కంటెంట్‌కు వెళ్లండి

The Tribes of Israel గురించి బైబిల్ వచనాలు

241 వచనాలు · 21 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఇశ్రాయేలు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు, రూబేను తన తండ్రి ఉంపుడుగత్తెయైన బిల్హాతో శయనించాడు, ఈ సంగతి ఇశ్రాయేలు విన్నాడు.

  2. లేయా కుమారులు: యాకోబు మొదటి కుమారుడు రూబేను, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను.

  3. రాహేలు కుమారులు: యోసేపు, బెన్యామీను.

  4. రాహేలు దాసి బిల్హా కుమారులు: దాను, నఫ్తాలి.

  5. లేయా దాసి జిల్పా కుమారులు: గాదు, ఆషేరు.

  6. “కాబట్టి ఇప్పుడు, నేను నీ దగ్గరకు రాకముందు ఈజిప్టులో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా వారిగా లెక్కించబడతారు; రూబేను షిమ్యోనుల్లా, ఎఫ్రాయిం మనష్షే కూడా నా వారిగా ఉంటారు.

  7. “రూబేనూ, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తి నా బలం యొక్క మొదటి గుర్తు, ఘనతలోను శక్తిలోను ఆధిక్యత గలవాడవు

  8. కానీ నీళ్లలా అస్థిరంగా ఉండే నీవు ఇకపై రాణించవు, ఎందుకంటే నీవు నీ తండ్రి మంచం ఎక్కావు, నా పడకను అపవిత్రం చేశావు.

  9. “షిమ్యోను లేవీ సోదరులు వారి ఖడ్గాలు హింసాయుధాలు.

  10. వారి సమావేశాల్లో నేను ప్రవేశించకుందును గాక, నా ఘనతను వారి కూడికలో చేర్చకుందును గాక, ఎందుకంటే వారి కోపంలో వారు మనుష్యులను చంపేశారు సరదా కోసం ఎడ్ల కాలి నరాలు తెగగొట్టారు.

  11. వారి కోపం శపించబడాలి, అది భయంకరమైనది, వారి ఆగ్రహం ఎంతో క్రూరమైనది! వారిని యాకోబులో చెల్లాచెదురు చేస్తాను, ఇశ్రాయేలులో వారిని చెదరగొడతాను.

  12. “యూదా, నీ సోదరులు నిన్ను ప్రశంసిస్తారు; నీ చేయి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది; నీ తండ్రి కుమారులు నీకు తలవంచుతారు

  13. యూదా, నీవు ఒక కొదమసింహం; నా కుమారుడా, నీవు వేటాడి తిరిగి వచ్చావు. అతడు సింహంలా కాళ్లు ముడుచుకుని, ఆడ సింహంలా పడుకుంటాడు, అతన్ని లేపడానికి ఎవరు తెగిస్తారు?

  14. రాజదండం యూదా దగ్గర నుండి తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండం తొలగదు, అది ఎవరికి చెందుతుందో అతడు వచ్చేవరకు తొలగదు, దేశాలు అతనికి విధేయులై ఉంటాయి.

  15. అతడు ద్రాక్షచెట్టుకు తన గాడిదను, మంచి ద్రాక్షచెట్టుకు గాడిద పిల్లను కడతాడు; అతడు ద్రాక్షరసంలో తన బట్టలను, ద్రాక్షరసంలో తన వస్త్రాలను ఉతుకుతాడు.

  16. అతని కళ్లు ద్రాక్షరసం కంటే ఎర్రగా, అతని పళ్లు పాలకంటే తెల్లగా ఉంటాయి.

  17. “జెబూలూను సముద్రతీరాన నివసిస్తాడు ఓడలకు రేవు అవుతాడు; అతని సరిహద్దు సీదోను వరకు వ్యాపిస్తుంది.

  18. “ఇశ్శాఖారు రెండు గొర్రెల దొడ్ల మధ్య పడుకుని ఉన్న బలమైన గాడిద వంటివాడు.

  19. అతడు తన విశ్రాంతి స్థలం ఎంత మంచిదో, అతని నేల ఎంత ఆహ్లాదకరమో చూసినప్పుడు, అతడు భుజం వంచి శ్రమించి, వెట్టిచాకిరికి సమర్పించుకుంటాడు.

  20. “దాను ఇశ్రాయేలు గోత్రాల్లో ఒక గోత్రంలా తన ప్రజలకు న్యాయం చేస్తాడు.

  21. దాను దారిన ఉండే పాములా, మార్గంలో ఉండే విషసర్పంలా, గుర్రాల మడిమెలు కాటు వేస్తాడు. అప్పుడు స్వారీ చేస్తున్నవాడు వెనుకకు పడతాడు.

  22. “యెహోవా! మీ రక్షణ కోసం వేచియున్నాను.

  23. “గాదు దోపిడి మూక ద్వారా దాడి చేయబడతాడు, కానీ అతడు వారి మడిమెలను కొడతాడు.

  24. “ఆషేరుకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది; రాజులకు తగిన భోజనం అతడు సమకూరుస్తాడు.

  25. “నఫ్తాలి స్వేచ్ఛ ఇవ్వబడిన లేడి అతడు అందమైన లేడిపిల్లలను కంటాడు.