కంటెంట్‌కు వెళ్లండి

Ahaziah

7 వచనాలు · 5 కుటుంబ సభ్యులు

"Ahaziah" కోసం వెతకండి

Ahaziah ను ప్రస్తావించే వచనాలు

  1. అహాబు చనిపోయి తన పూర్వికుల దగ్గర చేరాడు. అతని తర్వాత అతని కుమారుడైన అహజ్యా రాజయ్యాడు.

  2. అప్పుడు అహాబు కుమారుడైన అహజ్యా యెహోషాపాతుతో, “నా మనుష్యులను మీ మనుష్యులతో పాటు ఓడలో ప్రయాణం చెయ్యనివ్వండి” అన్నాడు కాని యెహోషాపాతు ఒప్పుకోలేదు.

  3. యూదా రాజైన యెహోషాపాతు పరిపాలనలోని పదిహేడవ సంవత్సరంలో అహాబు కుమారుడైన అహజ్యా ఇశ్రాయేలు మీద సమరయలో రాజయ్యాడు. అతడు ఇశ్రాయేలును రెండు సంవత్సరాలు పరిపాలించాడు.

  4. ఆ కాలంలో ఒక రోజు అహజ్యా రాజు సమరయలో ఉన్న తన మేడగది కిటికీలో నుండి క్రిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడు, “నేను ఈ గాయం నుండి కోలుకుంటానో లేదో మీరు వెళ్లి, ఎక్రోను దేవుడైన బయల్-జెబూబు దగ్గర విచారణ చేయండి” అని దూతలకు చెప్పి పంపించాడు.

  5. అహజ్యా పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసినవి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.

  6. తర్వాత యూదా రాజైన యెహోషాపాతు, దుష్ట మార్గాల్లో నడిచే ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో సంధి చేసుకున్నాడు.

  7. మరేషాకు చెందిన దోదవహు కుమారుడైన ఎలీయెజెరు యెహోషాపాతుకు వ్యతిరేకంగా, “నీవు అహజ్యాతో పొత్తు పెట్టుకున్నావు కాబట్టి, నీవు చేసిన దాన్ని యెహోవా నాశనం చేస్తారు” అని ప్రవచించాడు. ఓడలు బద్దలయ్యాయి, వాణిజ్యానికి తర్షీషుకు వెళ్లలేకపోయాయి.