Skip to content

Ekron

20 verses

31.7700, 34.8500 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Ekron ను ప్రస్తావించే వచనాలు

  1. కనానీయులవని పిలువబడిన ఈజిప్టు తూర్పున ఉన్న షీహోరు నది నుండి ఉత్తరాన ఎక్రోను భూభాగం వరకు, అయిదుగురు ఫిలిష్తీయ పాలకులకు సంబంధించిన గాజా, అష్డోదు, అష్కెలోను, గాతు, ఎక్రోను; ఆవీయుల భూభాగం,

  2. అది ఎక్రోను ఉత్తర వాలుకు వెళ్లి, షిక్కెరోను వైపు తిరిగి, బాలా పర్వతాన్ని దాటి జబ్నీలుకు చేరుకుంది. సరిహద్దు మధ్యధరా సముద్రం దగ్గర ముగిసింది.

  3. ఎక్రోను, దాని చుట్టూ ఉన్న స్థావరాలు, గ్రామాలు;

  4. ఎక్రోనుకు పశ్చిమాన, అష్డోదు పరిసరాల్లో ఉన్నవాటన్నిటితో పాటు వాటి గ్రామాలన్నీ ఉన్నాయి;

  5. ఎలోను, తిమ్నా, ఎక్రోను,

  6. యూదా వారు గాజాను అష్కెలోనును ఎక్రోనును ఈ పట్టణాల చుట్టూ ఉన్న ప్రదేశాలతో పాటు పట్టుకున్నారు.

  7. కాబట్టి వారు దేవుని మందసాన్ని ఎక్రోనుకు పంపించారు. దేవుని మందసం ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోను ప్రజలు, “మనలను మన ప్రజలను నాశనం చేయడానికి వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని మన దగ్గరకు తీసుకువచ్చారు” అని కేకలు వేశారు.

  8. అయిదుగురు ఫిలిష్తీయుల పాలకులు అదంతా చూసి ఆ రోజే ఎక్రోనుకు తిరిగి వెళ్లిపోయారు.

  9. ఫిలిష్తీయులు యెహోవాకు అపరాధపరిహార అర్పణగా పంపిన బంగారు గడ్డలు అష్డోదు, గాజా, అష్కెలోను, గాతు, ఎక్రోనులకు ఒక్కొక్కటి.

  10. ఇశ్రాయేలీయులు నుండి ఫిలిష్తీయులు ఆక్రమించుకున్న పట్టణాలు అనగా ఎక్రోను నుండి గాతు వరకు ఉన్న అన్ని పట్టణాలు ఇశ్రాయేలుకు తిరిగి వచ్చాయి. పొరుగున ఉన్న గ్రామాలను ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించారు. అమోరీయులకు ఇశ్రాయేలీయులకు మధ్య సమాధానం ఏర్పడింది.

  11. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యూదా ప్రజలు లేచి జయధ్వనులు చేస్తూ లోయవరకు ఎక్రోను ద్వారాల వరకు ఫిలిష్తీయులను వెంటాడారు. చనిపోయిన ఫిలిష్తీయులు షరాయిము దారిలో గాతు ఎక్రోను పట్టణాల వరకు పడి ఉన్నారు.

  12. ఆ కాలంలో ఒక రోజు అహజ్యా రాజు సమరయలో ఉన్న తన మేడగది కిటికీలో నుండి క్రిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడు, “నేను ఈ గాయం నుండి కోలుకుంటానో లేదో మీరు వెళ్లి, ఎక్రోను దేవుడైన బయల్-జెబూబు దగ్గర విచారణ చేయండి” అని దూతలకు చెప్పి పంపించాడు.

  13. అయితే యెహోవా దూత తిష్బీయుడైన ఏలీయాతో, “నీవు వెళ్లి, సమరయ రాజు పంపిన దూతలను కలిసి, ‘ఇశ్రాయేలులో దేవుడు లేరని ఎక్రోను దేవుడైన బయల్-జెబూబు దగ్గర విచారణ చేయడానికి వెళ్తున్నారా?’

  14. అందుకు వారు, “ఒక మనుష్యుడు మాకు ఎదురయ్యాడు” అన్నారు. “అందుకతడు మాతో ఇలా అన్నాడు, ‘మీరు వెనక్కి వెళ్లి మిమ్మల్ని పంపించిన రాజుకు ఇలా చెప్పండి, “యెహోవా ఇలా చెప్తున్నారు: ఇశ్రాయేలులో దేవుడు లేరని ఎక్రోను దేవుడైన బయల్-జెబూబు దగ్గర విచారణ చేయడానికి దూతలను పంపారా? నీవు చేసిన దాన్ని బట్టి నీవు ఎక్కిన మంచం దిగవు, నీవు తప్పక చస్తావు!” ’ ”

  15. అతడు రాజుతో, “యెహోవా చెప్పే మాట ఇదే: ఇశ్రాయేలులో దేవుడు లేరని ఎక్రోను దేవుడైన బయల్-జెబూబు దగ్గర విచారణ చేయడానికి దూతలను పంపించావా? నీవు చేసిన దాన్ని బట్టి నీవు ఎక్కిన మంచం మళ్ళీ దిగవు, అక్కడే చస్తావు!” అని అన్నాడు.

  16. అక్కడున్న విదేశీయులందరు అనగా ఊజు రాజులందరూ; ఫిలిష్తీయ పట్టణాలైన అష్కెలోను, గాజా, ఎక్రోను రాజులందరూ అష్డోదులో మిగిలిన ప్రజలు;

  17. నేను అష్డోదు రాజును నాశనం చేస్తాను, అతడు అష్కెలోనులో రాజదండం పట్టుకున్నవాడు. నేను ఫిలిష్తీయులలో చివరి వారు మరణించే వరకు, నేను ఎక్రోనుకు విరుద్ధంగా నా చేతిని ఉంచుతాను” అని ప్రభువైన యెహోవా చెప్తున్నారు.

  18. గాజా విడిచిపెట్టబడుతుంది, అష్కెలోను పాడైపోతుంది. మధ్యాహ్న సమయంలో అష్డోదు ఖాళీ చేయబడుతుంది, ఎక్రోను పట్టణం పెళ్ళగించబడుతుంది.

  19. అష్కెలోను దానిని చూసి భయపడుతుంది; గాజా వేదనతో విలపిస్తుంది ఎక్రోను కూడా తన నిరీక్షణ కోల్పోతుంది. గాజా తన రాజును కోల్పోతుంది అష్కెలోను ఎడారిగా మారుతుంది.

  20. వారి నోటిలో నుండి రక్తాన్ని, వారి పళ్ల మధ్య నుండి తినకూడని ఆహారాన్ని నేను తీసివేస్తాను. వారిలో మిగిలి ఉన్నవారు మన దేవుని వారై యూదాలో ఒక వంశంగా ఉంటారు. ఎక్రోను వారు యెబూసీయుల్లా ఉంటారు.