కంటెంట్‌కు వెళ్లండి

Reuben

70 వచనాలు · 18 కుటుంబ సభ్యులు

Reuben ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. గిలాదులో ఉన్న రూబేను, గాదు, మనష్షే అర్థగోత్రం వారి దగ్గరకు వెళ్లి వారితో ఇలా అన్నారు:

  2. అప్పుడు రూబేను, గాదు, మనష్షే అర్థగోత్రం వారు ఇశ్రాయేలు వంశ పెద్దలకు ఇలా జవాబిచ్చారు:

  3. రూబేనీయులారా, గాదీయులారా, యెహోవా మాకు మీకు మధ్య యొర్దానును సరిహద్దుగా చేశారు! యెహోవాలో మీకు వాటా లేదు’ అని అంటారేమో! మీ సంతతివారు మా సంతతివారిని యెహోవాకు భయపడకుండా చేస్తారేమో!

  4. యాజకుడైన ఫీనెహాసు, సమాజ నాయకులు అనగా ఇశ్రాయేలీయుల వంశాల పెద్దలు రూబేను, గాదు, మనష్షే చెప్పింది విని సంతోషించారు.

  5. యాజకుడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు రూబేను, గాదు, మనష్షేలతో ఇలా అన్నాడు, “ఈ విషయంలో మీరు యెహోవాకు నమ్మకద్రోహం చేయలేదు కాబట్టి యెహోవా మనతో ఉన్నాడని ఈ రోజు మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మీరు ఇశ్రాయేలీయులను యెహోవా చేతిలో నుండి రక్షించారు.”

  6. అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు, నాయకులు గిలాదులోని రూబేనీయులు, గాదీయులను కలిసి కనానుకు తిరిగివచ్చి ఇశ్రాయేలీయులకు ఈ విషయాన్ని చెప్పారు.

  7. ఇశ్రాయేలీయులు ఆ వార్త విని సంతోషించి దేవున్ని స్తుతించారు. రూబేనీయులు, గాదీయులు నివసించిన దేశాన్ని నాశనం చేయడానికి వారిపై యుద్ధానికి వెళ్లడం గురించి వారు ఇక మాట్లాడలేదు.

  8. రూబేనీయులు, గాదీయులు యెహోవాయే దేవుడు అనడానికి ఈ బలిపీఠమే సాక్ష్యం అని చెప్పి దానికి ఏద్ అని పేరు పెట్టారు.

  9. ఇశ్శాఖారు అధిపతులు దెబోరాతో ఉన్నారు; ఇశ్శాఖారు మనుష్యులు బారాకుతో ఉన్నారు, అతని ఆదేశాన్ని బట్టి లోయలోనికి పంపబడ్డారు. రూబేను ప్రాంతాల్లో తీవ్ర హృదయాన్వేషణ కలిగింది.

  10. గొర్రెల మందల కోసం వేసే ఈలలు వినడానికి నీవెందుకు గొర్రెల దొడ్ల మధ్య ఉన్నావు? రూబేను ప్రాంతాల్లో తీవ్ర హృదయాన్వేషణ కలిగింది.

  11. ఇశ్రాయేలు కుమారులు: రూబేను, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను,

  12. ఇశ్రాయేలు మొదటి కుమారుడైన రూబేను కుమారులు. (అతడు మొదటి కుమారుడు, కాని అతడు తన తండ్రి పడక ఎక్కి దాన్ని అపవిత్రం చేశాడు కాబట్టి, అతని జ్యేష్ఠత్వపు హక్కులు ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడ్డాయి; కాబట్టి జన్మహక్కుల ప్రకారం వంశావళిలో అతడు నమోదు కాలేదు.

  13. ఇశ్రాయేలు మొదటి కుమారుడైన రూబేను కుమారులు వీరు: హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ.

  14. రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రం వారిలో డాలు కత్తి పట్టుకోవడంలో నేర్పుగలవారు, విల్లు ఉపయోగించగలవారు, యుద్ధశిక్షణ తీసుకున్నవారు 44,760 మంది ఉన్నారు.

  15. మెరారి సంతానం, వారి వంశాల ప్రకారం చీట్లు వేయడం వలన రూబేను, గాదు, జెబూలూను గోత్రాల ప్రదేశాల నుండి పన్నెండు పట్టణాలు కేటాయించబడ్డాయి.

  16. యెరికోకు తూర్పుగా యొర్దాను నది అవతల ఉన్న రూబేను గోత్ర ప్రదేశంలో నుండి ఎడారిలో ఉన్న బేసెరు, యహజు,

  17. రూబేనుకు ఒక భాగం; అది తూర్పు నుండి పడమర వరకు ఎఫ్రాయిముకు సరిహద్దుగా ఉంటుంది.

  18. యూదాకు ఒక భాగం; అది తూర్పు నుండి పడమర వరకు రూబేను భూభాగానికి సరిహద్దుగా ఉంటుంది.

  19. పట్టణ ద్వారాలకు ఇశ్రాయేలు గోత్రాల పేర్లు పెట్టాలి. ఉత్తర దిక్కున రూబేను ద్వారం, యూదా ద్వారం, లేవీ ద్వారం ఉండాలి.

  20. యూదా గోత్రంలో 12,000; రూబేను గోత్రంలో 12,000; గాదు గోత్రంలో 12,000;