The Altar of Burnt Offering గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
“తుమ్మకర్రతో మూడు మూరల ఎత్తుగల బలిపీఠం కట్టాలి; అది అయిదు మూరల పొడవు అయిదు మూరల వెడల్పుతో చతురస్రంగా ఉండాలి.
కొమ్ములు, బలిపీఠం ఒకే భాగంలా ఉండేలా దాని నాలుగు మూలల్లో ప్రతి మూలకు ఒక కొమ్మును చేయాలి. బలిపీఠాన్ని ఇత్తడితో పొదిగించాలి.
దాని పాత్రలన్నిటిని అంటే బూడిద తొలగించడానికి కుండలు, పారలు, చల్లే గిన్నెలు, ముళ్ళ గరిటెలు, నిప్పు పెనాలను ఇత్తడితో చేయాలి.
దానికి వలలాంటి ఇత్తడి జాలి తయారుచేసి, ఆ జాలి నాలుగు మూలల్లో ప్రతి మూలకు ఒక ఇత్తడి ఉంగరాన్ని తయారుచేసి,
ఆ జాలి బలిపీఠం మధ్యకు చేరేలా బలిపీఠం గట్టు క్రింది భాగంలో దానిని ఉంచాలి.
బలిపీఠం కోసం తుమ్మకర్రతో మోతకర్రలు తయారుచేసి, వాటిని ఇత్తడితో పొదిగించాలి.
బలిపీఠాన్ని మోసినప్పుడు దాన్ని మోయడానికి ఉపయోగించే మోతకర్రలు దాని రెండు ప్రక్కలా ఉన్న ఉంగరాల్లో దూర్చాలి.
పలకలను ఉపయోగించి బలిపీఠాన్ని గుల్లగా చేయాలి. కొండమీద నీకు చూపించిన నమూనా ప్రకారమే దాన్ని చేయాలి.
ఆ ఎద్దు రక్తంలో కొంత తీసుకుని నీ వ్రేలితో బలిపీఠపు కొమ్ముల మీద పూసి మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగున పోయాలి.
ప్రాయశ్చిత్తం చేయడానికి ప్రతిరోజు ఒక ఎద్దును పాపపరిహారబలిగా అర్పించాలి. బలిపీఠం కోసం ప్రాయశ్చిత్తం జరిగించి బలిపీఠాన్ని శుద్ధి చేయాలి, అలాగే దాన్ని ప్రతిష్ఠించడానికి అభిషేకం చేయాలి.
ఏడు రోజులు బలిపీఠం కోసం ప్రాయశ్చిత్తం చేసి దానిని ప్రతిష్ఠించండి. అప్పుడు బలిపీఠం అత్యంత పరిశుద్ధమవుతుంది; దానికి తగిలినవన్ని పరిశుద్ధమవుతాయి.
“నీవు క్రమం తప్పకుండా ప్రతిరోజు బలిపీఠం మీద ఏడాది గొర్రెపిల్లలు రెండు అర్పించాలి.
ఒక గొర్రెపిల్లను ఉదయాన, మరొకదాన్ని సూర్యాస్తమయ వేళ అర్పించాలి.
దంచి తీసిన ఒక పావు హిన్ ఒలీవనూనెతో కలిపిన ఒక ఓమెరు నాణ్యమైన పిండిని, ఒక పావు హిన్ ద్రాక్షారసాన్ని పానార్పణగా మొదటి గొర్రెపిల్లతో పాటు అర్పించాలి.
సాయంకాలం మరొక గొర్రెపిల్లతో కలిపి ఉదయకాలం అర్పించినట్లే భోజనార్పణ, పానార్పణ అర్పించాలి. ఇది యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.
“యెహోవా ఎదుట సమావేశ గుడారపు ద్వారం దగ్గర రాబోయే తరాలన్ని క్రమంగా నిత్యం ఈ దహనబలిని అర్పించాలి. అక్కడే నేను మిమ్మల్ని కలుసుకొని మీతో మాట్లాడతాను.
“కాబట్టి నేను సన్నిధి గుడారాన్ని, బలిపీఠాన్ని ప్రతిష్ఠ చేస్తాను, నాకు యాజకులుగా సేవ చేసేందుకు అహరోనును అతని కుమారులను ప్రతిష్ఠ చేస్తాను.
వారు తుమ్మకర్రతో మూడు మూరల ఎత్తుగల బలిపీఠం దహనబలి కోసం కట్టారు; అది అయిదు మూరల పొడవు అయిదు మూరల వెడల్పుతో చతురస్రంగా ఉంది.
వారు కొమ్ములు, బలిపీఠం ఒకే భాగంలా ఉండేలా దాని నాలుగు మూలల్లో ప్రతి మూలకు ఒక కొమ్మును చేశారు. వారు బలిపీఠాన్ని ఇత్తడితో పొదిగించారు.
దాని పాత్రలన్నిటిని అంటే బూడిద తొలగించడానికి కుండలు, పారలు, చల్లే గిన్నెలు, ముళ్ళ గరిటెలు, నిప్పు పెనాలను ఇత్తడితో తయారుచేశారు.
దానికి వలలాంటి ఇత్తడి జాలి తయారుచేసి, ఆ జాలి బలిపీఠం మధ్యకు చేరేలా బలిపీఠం గట్టు క్రింది భాగంలో దానిని ఉంచారు.
ఆ జాలి నాలుగు మూలల్లో మోతకర్రలు ఉంచేందుకు ఆ జాలి నాలుగు మూలలకు నాలుగు ఇత్తడి ఉంగరాలు తయారుచేశారు.
వారు తుమ్మకర్రతో మోతకర్రలు తయారుచేసి, వాటిని ఇత్తడితో పొదిగించారు.
బలిపీఠాన్ని మోయడానికి దాన్ని మోయడానికి ఉపయోగించే మోతకర్రలు దాని రెండు ప్రక్కలా ఉన్న ఉంగరాల్లో దూర్చారు; వారు పలకలను ఉపయోగించి బలిపీఠాన్ని గుల్లగా చేశారు.
ఇత్తడి బలిపీఠం, దాని ఇత్తడి జల్లెడ, దాని మోతకర్రలు దాని పాత్రలన్నీ; ఇత్తడి గంగాళం, దాని పీట;