- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
ఈ కాలపు వచనాలు
- సంఖ్యాకాండము 1:51సుమారు క్రీ.పూ. 1490
సమావేశ గుడారాన్ని తరలించాల్సి వచ్చినప్పుడెల్లా, లేవీయులే దానిని క్రిందికి దించాలి, అలాగే సమావేశ గుడారాన్ని వేయాల్సి వచ్చినప్పుడెల్లా, లేవీయులే దాన్ని వేయాలి. ఇతరులు దానిని సమీపిస్తే వారికి మరణశిక్ష విధించాలి.
- సంఖ్యాకాండము 1:52సుమారు క్రీ.పూ. 1490
ఇశ్రాయేలీయులు తమ తమ గోత్ర విభజన ప్రకారం సొంత జెండాలతో తమ డేరాలు వేసుకోవాలి.
- సంఖ్యాకాండము 1:53సుమారు క్రీ.పూ. 1490
అయితే నా కోపం ఇశ్రాయేలీయుల సమాజం మీదికి రాకుండా లేవీయులు సాక్షి గుడారం చుట్టూ డేరాలు వేసుకోవాలి. సాక్షి గుడారాన్ని కాపాడే బాధ్యత లేవీయులదే.”
- సంఖ్యాకాండము 1:54సుమారు క్రీ.పూ. 1490
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లే ఇశ్రాయేలీయులు చేశారు.
- సంఖ్యాకాండము 2:1సుమారు క్రీ.పూ. 1490
యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు:
- సంఖ్యాకాండము 2:2సుమారు క్రీ.పూ. 1490
“ఇశ్రాయేలీయులు సమావేశ గుడారం చుట్టూ దానికి కొంత దూరంలో, వారిలో ప్రతి ఒక్కరు తమ తమ స్థలంలో తమ గోత్రపు జెండాలను పట్టుకుని శిబిరాలను ఏర్పాటు చేసుకోవాలి.”
- సంఖ్యాకాండము 2:3సుమారు క్రీ.పూ. 1490
తూర్పున, సూర్యుడు ఉదయించే వైపు: యూదా శిబిరానికి చెందిన దళాలవారు తమ జెండాల దగ్గర దిగాలి. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా ప్రజల నాయకుడు.
- సంఖ్యాకాండము 2:4సుమారు క్రీ.పూ. 1490
అతని దళంలో ఉన్నవారు 74,600.
- సంఖ్యాకాండము 2:5సుమారు క్రీ.పూ. 1490
వారి ప్రక్కన ఇశ్శాఖారు గోత్రం వారు దిగాలి. సూయరు కుమారుడైన నెతనేలు ఇశ్శాఖారు ప్రజల నాయకుడు.
- సంఖ్యాకాండము 2:6సుమారు క్రీ.పూ. 1490
అతని దళంలో ఉన్నవారు 54,400.
- సంఖ్యాకాండము 2:7సుమారు క్రీ.పూ. 1490
వారి ప్రక్కన జెబూలూను గోత్రము. హేలోను కుమారుడైన ఏలీయాబు జెబూలూను ప్రజల నాయకుడు.
- సంఖ్యాకాండము 2:8సుమారు క్రీ.పూ. 1490
అతని విభజనలో ఉన్నవారు 57,400.
- సంఖ్యాకాండము 2:9సుమారు క్రీ.పూ. 1490
యూదా శిబిరానికి వారి వారి దళాల ప్రకారం కేటాయించబడిన పురుషులందరు, 1,86,400. వారు ముందుగా వెళ్తారు.
- సంఖ్యాకాండము 2:10సుమారు క్రీ.పూ. 1490
దక్షిణం వైపు: రూబేను గోత్రం వారు వారి జెండా క్రింద ఉండాలి. షెదేయూరు కుమారుడైన ఎలీసూరు రూబేను ప్రజల నాయకుడు.
- సంఖ్యాకాండము 2:11సుమారు క్రీ.పూ. 1490
అతని దళంలో ఉన్నవారు 46,500.
- సంఖ్యాకాండము 2:12సుమారు క్రీ.పూ. 1490
వారి ప్రక్కన షిమ్యోను గోత్రం వారు దిగాలి. సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు షిమ్యోను ప్రజల నాయకుడు.
- సంఖ్యాకాండము 2:13సుమారు క్రీ.పూ. 1490
అతని దళంలో ఉన్నవారు 59,300.
- సంఖ్యాకాండము 2:14సుమారు క్రీ.పూ. 1490
వారి ప్రక్కన గాదు గోత్రం వారు దిగాలి. రగూయేలు కుమారుడైన ఎలీయాసాపు గాదు ప్రజల నాయకుడు.
- సంఖ్యాకాండము 2:15సుమారు క్రీ.పూ. 1490
అతని దళంలో ఉన్నవారు 45,650.
- సంఖ్యాకాండము 2:16సుమారు క్రీ.పూ. 1490
రూబేను శిబిరానికి వారి వారి దళాల ప్రకారం కేటాయించబడిన వారందరు, 1,51,450. వీళ్ళు రెండవ గుంపుగా వెళ్తారు.
- సంఖ్యాకాండము 2:17సుమారు క్రీ.పూ. 1490
తర్వాత సమావేశ గుడారం, శిబిరాల మధ్యలో లేవీయుల శిబిరం ఉంటుంది. వారు ఉన్న ఈ క్రమంలోనే, ప్రతి ఒక్కరూ తమ జెండా క్రింద తమ స్థలంలో ఉంటారు.
- సంఖ్యాకాండము 2:18సుమారు క్రీ.పూ. 1490
పడమర వైపు: ఎఫ్రాయిం గోత్రం వారి జెండా ప్రకారం ఉండాలి. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిం ప్రజల నాయకుడు.
- సంఖ్యాకాండము 2:19సుమారు క్రీ.పూ. 1490
అతని దళంలో ఉన్నవారు 40,500.
- సంఖ్యాకాండము 2:20సుమారు క్రీ.పూ. 1490
మనష్షే గోత్రం వారు వారి ప్రక్కన దిగాలి. పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షే ప్రజల నాయకుడు
- సంఖ్యాకాండము 2:21సుమారు క్రీ.పూ. 1490
అతని దళంలో ఉన్నవారు 32,200.