Nineveh
ఇలా కూడా పిలుస్తారు: Ninevites
36.3500, 43.1500 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి
Nineveh ను ప్రస్తావించే వచనాలు
అక్కడినుండి అతడు అష్షూరుకు వెళ్లి అక్కడ నీనెవె, రెహోబోత్-ఇర్, కలహు,
నీనెవెకు కలహుకు మధ్యలో ఉన్న రెసెను అనే గొప్ప పట్టణం కట్టి తన సరిహద్దును విస్తరింపజేశాడు.
అప్పుడు అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగి వెళ్లిపోయాడు, నీనెవెకు తిరిగివెళ్లి అక్కడ ఉండిపోయాడు.
అప్పుడు అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగి వెళ్లిపోయాడు, నీనెవెకు తిరిగివెళ్లి అక్కడ ఉండిపోయాడు.
“నీవు లేచి నీనెవె మహా పట్టణానికి వెళ్లి దానికి వ్యతిరేకంగా ప్రకటించు, ఎందుకంటే దాని చెడుతనం నా దృష్టిలో ఘోరంగా ఉంది.”
“నీవు మహా పట్టణమైన నీనెవెకు వెళ్లి నేను నీకు ఇచ్చే సందేశాన్ని ప్రకటించు.”
యోనా యెహోవా మాటకు లోబడి నీనెవెకు వెళ్లాడు; నీనెవె చాలా పెద్ద పట్టణం కాబట్టి దానిగుండా వెళ్లడానికి మూడు రోజుల పట్టింది.
యోనా ఆ పట్టణంలో ఒక రోజు ప్రయాణమంత దూరం వెళ్లి, “ఇంకా నలభై రోజులకు నీనెవె నాశనమవుతుంది” అని అంటూ ప్రకటించాడు.
నీనెవె ప్రజలు దేవున్ని నమ్మి ఉపవాసం ప్రకటించారు. గొప్పవారి నుండి సామాన్యుల వరకు అందరు గోనెపట్ట కట్టుకున్నారు.
యోనా హెచ్చరిక నీనెవె రాజుకు చేరినప్పుడు, అతడు తన సింహాసనం దిగి, తన రాజ వస్త్రాలను తీసివేసి, గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు.
అతడు నీనెవెలో ఈ ప్రకటన చేశాడు: “రాజు, అతని ఘనుల శాసనం ప్రకారం: “మనుష్యులు గాని జంతువులు పశువులు గొర్రెల మందలు గాని దేన్ని రుచి చూడకూడదు తినకూడదు త్రాగకూడదు.
అలాంటప్పుడు కుడి ఎడమలు తెలియని లక్ష ఇరవై వేలమంది మనుష్యులు ఎన్నో జంతువులు ఉన్న గొప్ప పట్టణమైన నీనెవె గురించి నేను చింతించకూడదా?” అన్నారు.
నీనెవెను గురించిన ప్రవచనం; ఎల్కోషీయుడైన నహూముకు ఇవ్వబడిన దర్శనాన్ని వివరించే గ్రంథమిది.
నీనెవె నీరు పారుతున్న నీరు కొలనులా ఉంది. “ఆగు! ఆగు!” అని వారు ఏడుస్తారు, కానీ ఎవరూ వెనుకకు తిరుగరు.
నిన్ను చూసేవారందరూ నీ నుండి పారిపోయి, ‘నీనెవె శిథిలావస్థలో ఉంది, ఆమె కోసం ఎవరు దుఃఖిస్తారు?’ నిన్ను ఓదార్చేవారిని నేను ఎక్కడి నుండి తీసుకురాగలం?” అని అంటారు.
ఆయన తన చేయి ఉత్తరం వైపు చాచి అష్షూరును నాశనం చేస్తారు. నీనెవెను పూర్తిగా నిర్జనమై ఎడారిలా ఎండిపోయేలా చేస్తారు.
నీనెవె ప్రజలు యోనా ప్రకటించినప్పుడు అతని మాటలను విని పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగారు. అయితే ఇప్పుడు యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నా ఆయన మాటలను వినని ఈ తరం వారి మీద నీనెవె న్యాయతీర్పు దినాన నేరం మోపుతారు.”
నీనెవె పట్టణస్థులకు యోనా ఒక సూచనగా ఉండునట్లు, మనుష్యకుమారుడు ఈ తరానికి సూచనగా ఉంటాడు.