Skip to content

Political Alliances గురించి బైబిల్ వచనాలు

16 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

  1. వారితో గాని వారి దేవుళ్ళతో గాని ఎలాంటి ఒడంబడిక చేసుకోవద్దు.

  2. వారిని మీ దేశంలో నివసింపనివ్వకండి లేదా మీరు నాకు వ్యతిరేకంగా పాపం చేయడానికి వారు కారణమవుతారు, ఎందుకంటే మీరు వారి దేవుళ్ళను సేవించడం ఖచ్చితంగా మీకు ఉరి అవుతుంది.”

  3. మీరు వెళ్లబోతున్న దేశంలో నివసిస్తున్న వారితో సంధి చేసుకోకుండ జాగ్రత్తపడండి, లేకపోతే వారు మీ మధ్య ఉరిగా ఉంటారు.

  4. మీరు వారి బలిపీఠాలను పడగొట్టండి, వారి పవిత్ర రాళ్లను పగులగొట్టండి, వారి అషేరా స్తంభాలను ముక్కలు చేయండి.

  5. మీరు ఇతర దేవుళ్ళను ఆరాధించకూడదు, ఎందుకంటే రోషం గలవాడని పేరుగల యెహోవా, రోషం గల దేవుడు.

  6. “ఆ దేశంలో నివసిస్తున్న వారితో సంధి చేసుకోకుండ జాగ్రత్తపడండి; ఎందుకంటే వారు తమ దేవుళ్ళతో వ్యభిచరించి వాటికి బలులు అర్పించినప్పుడు, వారు మిమ్మల్ని ఆహ్వానిస్తారు, మీరు ఆ బలులను తింటారు.

  7. మీ దేవుడైన యెహోవా వారిని మీకు అప్పగించగా, మీరు వారిని ఓడించినప్పుడు, వారిని పూర్తిగా నాశనం చేయాలి. వారితో సంధి చేసుకోకూడదు వారిని కరుణించకూడదు.

  8. మీరు ఈ దేశస్థులతో నిబంధన చేసుకోవద్దు, కాని వారి బలిపీఠాలను పడగొట్టాలి’ అని ఆజ్ఞ ఇచ్చాను. అయినా మీరు నా మాట వినలేదు. మీరెందుకు ఇలా చేశారు?

  9. హనానీ కుమారుడు, దీర్ఘదర్శియైన యెహు అతన్ని కలుసుకోడానికి వెళ్లి రాజైన యెహోషాపాతుతో, “మీరు దుర్మార్గులకు సహాయం చేస్తూ యెహోవాను ద్వేషించేవారిని ప్రేమిస్తారా? యెహోవాకు మీమీద కోపం వచ్చింది.

  10. మరేషాకు చెందిన దోదవహు కుమారుడైన ఎలీయెజెరు యెహోషాపాతుకు వ్యతిరేకంగా, “నీవు అహజ్యాతో పొత్తు పెట్టుకున్నావు కాబట్టి, నీవు చేసిన దాన్ని యెహోవా నాశనం చేస్తారు” అని ప్రవచించాడు. ఓడలు బద్దలయ్యాయి, వాణిజ్యానికి తర్షీషుకు వెళ్లలేకపోయాయి.

  11. ఈ ప్రజల మార్గాన్ని అనుసరించకూడదని యెహోవా నన్ను హెచ్చరించి నాతో ఖచ్చితంగా చెప్పిన మాట ఇదే:

  12. “ఈ ప్రజలు కుట్ర అని చెప్పే ప్రతిదాన్ని కుట్ర అనకండి. వారు భయపడే దానికి భయపడకండి. దానికి బెదిరిపోకండి.

  13. వారు నన్ను సంప్రదించకుండా ఈజిప్టుకు వెళ్తారు; వారు సహాయం కోసం ఫరో కాపుదల కోసం చూస్తారు, ఆశ్రయం కోసం ఈజిప్టు నీడ కోసం చూస్తారు.

  14. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లెక్కచేయకుండా యెహోవా నుండి సహాయం కోసం చూడకుండ సహయం కోసం ఈజిప్టుకు వెళ్లే వారికి గుర్రాలపై ఆధారపడేవారికి, తమ రథాల సంఖ్యపై గుర్రపురౌతుల గొప్ప బలం మీద నమ్మకం ఉంచే వారికి శ్రమ.

  15. ఎఫ్రాయిం విగ్రహాలతో కలుసుకున్నాడు; అతన్ని అలాగే వదిలేయండి!

  16. ఎఫ్రాయిం గాలిని మేస్తున్నాడు; అతడు రోజంతా తూర్పు గాలిని వెంటాడుతున్నాడు, విస్తారంగా అబద్ధాలాడుతూ, దౌర్జన్యం చేస్తున్నాడు. అతడు అష్షూరుతో ఒప్పందం చేస్తున్నాడు ఈజిప్టుకు ఒలీవనూనె పంపిస్తున్నాడు.