- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
ఈ కాలపు వచనాలు
- ద్వితీయోపదేశకాండము 1:1సుమారు క్రీ.పూ. 1451
యొర్దానుకు తూర్పున ఉన్న అరణ్యంలో అనగా పారానుకు తోపెలు, లాబాను, హజేరోతు, దీజాహబ్ అనే స్థలాలకు మధ్య సూఫుకు ఎదురుగా ఉన్న అరాబాలో మోషే ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవి.
- ద్వితీయోపదేశకాండము 1:2సుమారు క్రీ.పూ. 1451
(సాధారణంగా శేయీరు పర్వత దారి గుండా హోరేబు నుండి కాదేషు బర్నియాకు ప్రయాణించడానికి పదకొండు రోజులు పడుతుంది.)
- ద్వితీయోపదేశకాండము 1:3సుమారు క్రీ.పూ. 1451
నలభైయవ సంవత్సరం, పదకొండవ నెల మొదటి రోజున మోషే ఇశ్రాయేలీయులను ఉద్దేశించి యెహోవా ఆజ్ఞాపించినదంతా వారికి ప్రకటించాడు.
- ద్వితీయోపదేశకాండము 1:4సుమారు క్రీ.పూ. 1451
ఇది తాను హెష్బోనులో పరిపాలించిన అమోరీయుల రాజైన సీహోనును ఓడించిన తర్వాత, ఎద్రెయీ దగ్గర అష్తారోతులో పరిపాలించిన బాషాను రాజైన ఓగును ఓడించిన తర్వాత వారికి ప్రకటించాడు.
- ద్వితీయోపదేశకాండము 1:5సుమారు క్రీ.పూ. 1451
యొర్దాను తూర్పున మోయాబు దేశంలో మోషే ఈ ధర్మశాస్త్రాన్ని వివరించడం మొదలుపెట్టి ఇలా అన్నాడు:
- ద్వితీయోపదేశకాండము 1:6సుమారు క్రీ.పూ. 1451
దేవుడైన యెహోవా హోరేబు దగ్గర మనతో ఇలా మాట్లాడారు, “మీరు ఈ పర్వతం దగ్గర చాలా కాలం నుండి ఉన్నారు.
- ద్వితీయోపదేశకాండము 1:7సుమారు క్రీ.పూ. 1451
మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల కొండ ప్రాంతం వైపు వెళ్లండి; అరాబాలో, పర్వతాల్లో, పశ్చిమ కొండ ప్రాంతంలో, దక్షిణం వైపున సముద్రతీరంలో ఉన్న అన్ని స్థలాలకు, కనాను దేశానికి, లెబానోనుకు మహానదియైన యూఫ్రటీసు వరకు ఉన్న పొరుగు దేశాలకు వెళ్లండి.
- ద్వితీయోపదేశకాండము 1:8సుమారు క్రీ.పూ. 1451
చూడండి, ఈ దేశాన్ని నేను మీకిచ్చాను. కాబట్టి మీరు వెళ్లి యెహోవా మీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు, వారి తర్వాత వారి సంతానానికి ఇస్తానని ప్రమాణం చేసిన దేశాన్ని స్వాధీనం చేసుకోండి.”
- ద్వితీయోపదేశకాండము 1:9సుమారు క్రీ.పూ. 1451
ఆ సమయంలో నేను మీతో, “నేను ఒంటరిగా మోయలేనంత భారంగా మీరున్నారు.
- ద్వితీయోపదేశకాండము 1:10సుమారు క్రీ.పూ. 1451
మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విస్తరింపజేశారు కాబట్టి ఇప్పుడు మీరు ఆకాశ నక్షత్రాల్లా లెక్కించలేనంతగా ఉన్నారు.
- ద్వితీయోపదేశకాండము 1:11సుమారు క్రీ.పూ. 1451
మీ పూర్వికుల దేవుడైన యెహోవా మిమ్మల్ని వెయ్యిరెట్లు ఎక్కువ చేసి ఆయన వాగ్దానం చేసినట్లుగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక!
- ద్వితీయోపదేశకాండము 1:12సుమారు క్రీ.పూ. 1451
అయితే నేనొక్కడినే మీ సమస్యలను మీ భారాలను మీ వివాదాలను ఎలా తీర్చగలను?
- ద్వితీయోపదేశకాండము 1:13సుమారు క్రీ.పూ. 1451
ప్రతి గోత్రంలో నుండి జ్ఞాన వివేకాలు కలిగిన పురుషులను ఎంపిక చేయండి, నేను వారిని మీకు నాయకులుగా నియమిస్తాను” అని చెప్పాను.
- ద్వితీయోపదేశకాండము 1:14సుమారు క్రీ.పూ. 1451
అందుకు మీరు, “నీవు చెప్పింది బాగుంది” అని జవాబిచ్చారు.
- ద్వితీయోపదేశకాండము 1:15సుమారు క్రీ.పూ. 1451
కాబట్టి మీ గోత్రాల్లో నుండి జ్ఞానం కలిగి ప్రసిద్ధులైన వారిని పిలిపించి, వారిని మీ గోత్రాలకు అధికారులుగా, వేయిమందికి, వందమందికి, యాభైమందికి, పదిమందికి ఒక అధికారి ప్రకారం అధికారులుగా నియమించాను.
- ద్వితీయోపదేశకాండము 1:16సుమారు క్రీ.పూ. 1451
అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో, “మీ ప్రజలమధ్య ఉన్న వివాదాలు విని, ఇద్దరు ఇశ్రాయేలీయుల మధ్య అయినా లేదా ఒక ఇశ్రాయేలీయునికి ఒక విదేశీయునికి మధ్య అయినాసరే, న్యాయంగానే తీర్పు తీర్చాలి.
- ద్వితీయోపదేశకాండము 1:17సుమారు క్రీ.పూ. 1451
తీర్పు తీర్చడంలో పక్షపాతం చూపించవద్దు; పేదవారైనా గొప్పవారైనా సరే ఒకే రీతిగా వినాలి, తీర్పు దేవునికి సంబంధించింది కాబట్టి ఎవరికి భయపడవద్దు. మీకు పరిష్కరించడానికి కష్టంగా ఉన్న సమస్యను నా దగ్గరకు తీసుకురండి, నేను దానిని వింటాను” అని చెప్పాను.
- ద్వితీయోపదేశకాండము 1:18సుమారు క్రీ.పూ. 1451
మీరు చేయవలసిందంతా ఆ సమయంలో నేను మీకు చెప్పాను.
- ద్వితీయోపదేశకాండము 1:19సుమారు క్రీ.పూ. 1451
తర్వాత మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించిన ప్రకారం, హోరేబు నుండి బయలుదేరి మీరు చూసిన భయంకరమైన మహారణ్యం గుండా వచ్చి, అమోరీయుల కొండ ప్రాంతం ద్వారా ప్రయాణించి కాదేషు బర్నియాకు చేరుకున్నాము.
- ద్వితీయోపదేశకాండము 1:20సుమారు క్రీ.పూ. 1451
అప్పుడు నేను మీతో, “మన దేవుడైన యెహోవా మనకు ఇస్తున్న అమోరీయుల కొండ ప్రాంతానికి మీరు చేరుకున్నారు.
- ద్వితీయోపదేశకాండము 1:21సుమారు క్రీ.పూ. 1451
చూడండి, మీ దేవుడైన యెహోవా మీకు ఈ దేశాన్ని ఇచ్చారు. మీ పూర్వికుల దేవుడైన యెహోవా మీతో చెప్పినట్లుగా, వెళ్లి దానిని స్వాధీనపరచుకోండి. భయపడకండి; అధైర్యపడకండి” అని చెప్పాను.
- ద్వితీయోపదేశకాండము 1:22సుమారు క్రీ.పూ. 1451
అప్పుడు మీరందరు నా దగ్గరకు వచ్చి, “ఆ దేశంలో గూఢచర్యం చేసి మనం వెళ్లవలసిన దారి, మనం వెళ్లే పట్టణాల గురించి సమాచారం తెలుసుకోవడానికి ముందుగానే కొంతమందిని పంపుదాం” అన్నారు.
- ద్వితీయోపదేశకాండము 1:23సుమారు క్రీ.పూ. 1451
ఈ ఆలోచన నాకు నచ్చింది కాబట్టి మీలో ప్రతి గోత్రం నుండి ఒకరు చొప్పున పన్నెండుమందిని పంపాను.
- ద్వితీయోపదేశకాండము 1:24సుమారు క్రీ.పూ. 1451
వారు అక్కడినుండి కొండ ప్రాంతానికి ఎక్కి వెళ్లి ఎష్కోలు లోయకు వచ్చి దాన్ని పరిశీలించారు.
- ద్వితీయోపదేశకాండము 1:25సుమారు క్రీ.పూ. 1451
వారు ఆ దేశపు పండ్లు కొన్ని మన దగ్గరకు తెచ్చి, “మన దేవుడైన యెహోవా మనకిస్తున్న దేశం మంచిది” అని చెప్పారు.