Skip to content

Creation Era

The Tower of Babel

Scattered nations and confused languages mark the beginning of the diversity of peoples across the earth.

64 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. నోవహు కుమారులైన షేము, హాము, యాపెతు అనబడే వారి వంశావళి వివరణ: జలప్రళయం తర్వాత వారికి కుమారులు పుట్టారు.

  2. యాపెతు కుమారులు: గోమెరు, మాగోగు, మాదయి, యవాను, తుబాలు, మెషెకు, తీరసు.

  3. గోమెరు కుమారులు: అష్కెనజు, రీఫతు, తోగర్మా.

  4. ఆదికాండము 10:4సుమారు క్రీ.పూ. 2338

    యవాను కుమారులు: ఎలీషా, తర్షీషు, కిత్తీము, దోదానీము.

  5. ఆదికాండము 10:5సుమారు క్రీ.పూ. 2247

    (వీరినుండి సముద్ర తీర ప్రజలు, వారి వారి వంశం ప్రకారం, తమ తమ భాషలతో సరిహద్దులలో విస్తరించారు.)

  6. ఆదికాండము 10:6సుమారు క్రీ.పూ. 2228

    హాము కుమారులు: కూషు, ఈజిప్టు, పూతు, కనాను.

  7. ఆదికాండము 10:7సుమారు క్రీ.పూ. 2228

    కూషు కుమారులు: సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తెకా. రాయమా కుమారులు: షేబ, దేదాను.

  8. ఆదికాండము 10:8సుమారు క్రీ.పూ. 2289

    కూషు నిమ్రోదుకు తండ్రి, ఇతడు భూమిపై మొదటి బలమైన యోధుడు అయ్యాడు.

  9. ఆదికాండము 10:9సుమారు క్రీ.పూ. 2289

    అతడు యెహోవా దృష్టిలో బలమైన వేటగాడు. అందుకే, “యెహోవా ఎదుట గొప్ప వేటగాడైన నిమ్రోదు వలె” అని సామెత ఉంది.

  10. ఆదికాండము 10:10సుమారు క్రీ.పూ. 2259

    షీనారులో అతని రాజ్యంలో మొదటి ప్రాంతాలు బబులోను, ఎరెకు, అక్కదు, కల్నే అనేవి ప్రధాన పట్టణాలు.

  11. ఆదికాండము 10:11సుమారు క్రీ.పూ. 2304

    అక్కడినుండి అతడు అష్షూరుకు వెళ్లి అక్కడ నీనెవె, రెహోబోత్-ఇర్, కలహు,

  12. ఆదికాండము 10:12సుమారు క్రీ.పూ. 2304

    నీనెవెకు కలహుకు మధ్యలో ఉన్న రెసెను అనే గొప్ప పట్టణం కట్టి తన సరిహద్దును విస్తరింపజేశాడు.

  13. ఆదికాండము 10:13సుమారు క్రీ.పూ. 2304

    ఈజిప్టు కుమారులు: లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నఫ్తుహీయులు,

  14. ఆదికాండము 10:14సుమారు క్రీ.పూ. 2304

    పత్రూసీయులు, కస్లూహీయులు (వీరినుండి ఫిలిష్తీయులు వచ్చారు) కఫ్తోరీయులు.

  15. ఆదికాండము 10:15సుమారు క్రీ.పూ. 2304

    కనాను కుమారులు: మొదటి కుమారుడగు సీదోను, హిత్తీయులు,

  16. ఆదికాండము 10:16సుమారు క్రీ.పూ. 2304

    యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు,

  17. ఆదికాండము 10:17సుమారు క్రీ.పూ. 2304

    హివ్వీయులు, అర్కీయులు, సీనీయులు,

  18. ఆదికాండము 10:18సుమారు క్రీ.పూ. 2304

    అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు. (తర్వాత కనాను వంశస్థులు చెదిరిపోయారు

  19. ఆదికాండము 10:19సుమారు క్రీ.పూ. 2304

    కనాను సరిహద్దులు సీదోను నుండి గెరారు వైపు గాజా వరకు అలాగే సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిము, లాషా పట్టణాల వరకు విస్తరించాయి.)

  20. ఆదికాండము 10:20సుమారు క్రీ.పూ. 2304

    వీరు వంశాల ప్రకారం, వివిధ భాషల ప్రకారం విభిన్న ప్రాంతాలకు, దేశాలకు వ్యాపించిన హాము కుమారులు.

  21. ఆదికాండము 10:21సుమారు క్రీ.పూ. 2304

    షేముకు కూడా కుమారులు పుట్టారు, ఇతని పెద్ద సహోదరుడు యాపెతు; షేము ఏబెరు కుమారులందరికి పూర్వికుడు.

  22. ఆదికాండము 10:22సుమారు క్రీ.పూ. 2304

    షేము కుమారులు: ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము.

  23. ఆదికాండము 10:23సుమారు క్రీ.పూ. 2304

    అరాము కుమారులు: ఊజు, హూలు, గెతెరు, మెషెకు.

  24. ఆదికాండము 10:24సుమారు క్రీ.పూ. 2304

    అర్పక్షదు షేలహుకు తండ్రి: షేలహు ఏబెరుకు తండ్రి.

  25. ఆదికాండము 10:25సుమారు క్రీ.పూ. 2247

    ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టారు: ఒకనికి పెలెగు అని పేరు పెట్టారు ఎందుకంటే అతని కాలంలోనే భూమి విభజింపబడింది; అతని సోదరునికి యొక్తాను అని పేరు పెట్టారు.