Shem
ఇలా కూడా పిలుస్తారు: Sem
Shem ను ప్రస్తావించే వచనాలు
నోవహు 500 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి షేము, హాము యాపెతులు పుట్టారు.
నోవహుకు ముగ్గురు కుమారులు: షేము, హాము, యాపెతు.
ఆ రోజే నోవహు, అతని కుమారులు షేము, హాము, యాపెతు, నోవహు భార్య, అతని ముగ్గురు కుమారుల భార్యలు ఓడలోనికి వెళ్లారు.
ఓడలో నుండి వచ్చిన నోవహు కుమారులు షేము, హాము, యాపెతు. (హాము కనానీయులకు తండ్రి.)
అయితే షేము, యాపెతు ఒక వస్త్రం తీసుకుని తమ భుజాల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి నగ్న శరీరాన్ని కప్పారు. తండ్రి నగ్న శరీరం వైపు చూడకుండ వారు తమ ముఖాలను మరోవైపుకు తిప్పుకున్నారు.
ఇంకా అతడు, “షేము దేవుడైన యెహోవాకు స్తుతి! కనాను అతనికి దాసుడవాలి.
దేవుడు యాపెతు సరిహద్దును విస్తరింపజేయాలి; యాపెతు షేము గుడారాల్లో నివసించాలి, కనాను యాపెతుకు దాసుడవాలి” అని అన్నాడు.
నోవహు కుమారులైన షేము, హాము, యాపెతు అనబడే వారి వంశావళి వివరణ: జలప్రళయం తర్వాత వారికి కుమారులు పుట్టారు.
షేముకు కూడా కుమారులు పుట్టారు, ఇతని పెద్ద సహోదరుడు యాపెతు; షేము ఏబెరు కుమారులందరికి పూర్వికుడు.
షేము కుమారులు: ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము.
వీరు తమ వంశాల ప్రకారం వారి భాషల ప్రకారం విభిన్న ప్రాంతాలకు, దేశాలకు వ్యాపించిన షేము కుమారులు.
ఇది షేము కుటుంబ వంశావళి. జలప్రళయం గతించిన రెండు సంవత్సరాల తర్వాత, షేముకు 100 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు అతనికి అర్పక్షదు పుట్టాడు.
అర్పక్షదు పుట్టిన తర్వాత షేము 500 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
నోవహు కుమారులు: షేము, హాము, యాపెతు.
షేము కుమారులు: ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము. అరాము కుమారులు: ఊజు, హూలు, గెతెరు, మెషెకు.
షేము, అర్పక్షదు, షేలహు,
షేలహు కేయినాను కుమారుడు, కేయినాను అర్పక్షదు కుమారుడు, అర్పక్షదు షేము కుమారుడు, షేము నోవహు కుమారుడు, నోవహు లెమెకు కుమారుడు,