కంటెంట్‌కు వెళ్లండి

circa 1446 BC

Moses & The Exodus

God raises up Moses to confront Pharaoh; the ten plagues culminate in Israel's dramatic deliverance from four centuries of bondage.

415 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. నిర్గమకాండము 2:4సుమారు క్రీ.పూ. 1571

    అతనికి ఏమి జరుగుతుందో చూడడానికి ఆ పిల్లవాని అక్క దూరంలో నిలబడి ఉంది.

  2. నిర్గమకాండము 2:5సుమారు క్రీ.పూ. 1571

    ఫరో కుమార్తె స్నానం చేయడానికి నైలు నదికి రాగా ఆమె పనికత్తెలు నది ఒడ్డున నడుస్తున్నారు. ఆమె జమ్ము మధ్యలో ఉన్న పెట్టెను చూసి దానిని తీసుకురావడానికి తన దాసిని పంపించింది.

  3. నిర్గమకాండము 2:6సుమారు క్రీ.పూ. 1571

    దానిని తెరిచి ఆ పిల్లవాన్ని చూసింది. ఆ పిల్లవాడు ఏడ్వడం చూసిన ఆమె అతనిపై కనికరపడి, “వీడు హెబ్రీయుల పిల్లల్లో ఒకడు” అన్నది.

  4. నిర్గమకాండము 2:7సుమారు క్రీ.పూ. 1571

    అప్పుడు ఆ పిల్లవాని అక్క ఫరో కుమార్తెతో, “ఈ పిల్లవాన్ని నీకోసం పెంచడానికి నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒకరిని పిలుచుకొని రమ్మంటారా?” అని అడిగింది.

  5. నిర్గమకాండము 2:8సుమారు క్రీ.పూ. 1571

    అందుకు ఆమె, “సరే, వెళ్లు” అన్నది. కాబట్టి ఆ అమ్మాయి వెళ్లి ఆ బిడ్డ తల్లిని తీసుకువచ్చింది.

  6. నిర్గమకాండము 2:9సుమారు క్రీ.పూ. 1571

    ఫరో కుమార్తె ఆమెతో, “నీవు ఈ బిడ్డను తీసుకెళ్లి నా కోసం పాలిచ్చి పెంచు, నేను నీకు జీతమిస్తాను” అని చెప్పింది. ఆమె ఆ బిడ్డను తీసుకెళ్లి పెంచింది.

  7. నిర్గమకాండము 2:10సుమారు క్రీ.పూ. 1571

    పిల్లవాడు పెద్దయ్యాక, ఆమె అతన్ని ఫరో కుమార్తె దగ్గరకు తీసుకెళ్లింది, అతడు ఆమె కుమారుడయ్యాడు. “నేను అతన్ని నీటి నుండి బయటకు తీశాను” అని ఆమె అతనికి మోషే అని పేరు పెట్టింది.

  8. నిర్గమకాండము 2:11సుమారు క్రీ.పూ. 1531

    కొన్ని సంవత్సరాల తర్వాత, మోషే పెద్దవాడైన తర్వాత ఒక రోజు అతడు తన సొంత ప్రజలు ఉన్న చోటికి వెళ్లి వారి దుస్థితిని చూశాడు. అప్పుడు అతడు తన సొంత ప్రజల్లో ఒకడైన ఒక హెబ్రీయున్ని ఒక ఈజిప్టువాడు కొట్టడం చూశాడు.

  9. నిర్గమకాండము 2:12సుమారు క్రీ.పూ. 1531

    మోషే అటు ఇటు తిరిగి ఎవరూ లేకపోవడం చూసి ఆ ఈజిప్టువాన్ని చంపి ఇసుకలో దాచిపెట్టాడు.

  10. నిర్గమకాండము 2:13సుమారు క్రీ.పూ. 1531

    మరునాడు అతడు బయటకు వెళ్లినప్పుడు ఇద్దరు హెబ్రీయులు పోట్లాడుకోవడం చూశాడు. అతడు వారిలో తప్పు చేసినవానితో, “నీ తోటి హెబ్రీయున్ని ఎందుకు కొడుతున్నావు?” అని అడిగాడు.

  11. నిర్గమకాండము 2:14సుమారు క్రీ.పూ. 1531

    అందుకు అతడు, “మామీద అధికారిగా న్యాయాధిపతిగా నిన్ను ఎవరు నియమించారు? ఆ ఈజిప్టువాన్ని చంపినట్లు నన్ను కూడా చంపాలని అనుకుంటున్నావా?” అన్నాడు. అప్పుడు మోషే, “నేను చేసిన పని అందరికి తెలిసిపోయింది” అని అనుకుని భయపడ్డాడు.

  12. నిర్గమకాండము 2:15సుమారు క్రీ.పూ. 1531

    ఫరో ఈ సంగతి విన్నప్పుడు, అతడు మోషేను చంపడానికి ప్రయత్నించాడు, కాని మోషే ఫరో దగ్గరనుండి పారిపోయి మిద్యానులో జీవించడానికి వెళ్లాడు, అక్కడ ఒక బావి దగ్గర కూర్చున్నాడు.

  13. నిర్గమకాండము 2:16సుమారు క్రీ.పూ. 1531

    మిద్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలు ఉన్నారు, వారు వచ్చి తమ తండ్రి మందకు నీళ్లు పెట్టడానికి నీళ్లు తోడి తొట్టెలు నింపడం మొదలుపెట్టారు.

  14. నిర్గమకాండము 2:17సుమారు క్రీ.పూ. 1531

    కొంతమంది గొర్రెల కాపరులు వచ్చి వారిని తరిమివేశారు, అయితే మోషే లేచి వారిని రక్షించి వారి మందకు నీళ్లు పెట్టాడు.

  15. నిర్గమకాండము 2:18సుమారు క్రీ.పూ. 1531

    వారు తమ తండ్రియైన రెయూయేలు దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు అతడు, “ఈ రోజు మీరు ఇంత త్వరగా ఎందుకు వచ్చారు?” అని వారిని అడిగాడు.

  16. నిర్గమకాండము 2:19సుమారు క్రీ.పూ. 1531

    అందుకు వారు, “ఒక ఈజిప్టువాడు మమ్మల్ని గొర్రెల కాపరుల బారి నుండి కాపాడాడు. అంతేకాక మాకు, మందకు నీళ్లు తోడి పెట్టాడు” అని చెప్పారు.

  17. నిర్గమకాండము 2:20సుమారు క్రీ.పూ. 1531

    అందుకు రగూయేలు, “అయితే, అతడు ఎక్కడున్నాడు? అతన్ని ఎందుకు విడిచిపెట్టి వచ్చారు? అతన్ని భోజనానికి పిలుచుకొని రండి” అని తన కుమార్తెలతో అన్నాడు.

  18. నిర్గమకాండము 2:21సుమారు క్రీ.పూ. 1531

    మోషే ఆ వ్యక్తితో ఉండడానికి అంగీకరించాడు. అతడు తన కుమార్తెయైన సిప్పోరాను మోషేకిచ్చి పెళ్ళి చేశాడు.

  19. నిర్గమకాండము 2:22సుమారు క్రీ.పూ. 1531

    సిప్పోరా ఒక కుమారుని కన్నది, మోషే, “నేను పరాయి దేశంలో పరదేశినయ్యాను” అని అతనికి గెర్షోము అని పేరు పెట్టాడు.

  20. నిర్గమకాండము 2:23సుమారు క్రీ.పూ. 1500

    కొన్ని సంవత్సరాలు గడచిన తర్వాత, ఈజిప్టు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలీయులు తమ బానిసత్వంలో మూల్గుతూ మొరపెట్టారు, తమ బానిస చాకిరీని బట్టి వారు పెట్టిన మొర దేవుని దగ్గరకు చేరింది.

  21. నిర్గమకాండము 2:24సుమారు క్రీ.పూ. 1500

    దేవుడు వారి మూల్గును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన తన ఒడంబడికను జ్ఞాపకం చేసుకున్నారు.

  22. నిర్గమకాండము 2:25సుమారు క్రీ.పూ. 1500

    దేవుడు ఇశ్రాయేలీయులను చూసి వారి పట్ల దయ చూపించారు.

  23. నిర్గమకాండము 3:1సుమారు క్రీ.పూ. 1491

    ఈ సమయంలో, మోషే మిద్యానులో యాజకుడైన యెత్రో అనే తన మామ మందను మేపుతూ, మందను అరణ్యానికి చాలా దూరంగా నడిపించి దేవుని పర్వతమైన, హోరేబు దగ్గరకు వచ్చాడు.

  24. నిర్గమకాండము 3:2సుమారు క్రీ.పూ. 1491

    అక్కడ ఒక పొదలో మండుతున్న అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఆ పొద అగ్నితో మండుతూ ఉన్నప్పటికీ అది కాలిపోకపోవడం మోషే చూశాడు.

  25. నిర్గమకాండము 3:3సుమారు క్రీ.పూ. 1491

    అప్పుడు మోషే, “నేను అక్కడికి వెళ్లి ఆ పొద ఎందుకు కాలిపోవడం లేదనే ఆ గొప్ప అద్భుతాన్ని చూస్తాను” అని అనుకున్నాడు.