circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
ఈ కాలపు వచనాలు
- సంఖ్యాకాండము 1:1సుమారు క్రీ.పూ. 1490
ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన రెండవ సంవత్సరం రెండవ నెల మొదటి రోజు సీనాయి ఎడారిలో ఉన్న సమావేశ గుడారంలో యెహోవా మోషేతో మాట్లాడారు. ఆయన ఇలా అన్నారు:
- సంఖ్యాకాండము 1:2సుమారు క్రీ.పూ. 1490
మొత్తం సమాజంలోని ఇశ్రాయేలీయుల వంశాలు కుటుంబాల ప్రకారం వారి జనాభా లెక్కలు నమోదు చేయి.
- సంఖ్యాకాండము 1:3సుమారు క్రీ.పూ. 1490
నీవూ అహరోను కలిసి ఇశ్రాయేలీయులలో ఇరవై సంవత్సరాలు అంతకు పైబడి వయస్సు గలవారు, సైన్యంలో సేవ చేయగలవారిని వారి వారి సేనల ప్రకారం లెక్కించాలి.
- సంఖ్యాకాండము 1:4సుమారు క్రీ.పూ. 1490
ప్రతీ గోత్రం నుండి ఒకడు తన కుటుంబానికి పెద్దగా ఉన్న ప్రతీ ఒకడు మీకు సహాయం చేయాలి.
- సంఖ్యాకాండము 1:5సుమారు క్రీ.పూ. 1490
“మీకు సహాయం చేయాల్సిన పురుషుల పేర్లు ఇవి: “రూబేను గోత్రం నుండి షెదేయూరు కుమారుడైన ఎలీసూరు;
- సంఖ్యాకాండము 1:6సుమారు క్రీ.పూ. 1490
షిమ్యోను గోత్రం నుండి సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు;
- సంఖ్యాకాండము 1:7సుమారు క్రీ.పూ. 1490
యూదా గోత్రం నుండి అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను;
- సంఖ్యాకాండము 1:8సుమారు క్రీ.పూ. 1490
ఇశ్శాఖారు గోత్రం నుండి సూయరు కుమారుడైన నెతనేలు;
- సంఖ్యాకాండము 1:9సుమారు క్రీ.పూ. 1490
జెబూలూను గోత్రం నుండి హేలోను కుమారుడైన ఏలీయాబు;
- సంఖ్యాకాండము 1:10సుమారు క్రీ.పూ. 1490
యోసేపు కుమారుల నుండి: ఎఫ్రాయిం గోత్రం నుండి అమీహూదు కుమారుడైన ఎలీషామా; మనష్షే గోత్రం నుండి పెదాసూరు కుమారుడైన గమలీయేలు;
- సంఖ్యాకాండము 1:11సుమారు క్రీ.పూ. 1490
బెన్యామీను గోత్రం నుండి గిద్యోనీ కుమారుడైన అబీదాను;
- సంఖ్యాకాండము 1:12సుమారు క్రీ.పూ. 1490
దాను గోత్రం నుండి అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు;
- సంఖ్యాకాండము 1:13సుమారు క్రీ.పూ. 1490
ఆషేరు గోత్రం నుండి ఒక్రాను కుమారుడైన పగీయేలు;
- సంఖ్యాకాండము 1:14సుమారు క్రీ.పూ. 1490
గాదు గోత్రం నుండి దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు;
- సంఖ్యాకాండము 1:15సుమారు క్రీ.పూ. 1490
నఫ్తాలి గోత్రం నుండి ఏనాను కుమారుడైన అహీర.”
- సంఖ్యాకాండము 1:16సుమారు క్రీ.పూ. 1490
వీరు సమాజంలో వారి పితరుల గోత్రాల నుండి నాయకులుగా ఏర్పాటు చేయబడినవారు. వీరు ఇశ్రాయేలీయుల వంశాల పెద్దలు.
- సంఖ్యాకాండము 1:17సుమారు క్రీ.పూ. 1490
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, మోషే అహరోనులు పేర్లు పేర్కొనబడిన వారిని తీసుకుని,
- సంఖ్యాకాండము 1:18సుమారు క్రీ.పూ. 1490
రెండవ నెల మొదటి రోజున సమాజమంతటిని సమావేశ పరిచారు. ప్రజలు వారి వారి గోత్రాలు, వారి వారి కుటుంబాల ప్రకారం తమ వంశాన్ని నమోదు చేసుకున్నారు. యిరవై సంవత్సరాలు అంతకు పైబడి వయస్సున్న వారు ఒకరి తర్వాత ఒకరి పేరు నమోదు చేశారు.
- సంఖ్యాకాండము 1:19సుమారు క్రీ.పూ. 1490
యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం మోషే సీనాయి ఎడారిలో వారిని లెక్కించాడు:
- సంఖ్యాకాండము 1:20సుమారు క్రీ.పూ. 1490
ఇశ్రాయేలు మొదటి సంతానమైన రూబేను సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి, సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
- సంఖ్యాకాండము 1:21సుమారు క్రీ.పూ. 1490
రూబేను గోత్రం నుండి లెక్కించబడినవారు 46,500.
- సంఖ్యాకాండము 1:22సుమారు క్రీ.పూ. 1490
షిమ్యోను సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
- సంఖ్యాకాండము 1:23సుమారు క్రీ.పూ. 1490
షిమ్యోను గోత్రం నుండి లెక్కించబడినవారు 59,300.
- సంఖ్యాకాండము 1:24సుమారు క్రీ.పూ. 1490
గాదు సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
- సంఖ్యాకాండము 1:25సుమారు క్రీ.పూ. 1490
గాదు గోత్రం నుండి లెక్కించబడినవారు 45,650.