Assyria
ఇలా కూడా పిలుస్తారు: Asshur, Assur, Assyrian, Assyrians
36.3500, 43.1500 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి
Assyria ను ప్రస్తావించే వచనాలు
అక్కడినుండి అతడు అష్షూరుకు వెళ్లి అక్కడ నీనెవె, రెహోబోత్-ఇర్, కలహు,
అతని వారసులు అష్షూరు వైపు వెళ్లే మార్గంలో హవీలా నుండి ఈజిప్టు సరిహద్దు దగ్గర ఉన్న షూరు వరకు ఉన్న ప్రాంతంలో స్థిరపడ్డారు. వారు తమ సోదరులందరికి విరోధంగా నివసించారు.
తర్వాత అష్షూరు రాజైన పూలు దేశాన్ని ఆక్రమించాడు, మెనహేము రాజ్యం మీద తన బలం నిలకడగా ఉండునట్లు, అష్షూరు రాజు సహాయం కోరుతూ అతనికి వెయ్యి తలాంతుల వెండిని ఇచ్చాడు.
ఈ మొత్తం అష్షూరు రాజుకు ఇవ్వడానికి మెనహేము ఇశ్రాయేలులో ఉన్న ధనవంతులందరి దగ్గరా, యాభై షెకెళ్ళ వెండి చొప్పున వసూలు చేశాడు. కాబట్టి అష్షూరు రాజు విడిచి, ఇశ్రాయేలు దేశంలో ఇక ఉండలేదు.
ఇశ్రాయేలు రాజైన పెకహు కాలంలో అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు వచ్చి, ఈయోను, ఆబేల్-బేత్-మయకా, యానోహ, కెదెషు, హాసోరు పట్టణాలను పట్టుకున్నాడు. అతడు గిలాదు, గలిలయ నఫ్తాలి ప్రాంతం అంతటిని పట్టుకుని, ఆ ప్రాంతాల ప్రజలను బందీలుగా అష్షూరుకు తీసుకెళ్లాడు.
ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరుకు దూతలను పంపి, “నేను మీ దాసున్ని మీ బానిసను. మీరు వచ్చి, నాపై దాడి చేస్తున్న అరాము ఇశ్రాయేలు రాజుల నుండి నన్ను రక్షించండి” అని చెప్పాడు.
ఆహాజు యెహోవా మందిరంలో నుండి రాజభవనం ఖజానాలో నుండి వెండి బంగారాలు అష్షూరు రాజుకు కానుకగా పంపించాడు.
అష్షూరు రాజు అతని మాట అంగీకరించి, దమస్కు మీద దండెత్తి, దానిని స్వాధీనపరచుకున్నాడు. దాని ప్రజలను కీరుకు బందీలుగా తీసుకెళ్లాడు, రెజీనును చంపాడు.
రాజైన ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరును కలుసుకోడానికి దమస్కు పట్టణానికి వెళ్లాడు. దమస్కు పట్టణంలో ఒక బలిపీఠాన్ని చూసి, దాని పోలిక, నమూనా, దాని నిర్మాణ విధానం అంతా యాజకుడైన ఊరియాకు పంపాడు.
మందిరం దగ్గర కట్టబడిన సబ్బాతు మంటపాలను, యెహోవా మందిరం బయట రాజు ద్వారాన్ని తీయించాడు. ఇది అష్షూరు రాజుకు భయపడి ఇదంతా చేశాడు.
అష్షూరు రాజైన షల్మనేసెరు హోషేయ మీద దాడి చేయడానికి రాగా హోషేయ అతనికి లొంగిపోయి అతనికి పన్ను చెల్లించాడు.
అయితే హోషేయ కుట్ర చేస్తున్నట్టు అష్షూరు రాజు పసిగట్టాడు, ఎందుకంటే హోషేయ, ఈజిప్టు రాజైన సో దగ్గరకు దూతలను పంపి ప్రతి సంవత్సరం అష్షూరు రాజుకు చెల్లించే పన్ను చెల్లించడం మానేశాడు; కాబట్టి షల్మనేసెరు అతన్ని పట్టుకుని చెరసాలలో వేశాడు.
అప్పుడు అష్షూరు రాజు దేశానంతా ఆక్రమించి, సమరయ మీదికి దండెత్తి దాన్ని మూడేళ్ళ వరకు ముట్టడించాడు.
హోషేయ పరిపాలనలోని తొమ్మిదో సంవత్సరంలో అష్షూరు రాజు సమరయను పట్టుకుని ఇశ్రాయేలు వారిని అష్షూరుకు బందీలుగా తీసుకెళ్లాడు. హాలహులో, హాబోరు నది ప్రాంతంలో ఉన్న గోజానులో, మాదీయుల పట్టణాల్లో వారిని ఉంచాడు.
చివరికి యెహోవా తన సేవకులైన ప్రవక్తలందరి ద్వారా హెచ్చరించినట్లు, వారిని తన సముఖం నుండి త్రోసివేశారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు తమ స్వదేశం నుండి బందీలుగా అష్షూరుకు వెళ్లారు, ఈనాటికీ వారక్కడ ఉన్నారు.
అష్షూరు రాజు బబులోను, కూతా, అవ్వా, హమాతు, సెఫర్వయీము నుండి మనుష్యులను తీసుకువచ్చి, సమరయ పట్టణాల్లో ఇశ్రాయేలీయులకు బదులుగా వారిని ఉంచాడు. వారు సమరయను స్వాధీనం చేసుకుని దాని పట్టణాల్లో నివసించారు.
అష్షూరు రాజుకు, “మీరు తీసుకువచ్చి సమరయ పట్టణాల్లో ఉంచిన ప్రజలకు ఈ దేశం యొక్క దేవుని నియమాలు తెలియవు. ఆయనకు ఏం కావాలో ప్రజలకు తెలియదు కాబట్టి సింహాలు వారిని చంపుతూ ఉన్నాయని వారు అష్షూరు రాజుకు చెప్పారు.”
అప్పుడు అష్షూరు రాజు, “సమరయ నుండి బందీలుగా తీసుకువచ్చిన యాజకులలో ఒకడిని అక్కడికి వెళ్లి అక్కడ నివసిస్తూ ఆ దేశ దేవుని నియమాలను ఆ ప్రజలకు బోధించడానికి పంపించండి” అని ఆజ్ఞాపించాడు.
యెహోవా అతనికి తోడుగా ఉన్నారు కాబట్టి హిజ్కియా చేసిన వాటన్నిటిలో జయం పొందాడు. అతడు అష్షూరు రాజుకు సేవచేయకుండ అతని మీద తిరగబడ్డాడు.
రాజైన హిజ్కియా పరిపాలన యొక్క నాలుగవ సంవత్సరంలో, ఇశ్రాయేలు రాజు, ఏలా కుమారుడైన హోషేయ పరిపాలన యొక్క ఏడవ సంవత్సరంలో, అష్షూరు రాజైన షల్మనేసెరు సమరయ మీదికి దండెత్తి దాన్ని ముట్టడించాడు.
అష్షూరు రాజు ఇశ్రాయేలును చెరగా తీసుకెళ్లి, హాలహులో, హాబోరు నది ప్రాంతంలో ఉన్న గోజానులో, మాదీయుల పట్టణాల్లో వారిని ఉంచాడు.
రాజైన హిజ్కియా పాలన యొక్క పద్నాలుగవ సంవత్సరంలో అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశంలోని కోటగోడలున్న పట్టణాలన్నిటి మీద దాడిచేసి వాటిని స్వాధీనం చేసుకున్నాడు.
కాబట్టి యూదా రాజైన హిజ్కియా, లాకీషు పట్టణంలో ఉన్న అష్షూరు రాజు దగ్గరకు, “నేను తప్పు చేశాను. నా దగ్గర నుండి నీవు వెనుకకు వెళ్లిపో, నీవు నా నుండి ఏమి కోరిన అది ఇస్తాను” అని సందేశం పంపాడు. అష్షూరు రాజు మూడువందలు తలాంతుల వెండి, ముప్పై తలాంతుల బంగారం యూదా రాజైన హిజ్కియా చెల్లించాలని విధించాడు.
ఇంకా ఆ కాలంలో యూదా రాజైన హిజ్కియా యెహోవా ఆలయ తలుపులకున్న బంగారం, తలుపు స్తంభాలకున్న బంగారం తీయించి అష్షూరు రాజుకిచ్చాడు.
అష్షూరు రాజు తన ప్రధాన సైన్యాధిపతిని, ముఖ్య అధికారిని, సైన్యాధిపతిని, పెద్ద సైన్యంతో, లాకీషు నుండి యెరూషలేములో ఉన్న రాజైన హిజ్కియా దగ్గరకు పంపాడు. వారు యెరూషలేముకు దండెత్తి చాకలి రేవు దారిలో ఉన్న పై కోనేటి కాలువ దగ్గర ఆగారు.