కంటెంట్‌కు వెళ్లండి

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సంఖ్యాకాండము 3:38సుమారు క్రీ.పూ. 1490

    మోషే, అహరోను, అతని కుమారులు సమావేశ గుడారానికి తూర్పున, అనగా సూర్యుడు ఉదయించే వైపున సమావేశ గుడారానికి ఎదురుగా ఉండాలి. ఇశ్రాయేలీయుల పక్షంగా పరిశుద్ధాలయాన్ని కాపాడే బాధ్యత వీరిది. ఇతరులెవరైనా పరిశుద్ధాలయాన్ని సమీపిస్తే వారికి మరణశిక్ష.

  2. సంఖ్యాకాండము 3:39సుమారు క్రీ.పూ. 1490

    యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం మోషే అహరోనుల ద్వారా లెక్కించబడిన లేవీయులు, వారి వారి వంశాల ప్రకారం ఒక నెల ఆపై వయస్సున్న మగవారందరి సంఖ్య 22,000.

  3. సంఖ్యాకాండము 3:40సుమారు క్రీ.పూ. 1490

    యెహోవా మోషేతో, “ఒక నెల లేదా ఆపై వయస్సున్న ఇశ్రాయేలీయుల తొలిసంతానమైన మగవారిని లెక్కించండి, వారి పేర్ల జాబితాను తయారుచేయండి.

  4. సంఖ్యాకాండము 3:41సుమారు క్రీ.పూ. 1490

    ఇశ్రాయేలీయుల్లోని తొలిసంతానానికి బదులు లేవీయులను, ఇశ్రాయేలీయుల పశువుల్లో తొలిసంతానానికి బదులు లేవీయుల పశువులను నా కోసం తీసుకోవాలి. నేను యెహోవానై యున్నాను.”

  5. సంఖ్యాకాండము 3:42సుమారు క్రీ.పూ. 1490

    కాబట్టి మోషే యెహోవా ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలీయులలో తొలిసంతానాన్ని లెక్కించాడు.

  6. సంఖ్యాకాండము 3:43సుమారు క్రీ.పూ. 1490

    ఒక నెల లేదా ఆ పైబడి వయస్సుగల మొదటి సంతానమైన మగవారందరు 22,273 మంది.

  7. సంఖ్యాకాండము 3:44సుమారు క్రీ.పూ. 1490

    యెహోవా మోషేకు ఇలా కూడా చెప్పారు.

  8. సంఖ్యాకాండము 3:45సుమారు క్రీ.పూ. 1490

    “ఇశ్రాయేలీయుల తొలి సంతానమంతటికి బదులు లేవీయులను, వారి పశువుల్లో తొలిసంతానానికి బదులు లేవీయుల పశువులను నా కోసం తీసుకో. లేవీయులు నా వారిగా ఉండాలి. నేనే యెహోవాను.

  9. సంఖ్యాకాండము 3:46సుమారు క్రీ.పూ. 1490

    లేవీయుల కంటే ఇశ్రాయేలీయులు 273 మంది ఎక్కువ ఉన్నారు. వీరిని విడిపించడానికి,

  10. సంఖ్యాకాండము 3:47సుమారు క్రీ.పూ. 1490

    పరిశుద్ధాలయం యొక్క షెకెల్ చొప్పున, ఒక్క షెకెల్ అంటే ఇరవై గెరాలు, ఒక్కొక్కరికి అయిదు షెకెళ్ళ వెండి తీసుకోవాలి.

  11. సంఖ్యాకాండము 3:48సుమారు క్రీ.పూ. 1490

    ఆ మిగిలిన ఇశ్రాయేలీయుల విమోచన కోసం అహరోనుకు అతని కుమారులకు ఆ డబ్బు ఇవ్వాలి.”

  12. సంఖ్యాకాండము 3:49సుమారు క్రీ.పూ. 1490

    కాబట్టి మోషే లేవీయుల ద్వారా విడిపించబడిన వారికంటే ఎక్కువగా ఉన్న వారి నుండి విమోచన డబ్బు తీసుకున్నాడు.

  13. సంఖ్యాకాండము 3:50సుమారు క్రీ.పూ. 1490

    ఇశ్రాయేలీయులలో తొలిసంతానం నుండి పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం మోషే 1,365 షెకెళ్ళ వెండి తీసుకున్నాడు.

  14. సంఖ్యాకాండము 3:51సుమారు క్రీ.పూ. 1490

    యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మోషే విమోచన డబ్బును అహరోను అతని కుమారులకు ఇచ్చాడు.

  15. సంఖ్యాకాండము 4:1సుమారు క్రీ.పూ. 1490

    యెహోవా మోషే అహరోనులకు ఇలా చెప్పారు:

  16. సంఖ్యాకాండము 4:2సుమారు క్రీ.పూ. 1490

    “లేవీ గోత్రంలో కహాతు వంశాల, కుటుంబాల ప్రకారం జనాభా లెక్కలు తీసుకోండి.

  17. సంఖ్యాకాండము 4:3సుమారు క్రీ.పూ. 1490

    సమావేశ గుడారంలో సేవ చేయడానికి వచ్చే ముప్పై నుండి యాభై సంవత్సరాల లోపు వయస్సున్న పురుషులందరినీ లెక్కించు.

  18. సంఖ్యాకాండము 4:4సుమారు క్రీ.పూ. 1490

    “కహాతీయులు సమావేశ గుడారంలో చేయాల్సిన పని: అతిపరిశుద్ధమైనవాటిని జాగ్రత్తగా చూసుకోవడము.

  19. సంఖ్యాకాండము 4:5సుమారు క్రీ.పూ. 1490

    ప్రజలు ప్రయాణించాల్సి వచ్చినప్పుడు అహరోను అతని కుమారులు లోపలికి వెళ్లి అడ్డతెర దించి నిబంధన మందసం మీద కప్పాలి.

  20. సంఖ్యాకాండము 4:6సుమారు క్రీ.పూ. 1490

    తర్వాత వారు ఆ తెరను మన్నికైన తోలుతో కప్పి, దానిపై నీలిరంగు బట్ట పరిచి మోతకర్రలను వాటి ఉంగరాల్లో దూర్చాలి.

  21. సంఖ్యాకాండము 4:7సుమారు క్రీ.పూ. 1490

    “వారు సన్నిధి బల్లమీద నీలిరంగు బట్టను పరిచి దాని మీద పళ్లాలను, పాత్రలు, గిన్నెలు, పానార్పణ కోసం జాడీలను ఉంచాలి; రొట్టె ఎప్పుడూ దాని మీద ఉండాలి.

  22. సంఖ్యాకాండము 4:8సుమారు క్రీ.పూ. 1490

    వారు వాటి మీద ఎర్రబట్ట పరిచి, మన్నికైన తోలుతో దాన్ని కప్పి, మోతకర్రలను ఉంగరాల్లో దూర్చాలి.

  23. సంఖ్యాకాండము 4:9సుమారు క్రీ.పూ. 1490

    “వారు నీలిరంగు బట్ట తీసుకుని దీపస్తంభాన్ని, దాని దీపాలను, వత్తులు కత్తిరించే కత్తెరలను, వాటి పళ్లాలను, దీపాల్లో పోసే ఒలీవనూనె జాడీలన్నిటిని కప్పాలి.

  24. సంఖ్యాకాండము 4:10సుమారు క్రీ.పూ. 1490

    తర్వాత వారు దానిని, దాని ఉపకరణాలన్నిటిని మన్నికైన తోలుతో చుట్టి మోసుకెళ్లే పలక మీద ఉంచాలి.

  25. సంఖ్యాకాండము 4:11సుమారు క్రీ.పూ. 1490

    “బంగారు బలిపీఠం మీద వారు నీలిరంగు బట్ట పరిచి, దాన్ని మన్నికైన తోలుతో కప్పి, మోతకర్రలను వాటి ఉంగరాల్లో దూర్చాలి.