- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
ఈ కాలపు వచనాలు
- సంఖ్యాకాండము 2:22సుమారు క్రీ.పూ. 1490
వారి ప్రక్కన బెన్యామీను గోత్రం వారు దిగాలి. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీను ప్రజల నాయకుడు.
- సంఖ్యాకాండము 2:23సుమారు క్రీ.పూ. 1490
అతని దళంలో ఉన్నవారు 35,400.
- సంఖ్యాకాండము 2:24సుమారు క్రీ.పూ. 1490
ఎఫ్రాయిం శిబిరానికి వారి వారి దళాల ప్రకారం కేటాయించబడిన వారందరు, 1,08,100. వీరు మూడవ గుంపుగా వెళ్తారు.
- సంఖ్యాకాండము 2:25సుమారు క్రీ.పూ. 1490
ఉత్తరం వైపున: దాను గోత్రం వారు వారి జెండా దగ్గర ఉండాలి. అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు దాను ప్రజల నాయకుడు.
- సంఖ్యాకాండము 2:26సుమారు క్రీ.పూ. 1490
అతని దళంలో ఉన్న వారి సంఖ్య 62,700.
- సంఖ్యాకాండము 2:27సుమారు క్రీ.పూ. 1490
ఆషేరు గోత్రం వారు వారి ప్రక్కన దిగాలి. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు ప్రజల నాయకుడు.
- సంఖ్యాకాండము 2:28సుమారు క్రీ.పూ. 1490
అతని దళంలో ఉన్నవారు 41,500.
- సంఖ్యాకాండము 2:29సుమారు క్రీ.పూ. 1490
వారి ప్రక్కన నఫ్తాలి గోత్రం వారు దిగాలి. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి ప్రజల నాయకుడు.
- సంఖ్యాకాండము 2:30సుమారు క్రీ.పూ. 1490
అతని దళంలో ఉన్నవారు 53,400.
- సంఖ్యాకాండము 2:31సుమారు క్రీ.పూ. 1490
దాను శిబిరానికి వారి వారి దళాల ప్రకారం కేటాయించబడిన వారందరు, 1,57,600. వీళ్ళు తమ ధ్వజాల ప్రకారం చివరి గుంపుగా జెండాల క్రింద వెళ్తారు.
- సంఖ్యాకాండము 2:32సుమారు క్రీ.పూ. 1490
వారి వారి కుటుంబాల పరంగా లెక్కించబడినవారు ఇశ్రాయేలీయులు వీరు. విభజనల ప్రకారం శిబిరాలలో ఉన్న పురుషులు 6,03,550.
- సంఖ్యాకాండము 2:33సుమారు క్రీ.పూ. 1490
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులను ఇతర ఇశ్రాయేలీయులతో లెక్కించలేదు.
- సంఖ్యాకాండము 2:34సుమారు క్రీ.పూ. 1490
కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా ఇశ్రాయేలీయులు చేశారు; ఆ ప్రకారం వారు గుడారాలు వేసుకున్నారు, ఆ విధంగా వారి వారి వంశం, కుటుంబంతో ప్రయాణిస్తారు.
- సంఖ్యాకాండము 3:1సుమారు క్రీ.పూ. 1490
యెహోవా మోషేతో సీనాయి కొండమీద మాట్లాడిన సమయంలో ఉన్న అహరోను మోషేల వంశావళి ఇదే.
- సంఖ్యాకాండము 3:2సుమారు క్రీ.పూ. 1490
అహరోను కుమారుల పేర్లు: మొదటి సంతానమైన నాదాబు, అబీహు, ఎలియాజరు ఈతామారు.
- సంఖ్యాకాండము 3:3సుమారు క్రీ.పూ. 1490
అవి అహరోను కుమారుల పేర్లు; వీరు అభిషేకించబడిన యాజకులు; వీరు యాజకులుగా సేవ చేయడానికి ప్రతిష్ఠించబడ్డారు.
- సంఖ్యాకాండము 3:4సుమారు క్రీ.పూ. 1490
నాదాబు అబీహులు సీనాయి అరణ్యంలో యెహోవా ఎదుట అనధికార అగ్నితో అర్పణ అర్పించినందుకు ఆయన ఎదుటే చనిపోయారు. వారికి కుమారులు లేరు కాబట్టి అహరోను జీవితకాలమంతా, తన కుమారులైన ఎలియాజరు, ఈతామారు యాజకులుగా సేవ చేశారు.
- సంఖ్యాకాండము 3:5సుమారు క్రీ.పూ. 1490
యెహోవా మోషేతో ఇలా చెప్పారు,
- సంఖ్యాకాండము 3:6సుమారు క్రీ.పూ. 1490
“లేవీ గోత్రం వారిని తీసుకువచ్చి యాజకుడైన అహరోనుకు సహాయం చేయడానికి అతని ఎదుట నిలబెట్టు.
- సంఖ్యాకాండము 3:7సుమారు క్రీ.పూ. 1490
వారు సమావేశ గుడారపు సేవ చేస్తూ సమావేశ గుడారం దగ్గర అతని తరపున సమాజమంతటి తరపున విధులు నిర్వర్తిస్తారు.
- సంఖ్యాకాండము 3:8సుమారు క్రీ.పూ. 1490
ప్రత్యక్ష గుడారపు పని చేయడం ద్వారా ఇశ్రాయేలీయుల బాధ్యతలను నెరవేరుస్తూ, వారు సమావేశ గుడారపు సామాగ్రి అంతా చూసుకోవాలి.
- సంఖ్యాకాండము 3:9సుమారు క్రీ.పూ. 1490
లేవీయులను అహరోనుకు అతని కుమారులకు అప్పగించు; వారు సంపూర్ణంగా అతని స్వాధీనం చేయబడిన ఇశ్రాయేలీయులు.
- సంఖ్యాకాండము 3:10సుమారు క్రీ.పూ. 1490
యాజకులుగా సేవ చేయడానికి అహరోనును, అతని కుమారులను నియమించు; ఎవరైనా పరిశుద్ధాలయం దగ్గరకు వస్తే వారికి మరణశిక్ష విధించబడుతుంది.”
- సంఖ్యాకాండము 3:11సుమారు క్రీ.పూ. 1490
యెహోవా మోషేతో ఇలా కూడా చెప్పారు,
- సంఖ్యాకాండము 3:12సుమారు క్రీ.పూ. 1490
“ఇశ్రాయేలు ప్రజల్లో తొలి మగ సంతానం స్థానంలో నేను లేవీయులను తీసుకున్నాను. లేవీయులు నావారు,