Skip to content

circa 1446 BC

Moses & The Exodus

God raises up Moses to confront Pharaoh; the ten plagues culminate in Israel's dramatic deliverance from four centuries of bondage.

415 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. తమ కుటుంబాలతో యాకోబు వెంట ఈజిప్టుకు వెళ్లిన ఇశ్రాయేలు కుమారుల పేర్లు:

  2. రూబేను, షిమ్యోను, లేవీ, యూదా;

  3. ఇశ్శాఖారు, జెబూలూను, బెన్యామీను;

  4. దాను, నఫ్తాలి; గాదు, ఆషేరు.

  5. యాకోబు సంతతివారందరు డెబ్బైమంది; అప్పటికే యోసేపు ఈజిప్టులో ఉన్నాడు.

  6. నిర్గమకాండము 1:6సుమారు క్రీ.పూ. 1635

    కొన్ని సంవత్సరాల తర్వాత యోసేపు, అతని అన్నదమ్ములు ఆ తరం వారందరు చనిపోయారు,

  7. నిర్గమకాండము 1:7సుమారు క్రీ.పూ. 1635

    అయితే ఇశ్రాయేలీయులు అత్యధికంగా ఫలించారు; వారు గొప్పగా విస్తరించారు, అభివృద్ధి చెందారు, వారి సంఖ్య అంతకంతకు అభివృద్ధి పొంది వారున్న ప్రదేశం వారితోనే నిండిపోయింది.

  8. నిర్గమకాండము 1:8సుమారు క్రీ.పూ. 1635

    కొంతకాలం తర్వాత, యోసేపు గురించి తెలియని ఒక క్రొత్త రాజు ఈజిప్టులో అధికారంలోకి వచ్చాడు.

  9. నిర్గమకాండము 1:9సుమారు క్రీ.పూ. 1635

    అతడు తన ప్రజలతో, “చూడండి, ఈ ఇశ్రాయేలీయులు సంఖ్యలో, బలంలో మనలను అధిగమించారు.

  10. నిర్గమకాండము 1:10సుమారు క్రీ.పూ. 1635

    మనం వారితో యుక్తిగా నడుచుకోవాలి, లేకపోతే వారి సంఖ్య ఇంకా అధికమవుతుంది. ఒకవేళ యుద్ధం వస్తే వారు మన శత్రువులతో చేరి మనకు వ్యతిరేకంగా యుద్ధం చేసి ఈ దేశం నుండి వెళ్లిపోతారేమో” అన్నాడు.

  11. నిర్గమకాండము 1:11సుమారు క్రీ.పూ. 1635

    కాబట్టి వారిని అణచివేయాలని వారితో వెట్టిచాకిరి చేయించడానికి వారిపై బానిస యజమానులను నియమించారు, ఫరో కోసం పీతోము రామెసేసు అనే రెండు పట్టణాలను గిడ్డంగులుగా కట్టారు.

  12. నిర్గమకాండము 1:12సుమారు క్రీ.పూ. 1635

    అయితే వారు ఎంతగా అణచివేయబడ్డారో, అంతకన్నా ఎక్కువ విస్తరించి వారు వ్యాపించారు; కాబట్టి ఈజిప్టు ప్రజలు ఇశ్రాయేలీయులను బట్టి భయపడి,

  13. నిర్గమకాండము 1:13సుమారు క్రీ.పూ. 1635

    వారి చేత వెట్టిచాకిరి చేయించారు.

  14. నిర్గమకాండము 1:14సుమారు క్రీ.పూ. 1635

    మట్టి పనిలో, ఇటుకల పనిలో, పొలంలో చేసే ప్రతి పనిలో వారిచేత కఠిన సేవ చేయిస్తూ వారి జీవితాలను దుర్భరంగా మార్చారు. ఈజిప్టు ప్రజలు వారితో కఠినంగా పని చేయించారు.

  15. నిర్గమకాండము 1:15సుమారు క్రీ.పూ. 1635

    ఈజిప్టు రాజు, షిఫ్రా పూయా అనే హెబ్రీ మంత్రసానులతో మాట్లాడుతూ,

  16. నిర్గమకాండము 1:16సుమారు క్రీ.పూ. 1635

    “హెబ్రీ స్త్రీలకు ప్రసవ సమయంలో కాన్పుపీట దగ్గర మీరు వారికి సహాయం చేస్తున్నప్పుడు పుట్టింది మగపిల్లవాడైతే వానిని చంపెయ్యండి, ఆడపిల్ల పుడితే బ్రతకనివ్వండి” అని అన్నాడు.

  17. నిర్గమకాండము 1:17సుమారు క్రీ.పూ. 1635

    అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఈజిప్టు రాజు తమతో చెప్పింది చేయకుండా మగపిల్లలను బ్రతకనిచ్చారు.

  18. నిర్గమకాండము 1:18సుమారు క్రీ.పూ. 1635

    ఈజిప్టు రాజు ఆ స్త్రీలను పిలిపించి, “మీరెందుకు ఇలా చేశారు? మగపిల్లలను ఎందుకు బ్రతకనిచ్చారు?” అని వారిని అడిగాడు.

  19. నిర్గమకాండము 1:19సుమారు క్రీ.పూ. 1635

    అందుకు ఆ మంత్రసానులు, “హెబ్రీ స్త్రీలు ఈజిప్టు స్త్రీల వంటివారు కారు; వారు బలం గలవారు, మంత్రసానులు వారి దగ్గరకు రావడానికి ముందే ప్రసవిస్తున్నారు” అని ఫరోతో చెప్పారు.

  20. నిర్గమకాండము 1:20సుమారు క్రీ.పూ. 1635

    కాబట్టి దేవుడు ఆ మంత్రసానుల పట్ల దయ చూపించారు, ప్రజలు మరింత ఎక్కువగా విస్తరించారు.

  21. నిర్గమకాండము 1:21సుమారు క్రీ.పూ. 1635

    ఆ మంత్రసానులు దేవునికి భయపడ్డారు, కాబట్టి ఆయన వారి సొంత కుటుంబాలను వృద్ధిచేశారు.

  22. నిర్గమకాండము 1:22సుమారు క్రీ.పూ. 1573

    అప్పుడు ఫరో, “హెబ్రీయులకు పుట్టిన ప్రతి మగపిల్లవాన్ని నైలు నదిలో పడవేసి, ఒకవేళ ఆడపిల్లను అయితే బ్రతకనివ్వాలి” అని ఆజ్ఞాపించాడు.

  23. నిర్గమకాండము 2:1సుమారు క్రీ.పూ. 1572

    ఆ రోజుల్లో లేవీ గోత్రపు పురుషుడు లేవీ స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు,

  24. నిర్గమకాండము 2:2సుమారు క్రీ.పూ. 1571

    ఆమె గర్భవతియై ఒక కుమారుడిని కన్నది. అతడు చక్కగా ఉండడం చూసి, ఆమె వానిని మూడు నెలలు దాచిపెట్టింది.

  25. నిర్గమకాండము 2:3సుమారు క్రీ.పూ. 1571

    కాని ఆమె వానిని ఇక దాచలేకపోయినప్పుడు, వాని కోసం ఒక జమ్ము బుట్ట తీసుకుని దానికి జిగటమన్ను తారు పూసింది. ఆ పిల్లవాన్ని అందులో పడుకోబెట్టి దానిని నైలు నది ఒడ్డున ఉన్న జమ్ములో ఉంచింది.