Og
Og ను ప్రస్తావించే వచనాలు
తర్వాత వారు తిరిగి బాషానుకు వెళ్లే మార్గంలో వెళ్లాము, అప్పుడు బాషాను రాజైన ఓగు తన సైన్యమంతటితో ఎద్రెయీ దగ్గర యుద్ధంలో వారిని ఎదుర్కోడానికి బయలుదేరాడు.
అప్పుడు మోషే గాదీయులకు, రూబేనీయులకు, యోసేపు కుమారుడైన మనష్షే అర్థగోత్రానికి అమోరీయుల రాజైన సీహోను రాజ్యాన్ని, బాషాను రాజైన ఓగు రాజ్యాన్ని దాని పట్టణాలు, వాటి సరిహద్దులతో సహా ఆ స్థలాన్నంతటిని ఇచ్చాడు.
ఇది తాను హెష్బోనులో పరిపాలించిన అమోరీయుల రాజైన సీహోనును ఓడించిన తర్వాత, ఎద్రెయీ దగ్గర అష్తారోతులో పరిపాలించిన బాషాను రాజైన ఓగును ఓడించిన తర్వాత వారికి ప్రకటించాడు.
తర్వాత మనం తిరిగి బాషానుకు వెళ్లే మార్గంలో వెళ్లాము. అప్పుడు బాషాను రాజైన ఓగు తన సైన్యమంతటితో ఎద్రెయీ దగ్గర యుద్ధంలో మనలను ఎదుర్కోడానికి బయలుదేరాడు.
కాబట్టి మన దేవుడైన యెహోవా బాషాను రాజైన ఓగును, అతని సైన్యమంతటిని మన చేతికి అప్పగించారు. వారిలో ఎవరిని మిగల్చకుండా అందరిని హతం చేశాము.
ఆ సమయంలో అతని పట్టణాలన్నిటిని మనం స్వాధీనం చేసుకున్నాము. బాషానులో ఓగు రాజ్యమైన అర్గోబు ప్రాంతమంతటిలో ఉన్న అరవై పట్టణాల్లో స్వాధీనం చేసుకోనిది ఒక్కటి కూడా లేదు.
పీఠభూమిలో ఉన్న పట్టణాలన్నిటిని, బాషానులో ఓగు రాజ్యంలోని పట్టణాలైన సలేకా ఎద్రెయీల వరకు గిలాదు అంతటిని, బాషానును అంతటిని స్వాధీనం చేసుకున్నాము.
రెఫాయీయులలో బాషాను రాజైన ఓగు చివరివాడు. అతని సమాధి ఇనుముతో చేయబడి తొమ్మిది మూరల పొడవు నాలుగు మూరల వెడల్పు కలది. అది ఇంకా అమ్మోనీయులకు చెందిన రబ్బాలో ఉంది.
గిలాదులో మిగతా ప్రాంతాన్ని, ఓగు రాజ్యమైన బాషాను అంతటిని మనష్షే అర్ధగోత్రానికి ఇచ్చాను. బాషానులోని అర్గోబు ప్రాంతమంతా రెఫాయీయుల దేశమని పిలువబడేది.
యొర్దానుకు తూర్పున ఉన్న అతని దేశాన్ని, బాషాను రాజైన ఓగు దేశాన్ని, ఈ ఇద్దరు అమోరీయుల రాజుల దేశాలను వారు స్వాధీనం చేసుకున్నారు.
మీరిక్కడికి వచ్చినప్పుడు హెష్బోను రాజు సీహోను, బాషాను రాజు ఓగు మనతో పోరాడడానికి వచ్చారు, కాని మనం వారిని ఓడించాము.
అమోరీయుల రాజులైన సీహోను, ఓగులను వారి దేశంతో పాటు నాశనం చేసినట్టుగా, యెహోవా వారికి చేస్తారు.
మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పుడు యెహోవా మీ కోసం ఎర్ర సముద్రపు నీటిని ఎలా ఆరిపోయేలా చేశారో, మీరు పూర్తిగా నాశనం చేసిన యొర్దానుకు తూర్పున ఉన్న ఇద్దరు అమోరీయుల రాజులైన సీహోను, ఓగుల గురించి విన్నాము.
యొర్దాను తూర్పున ఉన్న అమోరీయుల ఇద్దరు రాజులకు అనగా హెష్బోను రాజైన సీహోను, అష్తారోతులో పాలించిన బాషాను రాజైన ఓగులకు చేసిన దాన్ని గురించి విన్నాము.
అష్తారోతు, ఎద్రెయీలలో పాలించిన రెఫాయీయులలో చివరివాడైన బాషాను రాజైన ఓగు యొక్క భూభాగము.
అంటే, అష్తారోతు ఎద్రెయీలో పాలించిన బాషానులోని ఓగు రాజ్యం మొత్తము. (అతడు రెఫాయీయులలో చివరివాడు.) మోషే వారిని ఓడించి వారి భూమిని స్వాధీనం చేసుకున్నాడు.
వారి సరిహద్దు మహనయీము నుండి బాషాను రాజైన ఓగు రాజ్యం మొత్తం, అంటే బాషానులోని యాయీరు స్థిరనివాసాలైన అరవై పట్టణాలు,
గిలాదులో సగం, అష్తారోతు, ఎద్రెయీ (బాషానులోని ఓగు యొక్క రాజ పట్టణాలు).
గిలాదుకు ఊరి కుమారుడైన గెబెరు అధికారి (అమోరీయుల రాజైన సీహోను దేశం, బాషాను రాజైన ఓగు యొక్క దేశం). ఈ జిల్లా మీద ఇతడు ఒక్కడే అధికారి.
“మీరు వారికి రాజ్యాలను దేశాలను ఇచ్చారు. మారుమూల సరిహద్దులను కూడా వారికి కేటాయించారు. వారు హెష్బోను రాజు సీహోను దేశాన్ని బాషాను రాజు ఓగు దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అమోరీయుల రాజైన సీహోను, బాషాను రాజైన ఓగు, కనాను రాజులందరూ,
బాషాను రాజైన ఓగును చంపింది ఆయనే ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.