- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
ఈ కాలపు వచనాలు
- ద్వితీయోపదేశకాండము 33:20సుమారు క్రీ.పూ. 1451
గాదు గురించి అతడు ఇలా అన్నాడు: “గాదు దేశాన్ని విశాలం చేసినవారు ధన్యులు! గాదు అక్కడ సింహంలా నివసిస్తాడు, చేతిని గాని నడినెత్తిని చీల్చివేస్తాడు.
- ద్వితీయోపదేశకాండము 33:21సుమారు క్రీ.పూ. 1451
అతడు తన కోసం శ్రేష్ఠమైన భాగాన్ని ఎంచుకున్నాడు; నాయకుని భాగం అతని కోసం ఉంచబడుతుంది. ప్రజల పెద్దలు సమావేశమైనప్పుడు యెహోవా యొక్క నీతియుక్తమైన చిత్తాన్ని, ఇశ్రాయేలీయు గురించి ఆయన తీర్పులను, అతడు అమలుచేస్తాడు.”
- ద్వితీయోపదేశకాండము 33:22సుమారు క్రీ.పూ. 1451
దాను గురించి అతడు ఇలా చెప్పాడు: “దాను గోత్రం సింహం పిల్లలాంటిది, బాషాను నుండి దూకుతుంది.”
- ద్వితీయోపదేశకాండము 33:23సుమారు క్రీ.పూ. 1451
నఫ్తాలి గురించి అతడు ఇలా అన్నాడు: “నఫ్తాలి యెహోవా దయతో తృప్తి చెంది ఆయన దీవెనలతో నింపబడ్డాడు; దక్షిణం నుండి సముద్రం వరకు అతడు స్వాధీనం చేసుకుంటాడు.”
- ద్వితీయోపదేశకాండము 33:24సుమారు క్రీ.పూ. 1451
ఆషేరు గురించి అతడు ఇలా అన్నాడు: “కుమారులలో ఆషేరు అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు; అతడు తన సోదరుల దయను పొందును గాక. అతడు తన పాదాలను నూనెలో ముంచును గాక.
- ద్వితీయోపదేశకాండము 33:25సుమారు క్రీ.పూ. 1451
నీ ద్వారపు గడియలు ఇనుపవి, ఇత్తడివి నీ బలం నీ రోజులకు సమానంగా ఉంటుంది.
- ద్వితీయోపదేశకాండము 33:26సుమారు క్రీ.పూ. 1451
“యెషూరూను దేవుని పోలినవారు ఎవరు లేరు, ఆకాశవాహనుడై వచ్చి నీకు సహాయం చేయడానికి ఆయన ఆకాశం గుండా వస్తారు, తన తేజస్సుతో మేఘాలపై వస్తారు.
- ద్వితీయోపదేశకాండము 33:27సుమారు క్రీ.పూ. 1451
శాశ్వతమైన దేవుడు నీకు ఆశ్రయం, నిత్యమైన హస్తాలు నీ క్రింద ఉన్నాయి. ‘వారిని నాశనం చెయ్యండి!’ అంటూ ఆయన నీ శత్రువులను నీ ఎదుట నుండి తరిమివేస్తారు.
- ద్వితీయోపదేశకాండము 33:28సుమారు క్రీ.పూ. 1451
కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా నివసిస్తారు; ధాన్యం క్రొత్త ద్రాక్షరసం ఉన్న దేశంలో యాకోబు ఊట క్షేమంగా ఉంటుంది, అక్కడ ఆకాశం మంచు కురిపిస్తుంది.
- ద్వితీయోపదేశకాండము 33:29సుమారు క్రీ.పూ. 1451
ఇశ్రాయేలూ, మీరు ధన్యులు! యెహోవా రక్షించిన ప్రజలారా, మీలాంటి వారు ఎవరు? ఆయన మీకు డాలు, సహాయకుడు మీ మహిమగల ఖడ్గము. మీ శత్రువులు మీ ఎదుట భయపడతారు; మీరు వారి వీపుపై త్రొక్కుతారు.”
- ద్వితీయోపదేశకాండము 34:1సుమారు క్రీ.పూ. 1451
తర్వాత మోషే మోయాబు సమతల మైదానాల నుండి వెళ్లి యెరికో ఎదురుగా ఉన్న పిస్గా పర్వత శిఖరం వరకు వెళ్లి నెబో పర్వతమెక్కాడు. అక్కడ యెహోవా అతనికి గిలాదు నుండి దాను వరకు ఉన్న దేశాన్నంతా చూపించారు,
- ద్వితీయోపదేశకాండము 34:2సుమారు క్రీ.పూ. 1451
నఫ్తాలి ప్రాంతమంతటిని, ఎఫ్రాయిం మనష్షేల ప్రాంతాలను, పశ్చిమదిక్కున ఉన్న మధ్యధరా సముద్రం వరకు ఉన్న యూదా ప్రాంతాన్ని,
- ద్వితీయోపదేశకాండము 34:3సుమారు క్రీ.పూ. 1451
దక్షిణ ప్రాంతాన్ని, ఖర్జూర చెట్ల పట్టణమైన యెరికో లోయ నుండి సోయరు వరకు ఉన్న మొత్తం ప్రాంతాన్ని అతనికి చూపించారు.
- ద్వితీయోపదేశకాండము 34:4సుమారు క్రీ.పూ. 1451
అప్పుడు యెహోవా అతనితో ఇలా అన్నారు, “నేను మీ సంతానానికి ఇస్తానని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణంతో వాగ్దానం చేసిన దేశం ఇదే. కళ్ళారా నిన్ను దాన్ని చూడనిస్తున్నాను కాని, నది దాటి నీవు అక్కడికి వెళ్లవు.”
- ద్వితీయోపదేశకాండము 34:5సుమారు క్రీ.పూ. 1451
యెహోవా చెప్పిన ప్రకారంగా యెహోవా సేవకుడైన మోషే మోయాబు దేశంలోనే చనిపోయాడు.
- ద్వితీయోపదేశకాండము 34:6సుమారు క్రీ.పూ. 1451
బేత్-పెయోరు ఎదుట మోయాబులో ఉన్న ఒక లోయలో ఆయన అతన్ని పాతిపెట్టారు. అతని సమాధి ఎక్కడ ఉందో నేటివరకు ఎవరికీ తెలియదు.
- ద్వితీయోపదేశకాండము 34:7సుమారు క్రీ.పూ. 1451
మోషే చనిపోయినప్పుడు అతని వయస్సు నూట ఇరవై సంవత్సరాలు, అతని కళ్లు మసక బారలేదు అతని బలం తగ్గలేదు.
- ద్వితీయోపదేశకాండము 34:8సుమారు క్రీ.పూ. 1451
సంతాప దినాల సమయం పూర్తి అయ్యేవరకు ఇశ్రాయేలీయులు మోయాబు సమతల మైదానాల్లో మోషే కోసం ముప్పై రోజులు దుఃఖించారు.
- ద్వితీయోపదేశకాండము 34:9సుమారు క్రీ.పూ. 1451
అంతకుముందే మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచాడు కాబట్టి అతడు జ్ఞానాత్మతో నింపబడ్డాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు.
- ద్వితీయోపదేశకాండము 34:10సుమారు క్రీ.పూ. 1451
అప్పటినుండి ఇశ్రాయేలులో యెహోవా ముఖాముఖిగా మాట్లాడిన మోషే వంటి ప్రవక్త,
- ద్వితీయోపదేశకాండము 34:11సుమారు క్రీ.పూ. 1451
ఈజిప్టులో ఫరోకు, అతని అధికారులందరికి, అతని దేశమంతటికి సూచనలను, అద్భుతాలను చేయడానికి యెహోవా పంపిన అలాంటి ప్రవక్త ఇశ్రాయేలులో లేడు.
- ద్వితీయోపదేశకాండము 34:12సుమారు క్రీ.పూ. 1451
ఎందుకంటే ఇశ్రాయేలీయులందరి దృష్టిలో మోషే చేసిన భయం పుట్టించే శక్తివంతమైన కార్యాలు ఎవ్వరూ చేయలేదు.