- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
ఈ కాలపు వచనాలు
అవి కేవలం మామూలు మాటలు కావు, అవి మీకు జీవము. మీరు యొర్దాను దాటి వెళ్లి స్వాధీనపరుచుకోబోయే దేశంలో దీర్ఘకాలం జీవిస్తారు” అన్నాడు.
- ద్వితీయోపదేశకాండము 32:48సుమారు క్రీ.పూ. 1451
అదే రోజు యెహోవా మోషేతో మాట్లాడుతూ,
- ద్వితీయోపదేశకాండము 32:49సుమారు క్రీ.పూ. 1451
“యెరికోకు ఎదురుగా మోయాబులోని నెబో పర్వతానికి అబారీము పర్వతశ్రేణిలోకి వెళ్లి, నేను ఇశ్రాయేలీయులకు వారి సొంత స్వాస్థ్యంగా ఇస్తున్న కనాను దేశాన్ని చూడు.
- ద్వితీయోపదేశకాండము 32:50సుమారు క్రీ.పూ. 1451
నీ సహోదరుడు అహరోను హోరు కొండపై చనిపోయి తన ప్రజల దగ్గరకు చేరుకున్నట్టు, నీవు ఎక్కిన కొండమీద నీవు చనిపోయి నీ ప్రజల దగ్గరకు చేరుతావు.
- ద్వితీయోపదేశకాండము 32:51సుమారు క్రీ.పూ. 1451
అసలు ఇలా జరిగిందంటే, మీరు సీను ఎడారిలోని మెరీబా కాదేషు నీళ్ల దగ్గర ఇశ్రాయేలీయుల ముందు మీరిద్దరూ నా పట్ల నమ్మకద్రోహం చేశారు, ఇశ్రాయేలీయుల ఎదుట మీరు నా పరిశుద్ధతను గౌరవించకపోవడము.
- ద్వితీయోపదేశకాండము 32:52సుమారు క్రీ.పూ. 1451
కాబట్టి, నీవు దూరం నుండి మాత్రమే దేశాన్ని చూస్తావు; నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్న దేశంలో నీవు ప్రవేశించవు” అని అన్నారు.
- ద్వితీయోపదేశకాండము 33:1సుమారు క్రీ.పూ. 1451
దైవజనుడైన మోషే తాను చనిపోకముందు ఇశ్రాయేలు ప్రజలపై పలికిన ఆశీర్వాద వచనాలు.
- ద్వితీయోపదేశకాండము 33:2సుమారు క్రీ.పూ. 1451
అతడు ఇలా అన్నాడు: “యెహోవా సీనాయి పర్వతం నుండి వచ్చారు శేయీరు నుండి వారి మీద ఉదయించారు; పారాను పర్వతం నుండి ప్రకాశించారు. వేవేల పరిశుద్ధులతో ఆయన వచ్చారు, దక్షిణం నుండి, పర్వత వాలు నుండి వచ్చారు.
- ద్వితీయోపదేశకాండము 33:3సుమారు క్రీ.పూ. 1451
నిజంగా ఆయన తన జనులను ప్రేమిస్తున్నారు; పరిశుద్ధులందరు మీ చేతిలో ఉన్నారు. వారు మీ పాదాల దగ్గర వంగి, మీ నుండి ఉపదేశాన్ని పొందుకుంటారు,
- ద్వితీయోపదేశకాండము 33:4సుమారు క్రీ.పూ. 1451
మోషే మనకు ఇచ్చిన ధర్మశాస్త్రం యాకోబు సమాజానికి స్వాస్థ్యము.
- ద్వితీయోపదేశకాండము 33:5సుమారు క్రీ.పూ. 1451
ప్రజల నాయకులు, ఇశ్రాయేలు గోత్రాలతో పాటు సమావేశమైనప్పుడు ఆయన యెషూరూనుకు రాజుగా ఉన్నాడు.
- ద్వితీయోపదేశకాండము 33:6సుమారు క్రీ.పూ. 1451
“రూబేను చనిపోకుండ బ్రతికి ఉండును గాక, అతని ప్రజల సంఖ్య తగ్గకుండును గాక.”
- ద్వితీయోపదేశకాండము 33:7సుమారు క్రీ.పూ. 1451
యూదా గురించి అతడు ఇలా అన్నాడు: “యెహోవా, యూదా మొరను వినండి; అతని ప్రజల దగ్గరకు అతన్ని చేర్చండి. అతడు తన చేతులతో తన కోసం పోరాడేలా, అతని శత్రువులకు వ్యతిరేకంగా అతనికి సహాయంగా ఉండండి!”
- ద్వితీయోపదేశకాండము 33:8సుమారు క్రీ.పూ. 1451
లేవీ గురించి అతడు ఇలా అన్నాడు: “యెహోవా, మీ తుమ్మీము, ఊరీము మీ నమ్మకమైన సేవకునికి చెందినవి. మస్సాలో మీరతనిని పరీక్షించారు; మెరీబా నీళ్ల దగ్గర అతనితో మీరు వాదించారు.
- ద్వితీయోపదేశకాండము 33:9సుమారు క్రీ.పూ. 1451
అతడు తన తండ్రి తల్లి గురించి చెబుతూ, ‘నేను వారిని చూడలేదు’ అతడు తన సోదరులను గుర్తించలేదు తన సొంత పిల్లలను అంగీకరించలేదు. కాని అతడు నీ మాట గమనించాడు నీ నిబంధనను కాపాడాడు.
- ద్వితీయోపదేశకాండము 33:10సుమారు క్రీ.పూ. 1451
అతడు యాకోబుకు నీ కట్టడలను ఇశ్రాయేలీయులకు నీ ధర్మశాస్త్రాన్ని బోధిస్తాడు, అతడు మీ ఎదుట ధూపం వేస్తాడు, మీ బలిపీఠం మీద దహనబలులు అర్పిస్తాడు.
- ద్వితీయోపదేశకాండము 33:11సుమారు క్రీ.పూ. 1451
యెహోవా, అతని సేవను దీవించండి, అతని చేతి పనులను బట్టి సంతోషించండి. అతనికి వ్యతిరేకంగా లేచినవారిని కొట్టండి, అతని శత్రువులను తిరిగి లేవనంతగా కొట్టండి.”
- ద్వితీయోపదేశకాండము 33:12సుమారు క్రీ.పూ. 1451
బెన్యామీను గురించి అతడు ఇలా అన్నాడు: “యెహోవాకు ప్రియమైనవాడు ఆయనలో క్షేమంగా ఉండును గాక, ఎందుకంటే రోజంతా ఆయన రక్షణగా ఉంటారు, యెహోవా ప్రేమించేవాడు ఆయన భుజాల మధ్య ఉంటాడు.”
- ద్వితీయోపదేశకాండము 33:13సుమారు క్రీ.పూ. 1451
యోసేపు గురించి అతడు ఇలా అన్నాడు: “యెహోవా అతని భూమిని ఆకాశం నుండి కురిసే శ్రేష్ఠమైన మంచుతో క్రింద ఉన్న లోతైన జలాలతో దీవించును గాక;
- ద్వితీయోపదేశకాండము 33:14సుమారు క్రీ.పూ. 1451
సూర్యుని వలన కలిగే ఉత్తమమైన ఫలాలతో చంద్రుడు ఫలింపచేసే శ్రేష్ఠమైన ఫలాలతో;
- ద్వితీయోపదేశకాండము 33:15సుమారు క్రీ.పూ. 1451
పురాతన పర్వతాల శ్రేష్ఠమైన వాటితో శాశ్వత కొండల శ్రేష్ఠమైన పంటతో;
- ద్వితీయోపదేశకాండము 33:16సుమారు క్రీ.పూ. 1451
భూమి ఇచ్చే ప్రశస్తమైన పదార్థాలతో వాటి సమృద్ధితో మండుతున్న పొదలో నివసించే ఆయన దయతో దీవించును గాక. ఇవన్నీ యోసేపు తలపై ఉండును గాక, అతని సోదరుల మధ్యలో యువరాజు నుదుటి మీద ఉండును గాక.
- ద్వితీయోపదేశకాండము 33:17సుమారు క్రీ.పూ. 1451
ప్రభావంలో అతడు మొదట పుట్టిన కోడెలాంటి వాడు; అతని కొమ్ములు అడవి ఎద్దు కొమ్ములు. వాటితో అతడు జనులను, భూమి అంచులో ఉన్నవారిని కూడా కుమ్ముతాడు. ఎఫ్రాయిముకు చెందిన పదివేలమంది అలాంటివారు, మనష్షేకు చెందిన వేలమంది అలాంటివారు.”
- ద్వితీయోపదేశకాండము 33:18సుమారు క్రీ.పూ. 1451
జెబూలూను గురించి అతడు ఇలా అన్నాడు: “జెబూలూనూ, నీవు బయటకు వెళ్లునప్పుడు, సంతోషించు, ఇశ్శాఖారూ, నీవు నీ గుడారాల్లో సంతోషించు.
- ద్వితీయోపదేశకాండము 33:19సుమారు క్రీ.పూ. 1451
వారు జనులను పర్వతం దగ్గరకు పిలుస్తారు అక్కడ నీతి బలులు అర్పిస్తారు; వారు సముద్రాల సమృద్ధి మీద ఇసుకలో దాగి ఉన్న నిధుల మీద విందు చేస్తారు.”