వరకు నేను మీకు సరిహద్దులును ఏర్పరుస్తాను. ఆ దేశంలో నివసించే ప్రజలను మీ చేతికి అప్పగిస్తాను, మీరు వారిని మీ ఎదుట నుండి వెళ్లగొడతారు.

  8. గాజా వరకు గ్రామాల్లో నివసించిన ఆవీయులను కఫ్తోరులో నుండి వచ్చిన కఫ్తోరీయులు నాశనం చేసి వారి దేశంలో స్థిరపడ్డారు.

  9. “ఇంకా మిగిలి ఉన్న ప్రాంతాలు: “ఫిలిష్తీయుల, గెషూరీయుల అన్ని ప్రాంతాలు,

  10. కనానీయులవని పిలువబడిన ఈజిప్టు తూర్పున ఉన్న షీహోరు నది నుండి ఉత్తరాన ఎక్రోను భూభాగం వరకు, అయిదుగురు ఫిలిష్తీయ పాలకులకు సంబంధించిన గాజా, అష్డోదు, అష్కెలోను, గాతు, ఎక్రోను; ఆవీయుల భూభాగం,

  11. ఎక్రోను, దాని చుట్టూ ఉన్న స్థావరాలు, గ్రామాలు;

  12. అష్డోదు, దాని చుట్టూ ఉన్న స్థావరాలు, వాటి గ్రామాలు; దాని ఈజిప్టు వాగువరకు, మహా మధ్యధరా సముద్ర తీరం వరకు గాజా, దాని చుట్టూ ఉన్న స్థావరాలు, గ్రామాలు.

  13. కనానులో యుద్ధాలను అనుభవించని ఆ ఇశ్రాయేలీయులందరిని పరీక్షించడానికి యెహోవా విడిచిపెట్టిన దేశాలు ఇవి

  14. ఆయన యుద్ధం చేసే పూర్వ అనుభవంలేని ఇశ్రాయేలీయుల సంతానానికి యుద్ధం నేర్పించడానికి మాత్రమే ఇలా చేశారు:

  15. ఫిలిష్తీయుల అయిదుగురు పరిపాలకులు, కనానీయులందరూ, సీదోనీయులు, బయల్-హెర్మోను నుండి లెబో హమాతు వరకు ఉన్న లెబానోను పర్వతాల్లో ఉండే హివ్వీయులు.

  16. యెహోవా మోషే ద్వారా వారి పూర్వికులకు ఇచ్చిన ఆజ్ఞలు వారు అనుసరిస్తారో లేదో చూడడానికి ఇశ్రాయేలీయులను పరీక్షించడానికి వారు అక్కడ ఉంచబడ్డారు.

  17. ఏహూదు తర్వాత అనాతు కుమారుడైన షమ్గరు వచ్చాడు, పశువులను తోలే ములుకోలుతో ఆరువందలమంది ఫిలిష్తీయులను హతం చేశాడు. అతడు కూడా ఇశ్రాయేలీయులను కాపాడాడు.

  18. ఇశ్రాయేలీయులు మరల యెహోవా కళ్ళెదుట చెడు కార్యాలు చేశారు. వారు బయలు, అష్తారోతు, అరాము, సీదోను, మోయాబు, అమ్మోనీయుల, ఫిలిష్తీయుల దేవుళ్ళను పూజించారు. ఇశ్రాయేలీయులు యెహోవాను విడిచి ఆయనను సేవించడం మానుకున్నారు.

  19. యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోప్పడి వారిని ఫిలిష్తీయులకు, అమ్మోనీయులకు అప్పగించారు,

  20. వారు ఆ సంవత్సరం నుండి పద్దెనిమిది సంవత్సరాలు యొర్దాను తూర్పున ఉన్న గిలాదులో, అమోరీయుల దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులందరిని బాధించి అణచివేశారు.

  21. ఇశ్రాయేలీయులు మరల యెహోవా కళ్ళెదుట చెడు కార్యాలు చేశారు, కాబట్టి యెహోవా వారిని నలభై సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతికి అప్పగించారు.

  22. నీవు గర్భవతివై కుమారుని కంటావు, ఆ బాలుని జుట్టు ఎప్పటికీ కత్తిరించకూడదు ఎందుకంటే పుట్టుక నుంచే అతడు నాజీరుగా, దేవునికి ప్రతిష్ఠ చేయబడతాడు. ఫిలిష్తీయుల చేతుల్లో నుండి అతడు ఇశ్రాయేలును రక్షించడం ప్రారంభిస్తాడు.”

  23. సంసోను తిమ్నాకు వెళ్లాడు, అక్కడ ఒక ఫిలిష్తీ యువతిని చూశాడు.

  24. అతని తండ్రి ఆ అమ్మాయిని చూడటానికి వెళ్లాడు. సంసోను అక్కడ ఒక విందు ఏర్పాటు చేశాడు, పెళ్ళికుమారుడు అలా చేయడం అక్కడి ఆనవాయితి.

  25. అప్పుడు యెహోవా ఆత్మ బలంగా అతని మీదికి వచ్చాడు. అతడు అష్కెలోను పట్టణానికి వెళ్లి, అక్కడి వారి ముప్పైమందిని చంపి, వారి వస్త్రాలను దోచుకొని పొడుపు కథ అర్థం చెప్పిన వారికిచ్చాడు. కోపంతో మండి పడుతూ అతడు తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్లాడు.