Red Sea
ఇలా కూడా పిలుస్తారు: Red, sea
27.0800, 34.7700 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి
Red Sea ను ప్రస్తావించే వచనాలు
అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి బలమైన పడమటి గాలి వీచేలా చేసినప్పుడు ఆ గాలికి మిడతలు ఎర్ర సముద్రంలోకి కొట్టుకుపోయాయి. ఈజిప్టులో ఎక్కడ కూడా ఒక్క మిడత కూడా మిగల్లేదు.
కాబట్టి దేవుడు వారిని చుట్టూ త్రిప్పి అరణ్యమార్గంలో ఎర్ర సముద్రం వైపు నడిపించారు. ఇశ్రాయేలీయులు యుద్ధానికి సిద్ధపడి ఈజిప్టు నుండి బయటకు వచ్చారు.
ఆయన ఫరో రథాలను అతని సైన్యాన్ని సముద్రంలో ముంచివేసారు. అతని అధిపతులలో ప్రముఖులు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు.
తర్వాత మోషే ఎర్ర సముద్రం నుండి ఇశ్రాయేలీయులను నడిపించగా వారు షూరు ఎడారిలోనికి వెళ్లి మూడు రోజులు దానిలో ప్రయాణం చేశారు. అక్కడ వారికి నీరు దొరకలేదు.
“ఎర్ర సముద్రం నుండి మధ్యధరా సముద్రం వరకు, అరణ్యం నుండి యూఫ్రటీసు నది వరకు నేను మీకు సరిహద్దులును ఏర్పరుస్తాను. ఆ దేశంలో నివసించే ప్రజలను మీ చేతికి అప్పగిస్తాను, మీరు వారిని మీ ఎదుట నుండి వెళ్లగొడతారు.
అమాలేకీయులు, కనానీయులు ఆ లోయల్లో నివసిస్తున్నారు కాబట్టి, రేపు వెనుకకు తిరగండి, ఎడారి వైపు ఎర్ర సముద్రం మార్గం గుండా రండి” అని చెప్పారు.
ఎదోము చుట్టూ తిరిగి రావాలని వారు హోరు పర్వతం నుండి ఎర్ర సముద్రం మార్గాన ప్రయాణం చేశారు. అయితే ప్రజలు ఈ ప్రయాణంలో ఓపిక కోల్పోయారు;
ఎలీము నుండి బయలుదేరి ఎర్ర సముద్రం దగ్గర దిగారు.
ఎర్ర సముద్రం నుండి బయలుదేరి సీను ఎడారికి వచ్చారు.
మీరైతే వెనుకకు తిరిగి ఎర్ర సముద్ర మార్గంలో అరణ్యంలోనికి ప్రయాణించండి” అని అన్నారు.
యెహోవా నాతో చెప్పిన ప్రకారం మనం వెనుకకు తిరిగి ఎర్ర సముద్ర మార్గంలో అరణ్యంలోనికి ప్రయాణమై వెళ్లి చాలా రోజులు శేయీరు కొండ ప్రాంతం చుట్టూ తిరిగాము.
ఈజిప్టు సైన్యానికి, దాని గుర్రాలకు రథాలకు ఆయన చేసింది, వారు మిమ్మల్ని తరుముతున్నప్పుడు ఆయన ఎర్ర సముద్రపు నీటితో వారిని కప్పివేయడం, యెహోవా వారిపై నిత్య నాశనం ఎలా తెచ్చారో మీరు చూశారు.
మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పుడు యెహోవా మీ కోసం ఎర్ర సముద్రపు నీటిని ఎలా ఆరిపోయేలా చేశారో, మీరు పూర్తిగా నాశనం చేసిన యొర్దానుకు తూర్పున ఉన్న ఇద్దరు అమోరీయుల రాజులైన సీహోను, ఓగుల గురించి విన్నాము.
ఎందుకంటే మీరు యొర్దానును దాటే వరకు మీ దేవుడైన యెహోవా మీ ఎదుట యొర్దానును ఆరిపోయేలా చేశారు. మేము ఎర్ర సముద్రాన్ని దాటే వరకు మా ఎదుట దాన్ని ఆరేలా చేసినట్టు మీ దేవుడైన యెహోవా ఇప్పుడు యొర్దానును చేశారు.
నేను మీ పూర్వికులను ఈజిప్టు నుండి రప్పించినప్పుడు మీరు సముద్రం దగ్గరకు వచ్చారు. ఈజిప్టువారు రథాలతో, గుర్రాలతో ఎర్ర సముద్రం వరకు వారిని వెంటాడారు.
ఇశ్రాయేలీయులు ఈజిప్టులో నుండి వచ్చినప్పుడు, వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యంలో నడిచి కాదేషుకు వచ్చారు.
రాజైన సొలొమోను ఎదోములోని ఎర్ర సముద్రతీరాన ఏలతు దగ్గర ఉన్న ఎసోన్-గెబెరు దగ్గర ఓడలను కూడా కట్టించాడు.
“మా పూర్వికులు ఈజిప్టులో శ్రమపడడం మీరు చూశారు; ఎర్ర సముద్రం దగ్గర వారి మొర విన్నారు.
మా పూర్వికులు ఈజిప్టులో ఉన్నప్పుడు నేను చేసిన అద్భుతాలను గ్రహించలేదు; మీ దయాసమృద్ధిని వారు తలపోయ లేదు, ఎర్ర సముద్రం దగ్గర తిరుగుబాటు చేశారు.
ఎర్ర సముద్రాన్ని గద్దించాడు. అది ఎండిపోయింది; ఎడారిలో నడిచినట్లే జలాగాధంలో వారు నడిచారు. దేవుడు వారిని నడిపించాడు.
హాము దేశంలో అద్భుతకార్యాలు ఎర్ర సముద్రం ఒడ్డున ఆయన చేసిన భీకర క్రియలు.
ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చిన దేవునికి స్తుతులు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
ఫరోను, అతని సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేసింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
వారు పతనమైనప్పుడు భూమి కంపిస్తుంది; వారి మొర ఎర్ర సముద్రం వరకు వినిపిస్తుంది.
అతడు ఈజిప్టులో, ఎర్ర సముద్రం దగ్గర నలభై సంవత్సరాలు అరణ్యంలో అద్భుతాలను సూచకక్రియలను చేసి వారిని ఈజిప్టు నుండి బయటకు నడిపించాడు.