Skip to content

Shem గురించి బైబిల్ వచనాలు

81 వచనాలు · 4 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. షేలహు 30 సంవత్సరాల వయసువాడై ఏబెరుకు తండ్రి అయ్యాడు.

  2. ఏబెరు పుట్టిన తర్వాత షేలహు 403 సంవత్సరాలు బ్రతికాడు, అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.

  3. ఏబెరు 34 సంవత్సరాల వయసువాడై పెలెగును కన్నాడు.

  4. పెలెగు పుట్టిన తర్వాత ఏబెరు 430 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.

  5. పెలెగు 30 సంవత్సరాల వయసువాడై రయూను కన్నాడు.

  6. రయూ పుట్టిన తర్వాత పెలెగు 209 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.

  7. రయూ 32 సంవత్సరాల వయసువాడై సెరూగును కన్నాడు.

  8. సెరూగు పుట్టిన తర్వాత రయూ 207 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.

  9. సెరూగు 30 సంవత్సరాల వయసువాడై నాహోరును కన్నాడు.

  10. నాహోరు పుట్టిన తర్వాత సెరూగు 200 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు కుమార్తెలు అతనికి పుట్టారు.

  11. నాహోరు 29 సంవత్సరాల వయసువాడై తెరహును కన్నాడు.

  12. తెరహు పుట్టిన తర్వాత నాహోరు 119 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.

  13. తెరహు 70 సంవత్సరాల వయసులో ఉండగా అతనికి అబ్రాము, నాహోరు, హారాను పుట్టారు.

  14. ఇది తెరహు కుటుంబ వంశావళి. తెరహుకు అబ్రాము, నాహోరు, హారాను పుట్టారు. హారానుకు లోతు పుట్టాడు.

  15. హారాను, తన తండ్రి తెరహు బ్రతికి ఉన్నప్పుడే, కల్దీయుల ఊరు అనే పట్టణంలో, తన జన్మస్థలంలో చనిపోయాడు.

  16. అబ్రాము, నాహోరు ఇద్దరు కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అబ్రాము భార్యపేరు శారాయి, నాహోరు భార్యపేరు మిల్కా; ఈమె మిల్కాకును ఇస్కాకును తండ్రియైన హారాను కుమార్తె.

  17. నోవహు కుమారులు: షేము, హాము, యాపెతు.

  18. షేము కుమారులు: ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము. అరాము కుమారులు: ఊజు, హూలు, గెతెరు, మెషెకు.

  19. అర్పక్షదు షేలహుకు తండ్రి, షేలహు ఏబెరుకు తండ్రి.

  20. ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టారు: ఒకనికి పెలెగు అని పేరు పెట్టారు, ఎందుకంటే అతని కాలంలోనే భూమి విభజింపబడింది; అతని సోదరునికి యొక్తాను అని పేరు పెట్టారు.

  21. యొక్తాను కుమారులు: అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,

  22. హదోరము, ఊజాలు, దిక్లా,

  23. ఓబాలు, అబీమాయేలు, షేబ,

  24. ఓఫీరు, హవీలా, యోబాబు. వీరందరు యొక్తాను కుమారులు.

  25. షేము, అర్పక్షదు, షేలహు,