కంటెంట్‌కు వెళ్లండి

The Altar of Burnt Offering గురించి బైబిల్ వచనాలు

150 వచనాలు · 30 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “నీవు ప్రత్యక్ష గుడారపు ద్వారం ఎదుట దహనబలిపీఠాన్ని ఉంచాలి;

  2. తర్వాత దహనబలిపీఠాన్ని, దాని పాత్రలన్నిటిని అభిషేకించాలి; బలిపీఠాన్ని ప్రతిష్ఠించాలి, అది అత్యంత పరిశుద్ధమవుతుంది.

  3. సమావేశ గుడారపు ద్వారానికి సమీపంగా దహనబలిపీఠాన్ని ఉంచి దాని మీద దహనబలి అర్పించి భోజనార్పణను సమర్పించాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మోషే ఇది చేశాడు.

  4. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు దాని తల, క్రొవ్వుతో పాటు, ముక్కలను బలిపీఠం మీద కాలుతున్న కట్టెల మీద పేర్చాలి.

  5. అతడు లోపలి అవయవాలను కాళ్లను నీటితో కడగాలి, యాజకుడు వాటన్నిటిని బలిపీఠం మీద కాల్చాలి. అది దహనబలి, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.

  6. యాజకుడు అప్పుడు కొంచెం రక్తాన్ని సమావేశ గుడారంలో యెహోవా ఎదుట ఉన్న పరిమళ వాసనగల ధూపవేదిక కొమ్ములపై పూయాలి. మిగిలిన ఎద్దు రక్తం అతడు సమావేశ గుడార ద్వారం దగ్గర దహనబలి యొక్క బలిపీఠం అడుగున పోయాలి.

  7. అతడు సమావేశ గుడారంలో యెహోవా ఎదుట ఉన్న బలిపీఠం కొమ్ములపై కొంత రక్తాన్ని పూసి మిగిలిన రక్తం సమావేశ గుడార ద్వారం దగ్గర దహనబలి యొక్క బలిపీఠం అడుగున పోయాలి.

  8. అప్పుడు యాజకుడు పాపపరిహారబలి రక్తం నుండి కొంత రక్తాన్ని తన వ్రేలితో తీసుకుని దహనబలి యొక్క బలిపీఠం కొమ్ములపై పూసి మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగున పోయాలి.

  9. బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుతూ ఉండాలి; అది ఆరిపోకూడదు.

  10. తర్వాత మోషే అభిషేక తైలాన్ని తీసుకుని సమావేశ గుడారాన్ని, దానిలోని ప్రతిదాన్ని అభిషేకించి, వాటిని పవిత్రం చేశాడు.

  11. అతడు బలిపీఠాన్ని, దాని పాత్రలన్నిటిని, దాని గంగాళాన్ని దాని పీటను ప్రతిష్ఠించడానికి, బలిపీఠం మీద ఏడుసార్లు కొంచెం నూనె చిలకరించి వాటిని అభిషేకించాడు.

  12. మోషే ఎద్దును వధించి, కొంత రక్తాన్ని తీసుకుని, బలిపీఠం శుద్ధి చేయడానికి, తన వ్రేలితో బలిపీఠపు కొమ్ముల మీద దానిని పూసాడు. మిగిలిన రక్తాన్ని అతడు బలిపీఠం అడుగున పోశాడు. కాబట్టి మోషే దానికి ప్రాయశ్చిత్తం చేసి దానిని ప్రతిష్ఠించాడు.

  13. యెహోవా సన్నిధి నుండి అగ్ని వచ్చి బలపీఠం మీద ఉన్న దహనబలిని క్రొవ్వు భాగాలను కాల్చివేసింది. అది చూసి ప్రజలంతా ఆనందంతో కేకలువేస్తూ సాగిలపడ్డారు.

  14. యెహోవాకు గ్రుడ్డి దానిని గాని, గాయపడిన దానిని గాని లేదా అంగవైకల్యం ఉన్నదానిని గాని, చీముపట్టిన పుండ్లతో ఉన్నదానిని గాని అర్పించకూడదు. యెహోవాకు హోమబలిగా వీటిలో దేన్ని బలిపీఠం మీద ఉంచవద్దు.

  15. మోషే సమావేశ గుడారాన్ని సిద్ధం చేసినప్పుడు దాన్ని అభిషేకించి, దాన్ని, దాని సామాగ్రినంతటిని ప్రతిష్ఠించాడు. అతడు బలిపీఠాన్ని, దాని వస్తువులను కూడా ప్రతిష్ఠించాడు.

  16. తర్వాత ఇశ్రాయేలు నాయకులు, లెక్కించబడిన వారిపట్ల బాధ్యత వహించిన గోత్ర నాయకులు యైన కుటుంబ పెద్దలు అర్పణలు అర్పించారు.

  17. వారు యెహోవా ఎదుటకు ప్రతి నాయకుడి నుండి ఒక ఎద్దు, ప్రతి ఇద్దరి నుండి ఒక బండి చొప్పున ఆరు పైకప్పు ఉన్న బండ్లు, పన్నెండు ఎద్దులను తమ బహుమతులుగా తెచ్చారు. వీటిని వారు సమావేశం గుడారం ముందు సమర్పించారు.

  18. యెహోవా మోషేతో,

  19. “సమావేశ గుడారం సేవలో వాడబడేలా వారి నుండి వీటిని స్వీకరించు. ప్రతీ వ్యక్తి యొక్క పనికి అవసరం ఉన్న ప్రకారం, వాటిని లేవీయులకు ఇవ్వు.”

  20. కాబట్టి మోషే ఆ బండ్లను, ఎద్దులను తీసుకుని లేవీయులకు ఇచ్చాడు.

  21. అతడు రెండు బండ్లు, నాలుగు ఎద్దులను గెర్షోనీయులకు, వారి పనికి అవసరం ఉన్న ప్రకారం ఇచ్చాడు,

  22. అలాగే నాలుగు బండ్లు, ఎనిమిది ఎద్దులను మెరారీయులకు ఇచ్చాడు. వారందరు యాజకుడైన అహరోను కుమారుడు ఈతామారు పర్యవేక్షణలో ఉన్నారు.

  23. కానీ మోషే కహాతీయులకు ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే వారు వారి బాధ్యత ప్రకారం, పరిశుద్ధ వస్తువులను వారి భుజాలపై మోసేవారు.

  24. బలిపీఠాన్ని అభిషేకించినప్పుడు, నాయకులు ప్రతిష్ఠార్పణలు తెచ్చి, బలిపీఠం ముందుంచారు.

  25. యెహోవా మోషేతో, “బలిపీఠం ప్రతిష్ఠించడం కోసం ప్రతిరోజు ఒక్కొక్క నాయకుడు తమ అర్పణను తీసుకురావాలి.”