Skip to content

Tongue గురించి బైబిల్ వచనాలు

56 వచనాలు · 6 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. (వీరినుండి సముద్ర తీర ప్రజలు, వారి వారి వంశం ప్రకారం, తమ తమ భాషలతో సరిహద్దులలో విస్తరించారు.)

  2. వీరు వంశాల ప్రకారం, వివిధ భాషల ప్రకారం విభిన్న ప్రాంతాలకు, దేశాలకు వ్యాపించిన హాము కుమారులు.

  3. భూలోకమంతా ఒకే భాష ఒకే యాస ఉంది.

  4. ప్రజలు తూర్పు వైపునకు ప్రయాణమై వెళ్తుండగా, షీనారు దేశంలో ఒక మైదానాన్ని కనుగొని అక్కడే స్థిరపడ్డారు.

  5. వారు ఒకరితో ఒకరు, “రండి ఇటుకలు చేసి వాటిని బాగా కాలుద్దాం” అని చెప్పుకున్నారు. వారు రాళ్లకు బదులు ఇటుకలు, అడుసుకు బదులుగా కీలుమట్టి వాడారు.

  6. అప్పుడు వారు, “రండి, మన కోసం ఆకాశాన్ని అంటే గోపురం గల ఒక పట్టణాన్ని కట్టుకుని మనకు మనం పేరు తెచ్చుకుందాం; లేదా మనం భూమంతా చెదిరిపోతాం” అని అన్నారు.

  7. అయితే యెహోవా మనుష్యులు కట్టుకుంటున్న పట్టణాన్ని, గోపురాన్ని చూడటానికి క్రిందికి దిగి వచ్చారు.

  8. యెహోవా, “ఒకవేళ ప్రజలు ఒకే భాష మాట్లాడుతూ ఇది చేయడం ప్రారంభిస్తే, అప్పుడు వారు చేద్దామనుకుంది ఏదైనా వారికి అసాధ్యం కాదు.

  9. రండి, మనం క్రిందికి వెళ్లి వారి భాషను తారుమారు చేద్దాం, అప్పుడు ఒకరి సంభాషణ ఒకరు అర్థం చేసుకోలేరు” అని అన్నారు.

  10. కాబట్టి యెహోవా వారిని భూమి అంతట చెదరగొట్టారు, వారు పట్టణ నిర్మాణం ఆపివేశారు.

  11. యెహోవా భూప్రజలందరి భాషను తారుమారు చేశారు కాబట్టి అది బాబెలు అని పిలువబడింది. యెహోవా వారిని అక్కడినుండి భూలోకమంతా చెదరగొట్టారు.

  12. జ్ఞానంగలవారు ఉపదేశాన్ని అంగీకరిస్తారు, మూర్ఖులు తమకు తానే కష్టాన్ని తెచ్చుకుని నశిస్తారు.

  13. విస్తారమైన మాటల్లో పాపానికి అంతం ఉండదు, కాని వివేకులు నాలుకను అదుపులో పెడతారు.

  14. తక్కువగా మాట్లాడేవాడు తెలివిగలవాడు, శాంత గుణముగలవాడు మంచిచెడులు ఎరిగినవాడు.

  15. నోటిని నాలుకను భద్రం చేసుకునేవారు కష్టాల నుండి తమ ప్రాణాన్ని కాపాడుకుంటారు,

  16. త్వరపడి మాట్లాడేవాన్ని నీవు చూశావా? వారికన్నా బుద్ధిహీనునికి ఎక్కువ ఆశ.

  17. చింపివేయడానికి, కుట్టడానికి, మౌనంగా ఉండడానికి, మాట్లాడడానికి,

  18. “వారి యొక్క పనులు వారి ఆలోచనలను బట్టి నేను అన్ని దేశాల ప్రజలను, రకరకాల భాషలు మాట్లాడేవారిని ఒక్కచోట చేర్చడానికి వస్తున్నాను. వారు వచ్చి నా మహిమను చూస్తారు.

  19. పెంతెకొస్తు పండుగ రోజు వచ్చినప్పుడు, వారందరు ఒక్కచోట చేరుకొన్నారు.

  20. అప్పుడు అకస్మాత్తుగా పరలోకం నుండి వేగంగా వీస్తున్న గాలి లాంటి ధ్వని వచ్చి వారు కూర్చున్న ఇల్లంతా నింపింది.

  21. అగ్ని జ్వాలల్లాంటి నాలుకలు విభజింపబడి వారిలో అందరిపై నిలిచినట్లు వారు చూశారు

  22. వారందరు పరిశుద్ధాత్మతో నింపబడి, ఆత్మ వారికి ఇచ్చిన సామర్థ్యంతో ఇతర భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టారు.

  23. ఆ రోజుల్లో ఆకాశం క్రింద ఉన్న దేశాలన్నింటి నుండి వచ్చిన దైవభక్తి కలిగిన యూదులు యెరూషలేములో నివసిస్తున్నారు.

  24. వారు ఈ శబ్దం విన్నప్పుడు, ప్రజలు కలవరంతో ఒక్క చోటికి గుంపుగా వచ్చారు, ఎందుకంటే ప్రతి ఒక్కరు తమ సొంత భాష మాట్లాడడం విన్నారు.

  25. వారు ఎంతగానో ఆశ్చర్యపడి, “మాట్లాడుతున్న వీరందరు గలిలయులు కారా?