- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Moses & The Exodus
God raises up Moses to confront Pharaoh; the ten plagues culminate in Israel's dramatic deliverance from four centuries of bondage.
ఈ కాలపు వచనాలు
- నిర్గమకాండము 3:4సుమారు క్రీ.పూ. 1491
దానిని చూడడానికి అతడు అక్కడికి రావడం యెహోవా చూసినప్పుడు, ఆ పొద మధ్యలో నుండి దేవుడు, “మోషే! మోషే!” అని అతన్ని పిలిచారు. అందుకు మోషే, “నేను ఇక్కడ ఉన్నాను” అన్నాడు.
- నిర్గమకాండము 3:5సుమారు క్రీ.పూ. 1491
అందుకు దేవుడు, “దగ్గరకు రావద్దు, నీవు నిలబడిన స్థలం పరిశుద్ధస్థలం కాబట్టి నీ చెప్పులు విప్పు” అన్నారు.
- నిర్గమకాండము 3:6సుమారు క్రీ.పూ. 1491
ఇంకా ఆయన, “నేను నీ తండ్రి దేవుడను, అనగా అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను” అన్నారు. అప్పుడు మోషే దేవుని వైపు చూడడానికి భయపడి, తన ముఖాన్ని దాచుకున్నాడు.
- నిర్గమకాండము 3:7సుమారు క్రీ.పూ. 1491
అప్పుడు యెహోవా, “నేను ఈజిప్టులో ఉన్న నా ప్రజల బాధను చూశాను. వారిచేత వెట్టిచాకిరి చేయిస్తున్న అధికారులను గురించి వారు నాకు చేసిన మొరను నేను విన్నాను, వారి శ్రమల గురించి నాకు తెలుసు.
- నిర్గమకాండము 3:8సుమారు క్రీ.పూ. 1491
కాబట్టి ఈజిప్టువారి చేతిలో నుండి వారిని విడిపించడానికి ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంలోనికి, అనగా కనానీయుల, హిత్తీయుల, అమోరీయుల, పెరిజ్జీయుల, హివ్వీయుల, యెబూసీయుల దేశమైన పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని తీసుకెళ్లడానికి నేను దిగి వచ్చాను.
- నిర్గమకాండము 3:9సుమారు క్రీ.పూ. 1491
ఇశ్రాయేలీయుల మొర నాకు చేరింది, ఈజిప్టువారు వారినెలా అణచివేస్తున్నారో నేను చూశాను.
- నిర్గమకాండము 3:10సుమారు క్రీ.పూ. 1491
కాబట్టి ఇప్పుడు, వెళ్లు. నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఈజిప్టు బయటకు తీసుకురావడానికి నేను నిన్ను ఫరో దగ్గరకు పంపుతున్నాను” అని అన్నారు.
- నిర్గమకాండము 3:11సుమారు క్రీ.పూ. 1491
అయితే మోషే, “ఫరో దగ్గరకు వెళ్లడానికి ఇశ్రాయేలీయులను ఈజిప్టులో నుండి బయటకు తీసుకురావడానికి నేను ఎంతటివాన్ని?” అని దేవునితో అన్నాడు.
- నిర్గమకాండము 3:12సుమారు క్రీ.పూ. 1491
అప్పుడు దేవుడు, “ఖచ్చితంగా నేను నీకు తోడై ఉంటాను. నేను నిన్ను పంపాను అనడానికి ఇది ఒక అసాధారణ గుర్తుగా ఉంటుంది: మీరు ఈజిప్టు నుండి ప్రజలను బయటకు తీసుకువచ్చినప్పుడు, మీరూ ఈ పర్వతం మీద దేవుని ఆరాధిస్తారు” అని చెప్పారు.
- నిర్గమకాండము 3:13సుమారు క్రీ.పూ. 1491
అప్పుడు మోషే, “నేను ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్లి వారితో, ‘మీ పితరుల దేవుడు నన్ను మీ దగ్గరకు పంపారు’ అని చెప్పినప్పుడు వారు, ‘ఆయన పేరు ఏమిటి?’ అని నన్ను అడుగుతారు, అప్పుడు నేను వారికి ఏమి చెప్పాలి?” అని దేవుని అడిగాడు.
- నిర్గమకాండము 3:14సుమారు క్రీ.పూ. 1491
అందుకు దేవుడు మోషేతో, “నేను నేనైయున్నాను. నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పాలి: ‘నేనైయున్నాను అనేవాడు నన్ను మీ దగ్గరకు పంపాడు.’ ”
- నిర్గమకాండము 3:15సుమారు క్రీ.పూ. 1491
దేవుడు మోషేతో, “నీవు ఇశ్రాయేలీయులతో, ‘మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నన్ను మీ దగ్గరకు పంపారు’ అని చెప్పాలి. “ఇదే నా నిత్యమైన పేరు, తరతరాల వరకు మీరు జ్ఞాపకముంచుకోవలసిన పేరు ఇదే.
- నిర్గమకాండము 3:16సుమారు క్రీ.పూ. 1491
“వెళ్లు, ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి వారితో, ‘మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇలా అన్నారు: నేను మిమ్మల్ని చూశాను; ఈజిప్టులో మీకు జరిగిన దానిని చూశాను.
- నిర్గమకాండము 3:17సుమారు క్రీ.పూ. 1491
ఈజిప్టు కష్టాల నుండి విడిపించి, కనానీయుల, హిత్తీయుల, అమోరీయుల, పెరిజ్జీయుల, హివ్వీయుల, యెబూసీయుల దేశం అనగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తానని ప్రమాణం చేశాను’ అని వారితో చెప్పు.
- నిర్గమకాండము 3:18సుమారు క్రీ.పూ. 1491
“ఇశ్రాయేలీయుల పెద్దలు నీ మాట వింటారు. అప్పుడు నీవు వారితో కలిసి ఈజిప్టు రాజు దగ్గరకు వెళ్లి అతనితో, ‘హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమయ్యారు. మేము అరణ్యంలో మూడు రోజుల ప్రయాణమంత దూరం వెళ్లి అక్కడ మా దేవుడైన యెహోవాకు బలులు అర్పించేలా మమ్మల్ని వెళ్లనివ్వండి’ అని చెప్పాలి.
- నిర్గమకాండము 3:19సుమారు క్రీ.పూ. 1491
అయితే ఈజిప్టు రాజు ఒక బలమైన హస్తం అతన్ని ఒత్తిడి చేస్తేనే తప్ప మిమ్మల్ని పోనివ్వడని నాకు తెలుసు.
- నిర్గమకాండము 3:20సుమారు క్రీ.పూ. 1491
కాబట్టి నేను నా చేతిని చాచి ఈజిప్టువారి మధ్య నేను చేయదలచిన అద్భుత కార్యాలను చేసి వారిని మొత్తుతాను. దాని తర్వాత అతడు మిమ్మల్ని వెళ్లనిస్తాడు.
- నిర్గమకాండము 3:21సుమారు క్రీ.పూ. 1491
“ఈ ప్రజల పట్ల ఈజిప్టువారిలో దయను పుట్టిస్తాను కాబట్టి మీరు వెళ్లినప్పుడు వట్టి చేతులతో వెళ్లరు.
- నిర్గమకాండము 3:22సుమారు క్రీ.పూ. 1491
ప్రతి స్త్రీ తన పొరుగువారిని వారి ఇంట్లో ఉండే స్త్రీని వెండి బంగారు ఆభరణాలను, బట్టలను అడిగి తీసుకుని వాటిని మీ కుమారులకు కుమార్తెలకు ధరింపచేయాలి. ఈ విధంగా మీరు ఈజిప్టువారిని కొల్లగొడతారు.”
- నిర్గమకాండము 4:1సుమారు క్రీ.పూ. 1491
అందుకు మోషే, “ఒకవేళ వారు నన్ను నమ్మకుండ లేదా నేను చెప్పేది వినకుండ, ‘యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు’ అని అంటే ఎలా?” అన్నాడు.
- నిర్గమకాండము 4:2సుమారు క్రీ.పూ. 1491
అప్పుడు యెహోవా అతనితో, “నీ చేతిలో ఉన్నది ఏమిటి?” అని అన్నారు. “ఒక కర్ర” అని అతడు జవాబిచ్చాడు.
- నిర్గమకాండము 4:3సుమారు క్రీ.పూ. 1491
అందుకు యెహోవా, “దానిని నేలపై పడవేయి” అన్నారు. మోషే దానిని నేల మీద పడవేయగానే అది పాముగా మారింది, అతడు దాని నుండి పారిపోయాడు.
- నిర్గమకాండము 4:4సుమారు క్రీ.పూ. 1491
అప్పుడు యెహోవా, “నీ చేయి చాచి దాని తోక పట్టుకుని పైకెత్తు” అని అతనితో అన్నారు. మోషే తన చేతిని చాచి ఆ పాము తోక పట్టుకుని పైకెత్తగానే అది తిరిగి అతని చేతిలో కర్రగా మారింది.
- నిర్గమకాండము 4:5సుమారు క్రీ.పూ. 1491
అప్పుడు యెహోవా, “దీనిని బట్టి వారు, తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమయ్యారని నమ్ముతారు” అని అన్నారు.
- నిర్గమకాండము 4:6సుమారు క్రీ.పూ. 1491
యెహోవా, “నీ చేతిని నీ ఛాతీ మీద పెట్టు” అన్నారు. మోషే తన చేతిని తన ఛాతీ మీద పెట్టాడు, అతడు దానిని బయటకు తీయగా, అది కుష్ఠురోగంతో మంచులా తెల్లగా మారిపోయింది.