Reuben
Reuben ను ప్రస్తావించే వచనాలు
లేయా గర్భవతియై ఒక కుమారునికి జన్మనిచ్చింది. “యెహోవా నా బాధను చూశారు. ఇప్పుడు తప్పకుండ నా భర్త నన్ను ప్రేమిస్తాడు” అని చెప్పి, అతనికి రూబేను అని పేరు పెట్టింది.
గోధుమ కోతకాలంలో రూబేను పొలాలకు వెళ్లాడు, అక్కడ ఉన్న పుత్రదాత వృక్షం పండ్లు కొన్ని తెచ్చి, తల్లి లేయాకు ఇచ్చాడు. రాహేలు లేయాతో, “నీ కుమారుడు తెచ్చిన పండ్లలో కొన్ని నాకు దయచేసి ఇవ్వు” అని అడిగింది.
ఇశ్రాయేలు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు, రూబేను తన తండ్రి ఉంపుడుగత్తెయైన బిల్హాతో శయనించాడు, ఈ సంగతి ఇశ్రాయేలు విన్నాడు.
లేయా కుమారులు: యాకోబు మొదటి కుమారుడు రూబేను, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను.
రూబేను ఇది విని, అతన్ని వారి నుండి రక్షించాలని ప్రయత్నించాడు. “మనం అతన్ని చంపొద్దు.
రక్తం చిందించవద్దు. అరణ్యంలో ఈ బావిలో వాన్ని పడద్రోయండి కానీ వానికి హానిచెయ్యవద్దు” అని అన్నాడు. యోసేపును వారి నుండి కాపాడి తన తండ్రి దగ్గరకు తిరిగి తీసుకెళ్లడానికి రూబేను ఇలా అన్నాడు.
రూబేను ఆ బావి దగ్గరకు తిరిగివచ్చి, అక్కడ యోసేపు లేడని చూసి, తన బట్టలు చింపుకున్నాడు.
రూబేను జవాబిస్తూ, “ఈ చిన్నవాని పట్ల పాపం చేయవద్దని నేను చెప్పలేదా? అయినా మీరు వినిపించుకోలేదు! ఇప్పుడు తన రక్తం కోసం మనం లెక్క అప్పగించాలి” అన్నాడు.
అప్పుడు రూబేను తన తండ్రితో, “నేను బెన్యామీనును తిరిగి నీ దగ్గరకు తీసుకురాకపోతే, నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చు. అతన్ని నాకు అప్పగించు, నేను తిరిగి అతన్ని నీ దగ్గరకు తీసుకువస్తాను” అన్నాడు.
ఈజిప్టుకు వెళ్లిన ఇశ్రాయేలు కుమారుల (యాకోబు అతని సంతానం) పేర్లు: రూబేను, యాకోబు యొక్క మొదటి కుమారుడు.
రూబేను కుమారులు: హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ.
“కాబట్టి ఇప్పుడు, నేను నీ దగ్గరకు రాకముందు ఈజిప్టులో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా వారిగా లెక్కించబడతారు; రూబేను షిమ్యోనుల్లా, ఎఫ్రాయిం మనష్షే కూడా నా వారిగా ఉంటారు.
“రూబేనూ, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తి నా బలం యొక్క మొదటి గుర్తు, ఘనతలోను శక్తిలోను ఆధిక్యత గలవాడవు
రూబేను, షిమ్యోను, లేవీ, యూదా;
వారి కుటుంబాలకు మూలపురుషులు వీరే: ఇశ్రాయేలు మొదటి కుమారుడైన రూబేను కుమారులు: హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ;
“మీకు సహాయం చేయాల్సిన పురుషుల పేర్లు ఇవి: “రూబేను గోత్రం నుండి షెదేయూరు కుమారుడైన ఎలీసూరు;
ఇశ్రాయేలు మొదటి సంతానమైన రూబేను సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి, సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
రూబేను గోత్రం నుండి లెక్కించబడినవారు 46,500.
దక్షిణం వైపు: రూబేను గోత్రం వారు వారి జెండా క్రింద ఉండాలి. షెదేయూరు కుమారుడైన ఎలీసూరు రూబేను ప్రజల నాయకుడు.
రూబేను శిబిరానికి వారి వారి దళాల ప్రకారం కేటాయించబడిన వారందరు, 1,51,450. వీళ్ళు రెండవ గుంపుగా వెళ్తారు.
నాలుగవ రోజు అర్పణను తెచ్చిన వారు రూబేను గోత్ర నాయకుడు, షెదేయూరు కుమారుడైన ఎలీసూరు.
వారి తర్వాత రూబేను శిబిరం వారు వారి సేనల ప్రకారం వెళ్లారు. షెదేయూరు కుమారుడైన ఎలీసూరు రూబేను గోత్ర నాయకుడు సైన్యాధిపతి.
వారి పేర్లు ఇవి: రూబేను గోత్రం నుండి, జక్కూరు కుమారుడైన షమ్మూయ;
లేవీ మునిమనమడు, కహాతు మనుమడు, ఇస్హారు కుమారుడగు కోరహు, కొంతమంది రూబేనీయులలో ఏలీయాబు కుమారులైన దాతాను, అబీరాములు, పేలెతు కుమారుడైన ఓనులు కొంతమందిని పోగు చేసి,
ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన, రూబేను వారసులు: హనోకు ద్వార, హనోకీయుల వంశం; పల్లు ద్వార, పల్లువీయుల వంశం;