Skip to content

Shem గురించి బైబిల్ వచనాలు

81 వచనాలు · 4 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నోవహు 500 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి షేము, హాము యాపెతులు పుట్టారు.

  2. నోవహుకు ముగ్గురు కుమారులు: షేము, హాము, యాపెతు.

  3. ఆ రోజే నోవహు, అతని కుమారులు షేము, హాము, యాపెతు, నోవహు భార్య, అతని ముగ్గురు కుమారుల భార్యలు ఓడలోనికి వెళ్లారు.

  4. ఓడలో నుండి వచ్చిన నోవహు కుమారులు షేము, హాము, యాపెతు. (హాము కనానీయులకు తండ్రి.)

  5. అయితే షేము, యాపెతు ఒక వస్త్రం తీసుకుని తమ భుజాల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి నగ్న శరీరాన్ని కప్పారు. తండ్రి నగ్న శరీరం వైపు చూడకుండ వారు తమ ముఖాలను మరోవైపుకు తిప్పుకున్నారు.

  6. నోవహుకు మత్తు వదిలిన తర్వాత చిన్నకుమారుడు తనకు చేసింది తెలుసుకుని,

  7. ఇలా అన్నాడు, “కనాను శపించబడాలి! అతడు తన సహోదరులకు దాసులలో అత్యల్పునిగా ఉంటాడు.”

  8. ఇంకా అతడు, “షేము దేవుడైన యెహోవాకు స్తుతి! కనాను అతనికి దాసుడవాలి.

  9. దేవుడు యాపెతు సరిహద్దును విస్తరింపజేయాలి; యాపెతు షేము గుడారాల్లో నివసించాలి, కనాను యాపెతుకు దాసుడవాలి” అని అన్నాడు.

  10. నోవహు కుమారులైన షేము, హాము, యాపెతు అనబడే వారి వంశావళి వివరణ: జలప్రళయం తర్వాత వారికి కుమారులు పుట్టారు.

  11. షేముకు కూడా కుమారులు పుట్టారు, ఇతని పెద్ద సహోదరుడు యాపెతు; షేము ఏబెరు కుమారులందరికి పూర్వికుడు.

  12. షేము కుమారులు: ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము.

  13. అరాము కుమారులు: ఊజు, హూలు, గెతెరు, మెషెకు.

  14. అర్పక్షదు షేలహుకు తండ్రి: షేలహు ఏబెరుకు తండ్రి.

  15. ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టారు: ఒకనికి పెలెగు అని పేరు పెట్టారు ఎందుకంటే అతని కాలంలోనే భూమి విభజింపబడింది; అతని సోదరునికి యొక్తాను అని పేరు పెట్టారు.

  16. యొక్తాను కుమారులు: అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,

  17. హదోరము, ఊజాలు, దిక్లా,

  18. ఓబాలు, అబీమాయేలు, షేబ,

  19. ఓఫీరు, హవీలా, యోబాబు. వీరందరు యొక్తాను కుమారులు.

  20. (వీరు నివసించే ప్రాంతం మేషా నుండి తూర్పు కొండసీమ ఉన్న సెఫారా వరకు ఉంది.)

  21. వీరు తమ వంశాల ప్రకారం వారి భాషల ప్రకారం విభిన్న ప్రాంతాలకు, దేశాలకు వ్యాపించిన షేము కుమారులు.

  22. ఇది షేము కుటుంబ వంశావళి. జలప్రళయం గతించిన రెండు సంవత్సరాల తర్వాత, షేముకు 100 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు అతనికి అర్పక్షదు పుట్టాడు.

  23. అర్పక్షదు పుట్టిన తర్వాత షేము 500 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.

  24. అర్పక్షదు 35 సంవత్సరాల వయసువాడై షేలహుకు తండ్రి అయ్యాడు.

  25. షేలహు పుట్టిన తర్వాత అర్పక్షదు 403 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా అతనికి కుమారులు కుమార్తెలు పుట్టారు.