- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
Creation Era
The Tower of Babel
Scattered nations and confused languages mark the beginning of the diversity of peoples across the earth.
ఈ కాలపు వచనాలు
- ఆదికాండము 10:26సుమారు క్రీ.పూ. 2247
యొక్తాను కుమారులు: అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,
- ఆదికాండము 10:27సుమారు క్రీ.పూ. 2247
హదోరము, ఊజాలు, దిక్లా,
- ఆదికాండము 10:28సుమారు క్రీ.పూ. 2207
ఓబాలు, అబీమాయేలు, షేబ,
- ఆదికాండము 10:29సుమారు క్రీ.పూ. 2207
ఓఫీరు, హవీలా, యోబాబు. వీరందరు యొక్తాను కుమారులు.
- ఆదికాండము 10:30సుమారు క్రీ.పూ. 2207
(వీరు నివసించే ప్రాంతం మేషా నుండి తూర్పు కొండసీమ ఉన్న సెఫారా వరకు ఉంది.)
- ఆదికాండము 10:31సుమారు క్రీ.పూ. 2207
వీరు తమ వంశాల ప్రకారం వారి భాషల ప్రకారం విభిన్న ప్రాంతాలకు, దేశాలకు వ్యాపించిన షేము కుమారులు.
- ఆదికాండము 10:32సుమారు క్రీ.పూ. 2207
తమ వంశాల ప్రకారం తమ దేశాల్లో ఉంటున్న నోవహు కుమారుల వంశావళి ఇదే. జలప్రళయం తర్వాత వీరి ద్వారా ప్రజలు విస్తరించారు.
- ఆదికాండము 11:1సుమారు క్రీ.పూ. 2247
భూలోకమంతా ఒకే భాష ఒకే యాస ఉంది.
- ఆదికాండము 11:2సుమారు క్రీ.పూ. 2247
ప్రజలు తూర్పు వైపునకు ప్రయాణమై వెళ్తుండగా, షీనారు దేశంలో ఒక మైదానాన్ని కనుగొని అక్కడే స్థిరపడ్డారు.
- ఆదికాండము 11:3సుమారు క్రీ.పూ. 2247
వారు ఒకరితో ఒకరు, “రండి ఇటుకలు చేసి వాటిని బాగా కాలుద్దాం” అని చెప్పుకున్నారు. వారు రాళ్లకు బదులు ఇటుకలు, అడుసుకు బదులుగా కీలుమట్టి వాడారు.
- ఆదికాండము 11:4సుమారు క్రీ.పూ. 2247
అప్పుడు వారు, “రండి, మన కోసం ఆకాశాన్ని అంటే గోపురం గల ఒక పట్టణాన్ని కట్టుకుని మనకు మనం పేరు తెచ్చుకుందాం; లేదా మనం భూమంతా చెదిరిపోతాం” అని అన్నారు.
- ఆదికాండము 11:5సుమారు క్రీ.పూ. 2247
అయితే యెహోవా మనుష్యులు కట్టుకుంటున్న పట్టణాన్ని, గోపురాన్ని చూడటానికి క్రిందికి దిగి వచ్చారు.
- ఆదికాండము 11:6సుమారు క్రీ.పూ. 2247
యెహోవా, “ఒకవేళ ప్రజలు ఒకే భాష మాట్లాడుతూ ఇది చేయడం ప్రారంభిస్తే, అప్పుడు వారు చేద్దామనుకుంది ఏదైనా వారికి అసాధ్యం కాదు.
- ఆదికాండము 11:7సుమారు క్రీ.పూ. 2247
రండి, మనం క్రిందికి వెళ్లి వారి భాషను తారుమారు చేద్దాం, అప్పుడు ఒకరి సంభాషణ ఒకరు అర్థం చేసుకోలేరు” అని అన్నారు.
- ఆదికాండము 11:8సుమారు క్రీ.పూ. 2247
కాబట్టి యెహోవా వారిని భూమి అంతట చెదరగొట్టారు, వారు పట్టణ నిర్మాణం ఆపివేశారు.
- ఆదికాండము 11:9సుమారు క్రీ.పూ. 2247
యెహోవా భూప్రజలందరి భాషను తారుమారు చేశారు కాబట్టి అది బాబెలు అని పిలువబడింది. యెహోవా వారిని అక్కడినుండి భూలోకమంతా చెదరగొట్టారు.
- ఆదికాండము 11:10సుమారు క్రీ.పూ. 2346
ఇది షేము కుటుంబ వంశావళి. జలప్రళయం గతించిన రెండు సంవత్సరాల తర్వాత, షేముకు 100 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు అతనికి అర్పక్షదు పుట్టాడు.
- ఆదికాండము 11:11సుమారు క్రీ.పూ. 1846
అర్పక్షదు పుట్టిన తర్వాత షేము 500 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
- ఆదికాండము 11:12సుమారు క్రీ.పూ. 2311
అర్పక్షదు 35 సంవత్సరాల వయసువాడై షేలహుకు తండ్రి అయ్యాడు.
- ఆదికాండము 11:13సుమారు క్రీ.పూ. 1908
షేలహు పుట్టిన తర్వాత అర్పక్షదు 403 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా అతనికి కుమారులు కుమార్తెలు పుట్టారు.
- ఆదికాండము 11:14సుమారు క్రీ.పూ. 2281
షేలహు 30 సంవత్సరాల వయసువాడై ఏబెరుకు తండ్రి అయ్యాడు.
- ఆదికాండము 11:15సుమారు క్రీ.పూ. 1878
ఏబెరు పుట్టిన తర్వాత షేలహు 403 సంవత్సరాలు బ్రతికాడు, అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
- ఆదికాండము 11:16సుమారు క్రీ.పూ. 2247
ఏబెరు 34 సంవత్సరాల వయసువాడై పెలెగును కన్నాడు.
- ఆదికాండము 11:17సుమారు క్రీ.పూ. 1817
పెలెగు పుట్టిన తర్వాత ఏబెరు 430 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
- ఆదికాండము 11:18సుమారు క్రీ.పూ. 2217
పెలెగు 30 సంవత్సరాల వయసువాడై రయూను కన్నాడు.