- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
Creation Era
The Tower of Babel
Scattered nations and confused languages mark the beginning of the diversity of peoples across the earth.
ఈ కాలపు వచనాలు
- ఆదికాండము 11:19సుమారు క్రీ.పూ. 2008
రయూ పుట్టిన తర్వాత పెలెగు 209 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
- ఆదికాండము 11:20సుమారు క్రీ.పూ. 2185
రయూ 32 సంవత్సరాల వయసువాడై సెరూగును కన్నాడు.
- ఆదికాండము 11:21సుమారు క్రీ.పూ. 1978
సెరూగు పుట్టిన తర్వాత రయూ 207 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
- ఆదికాండము 11:22సుమారు క్రీ.పూ. 2155
సెరూగు 30 సంవత్సరాల వయసువాడై నాహోరును కన్నాడు.
- ఆదికాండము 11:23సుమారు క్రీ.పూ. 1955
నాహోరు పుట్టిన తర్వాత సెరూగు 200 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు కుమార్తెలు అతనికి పుట్టారు.
- ఆదికాండము 11:24సుమారు క్రీ.పూ. 2126
నాహోరు 29 సంవత్సరాల వయసువాడై తెరహును కన్నాడు.
- ఆదికాండము 11:25సుమారు క్రీ.పూ. 2007
తెరహు పుట్టిన తర్వాత నాహోరు 119 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
- ఆదికాండము 11:26సుమారు క్రీ.పూ. 2056
తెరహు 70 సంవత్సరాల వయసులో ఉండగా అతనికి అబ్రాము, నాహోరు, హారాను పుట్టారు.
- ఆదికాండము 11:27సుమారు క్రీ.పూ. 1996
ఇది తెరహు కుటుంబ వంశావళి. తెరహుకు అబ్రాము, నాహోరు, హారాను పుట్టారు. హారానుకు లోతు పుట్టాడు.
- ఆదికాండము 11:28సుమారు క్రీ.పూ. 1996
హారాను, తన తండ్రి తెరహు బ్రతికి ఉన్నప్పుడే, కల్దీయుల ఊరు అనే పట్టణంలో, తన జన్మస్థలంలో చనిపోయాడు.
- ఆదికాండము 11:29సుమారు క్రీ.పూ. 1996
అబ్రాము, నాహోరు ఇద్దరు కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అబ్రాము భార్యపేరు శారాయి, నాహోరు భార్యపేరు మిల్కా; ఈమె మిల్కాకును ఇస్కాకును తండ్రియైన హారాను కుమార్తె.
- ఆదికాండము 11:30సుమారు క్రీ.పూ. 1996
శారాయి గొడ్రాలు, ఆమెకు పిల్లలు కలుగలేదు.
- ఆదికాండము 11:31సుమారు క్రీ.పూ. 1926
తెరహు తన కుమారుడైన అబ్రామును, తన మనవడు, హారాను కుమారుడైన లోతును, తన కోడలైన అబ్రాము భార్య శారాయిని తీసుకుని కల్దీయుల ఊరు నుండి కనానుకు ప్రయాణమయ్యాడు. కాని దారిలో వారు హారానుకు వచ్చి అక్కడే స్థిరపడ్డారు.
- ఆదికాండము 11:32సుమారు క్రీ.పూ. 1921
తెరహు 205 సంవత్సరాలు జీవించి హారానులో చనిపోయాడు.