- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
ఈ కాలపు వచనాలు
- సంఖ్యాకాండము 1:26సుమారు క్రీ.పూ. 1490
యూదా సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకు పైబడి ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
- సంఖ్యాకాండము 1:27సుమారు క్రీ.పూ. 1490
యూదా గోత్రం నుండి లెక్కించబడినవారు 74,600.
- సంఖ్యాకాండము 1:28సుమారు క్రీ.పూ. 1490
ఇశ్శాఖారు సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకు పైబడి ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
- సంఖ్యాకాండము 1:29సుమారు క్రీ.పూ. 1490
ఇశ్శాఖారు గోత్రం నుండి లెక్కించబడినవారు 54,400.
- సంఖ్యాకాండము 1:30సుమారు క్రీ.పూ. 1490
జెబూలూను సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకు పైబడి ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
- సంఖ్యాకాండము 1:31సుమారు క్రీ.పూ. 1490
జెబూలూను గోత్రం నుండి లెక్కించబడినవారు 57,400.
- సంఖ్యాకాండము 1:32సుమారు క్రీ.పూ. 1490
యోసేపు కుమారులు: ఎఫ్రాయిం సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
- సంఖ్యాకాండము 1:33సుమారు క్రీ.పూ. 1490
ఎఫ్రాయిం గోత్రం నుండి లెక్కించబడినవారు 40,500.
- సంఖ్యాకాండము 1:34సుమారు క్రీ.పూ. 1490
మనష్షే సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
- సంఖ్యాకాండము 1:35సుమారు క్రీ.పూ. 1490
మనష్షే గోత్రం నుండి లెక్కించబడినవారు 32,200.
- సంఖ్యాకాండము 1:36సుమారు క్రీ.పూ. 1490
బెన్యామీను సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
- సంఖ్యాకాండము 1:37సుమారు క్రీ.పూ. 1490
బెన్యామీను గోత్రం నుండి లెక్కించబడినవారు 35,400.
- సంఖ్యాకాండము 1:38సుమారు క్రీ.పూ. 1490
దాను సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
- సంఖ్యాకాండము 1:39సుమారు క్రీ.పూ. 1490
దాను గోత్రం నుండి లెక్కించబడినవారు 62,700.
- సంఖ్యాకాండము 1:40సుమారు క్రీ.పూ. 1490
ఆషేరు సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
- సంఖ్యాకాండము 1:41సుమారు క్రీ.పూ. 1490
ఆషేరు గోత్రం నుండి లెక్కించబడినవారు 41,500.
- సంఖ్యాకాండము 1:42సుమారు క్రీ.పూ. 1490
నఫ్తాలి సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
- సంఖ్యాకాండము 1:43సుమారు క్రీ.పూ. 1490
నఫ్తాలి గోత్రం నుండి లెక్కించబడినవారు 53,400.
- సంఖ్యాకాండము 1:44సుమారు క్రీ.పూ. 1490
వీరంతా ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల నాయకులతో కలిసి మోషే అహరోనులచేత లెక్కించబడినవారు.
- సంఖ్యాకాండము 1:45సుమారు క్రీ.పూ. 1490
ఇశ్రాయేలీయులందరిలో ఇరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సుండి ఇశ్రాయేలు సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
- సంఖ్యాకాండము 1:46సుమారు క్రీ.పూ. 1490
వీరి మొత్తం సంఖ్య 6,03,550.
- సంఖ్యాకాండము 1:47సుమారు క్రీ.పూ. 1490
అయితే లేవీయుల పూర్వికుల గోత్రం ప్రకారం వీరితో పాటు లెక్కించబడలేదు.
- సంఖ్యాకాండము 1:48సుమారు క్రీ.పూ. 1490
యెహోవా మోషేతో ఇలా అన్నారు:
- సంఖ్యాకాండము 1:49సుమారు క్రీ.పూ. 1490
“లేవీయుల గోత్రాన్ని నీవు లెక్క పెట్టకూడదు, ఇశ్రాయేలీయుల జనాభా లెక్కలో చేర్చకూడదు.
- సంఖ్యాకాండము 1:50సుమారు క్రీ.పూ. 1490
దానికి బదులుగా సాక్షి గుడారం లేదా సాక్షి గుడారం మీద, దాని ఉపకరణాల మీద, దానికి సంబంధించిన అన్నిటి మీద లేవీయులను నియమించు. వారు సమావేశ గుడారాన్ని, దాని ఉపకరణాలన్నిటిని మోయాలి; వారు దాని చుట్టూ ఉంటూ దానిని చూసుకోవాలి.